...
...
Next Story

బిగ్ బాస్ నుంచి ఇవాళ భరణి శంకర్ ఎలిమినేట్- అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్- 6 వారాల్లో ఈ సీరియల్ విలన్ ఎంత సంపాదించాడంటే?

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ జరగనుంది. ఇవాళ బిగ్ బాస్ 9 తెలుగు నుంచి భరణి శంకర్ ఎలిమినేటర్ కానున్నాడు. అయితే, టాప్ 2 కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న భరణి శంకర్‌కు అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారు. మరి 6 వారాల్లో భరణి శంకర్ ఎంత సంపాదించాడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 19, 2025, 07:51:51 IST
Advertisement

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ బాగానే సాగుతోంది. అయితే, హౌజ్‌లో గొడవలు, ఊహించని ఎలిమినేషన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత ఆట మరింత జోరందుకుంది. అయితే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత మొదటి వారం షాకింగ్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది.

ఆరో వారం నామినేషన్స్

బిగ్ బాస్ నుంచి ఇవాళ భరణి శంకర్ ఎలిమినేట్- అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్- 6 వారాల్లో ఈ సీరియల్ విలన్ ఎంత సంపాదించాడంటే?
బిగ్ బాస్ నుంచి ఇవాళ భరణి శంకర్ ఎలిమినేట్- అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్- 6 వారాల్లో ఈ సీరియల్ విలన్ ఎంత సంపాదించాడంటే?

బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న ప్రారంభమై ఇప్పటికి ఆరు వారాలు పూర్తి చేసుకుంది. గత ఐదు వారాల్లో కొంతమంది ఎలిమినేషన్, మరికొంతమంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో సాగింది. బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ 2.O తర్వాత హౌజ్‌లో మొత్తంగా 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారికి ఆరో వారం నామినేషన్ ప్రక్రియ పెట్టారు.

బిగ్ బాస్ తెలుగు 9 ఆరో వారం నామినేషన్స్‌లో తనూజ పుట్టస్వామి, సుమన్ శెట్టి, దివ్య నిఖితా, డిమోన్ పవన్, భరణి శంకర్, రాము రాథోడ్ ఆరుగురు ఉన్నారు. వీరికి ఓటింగ్ పోల్స్ పెట్టారు. అయితే, వీరిలో చివరి రెండు ప్లేసుల్లో డేంజర్ జోన్‌లో రాము రాథోడ్, భరణి శంకర్ ఇద్దరు ఉన్నారు. వీరిలో ఊహించని విధంగా భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు.

రాము రాథోడ్-భరణి శంకర్ మధ్య

బిగ్ బాస్ తెలుగు 9 ఈవారం ఎలిమినేషన్‌కు సంబంధించిన షూటింగ్ శనివారం (అక్టోబర్ 18) నాడే పూర్తయిపోయింది. ఇవాళ (అక్టోబర్ 19) బిగ్ బాస్ 9 తెలుగు ఆరో వారం ఎలిమినేషన్ ప్రసారం చేయనున్నారు. రాము రాథోడ్, భరణి శంకర్ ఇద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ సాగింది. వారిలో రాము రాథోడ్ సేఫ్ కాగా భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యాడు.

ఈ లెక్కన ఆరు వారాల్లో భరణి శంకర్‌కు బిగ్ బాస్ ద్వారా రూ. 21 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నాడు. అంటే, హౌజ్‌లోనే అందరికంటే అత్యధికంగా భరణి శంకర్ పారితోషికం ఉంది. ఇకపోతే భరణి శంకర్ బుల్లితెర సీరియల్స్‌లో విలన్‌గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు.

విలన్‌గానే కాకుండా ఇతర పాత్రలతో మొత్తంగా 30కిపైగా సీరియల్స్ చేశారు భరణి శంకర్. అంతేకాకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో సహాయక పాత్రల్లో కూడా మెరిశారు భరణి శంకర్.

భరణి శంకర్ సీరియల్స్, సినిమాలు

సీతామహాలక్ష్మి, తరంగాలు, కుంకుమ రేఖ, అమ్మకోస, త్రిశూలం వంటి ఎన్నో సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భరణి శంకర్. ఇవే కాకుండా ఆవిరి, క్రేజీ అంకుల్స్, ధీర, గీతా సాక్షిగా, సీడీ క్రిమినల్ ఆర్ డెవిల్ వంటి సినిమాల్లోనూ నటించారు బిగ్ బాస్ నుంచి ఇవాళ ఎలిమినేట్ అయిన భరణి శంకర్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks