బిగ్ బాస్ 9 తెలుగు పదకొండో వారానికి చేరుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 9 పదోవారంలో డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ 9 తెలుగు గత వారం సీరియల్ నటులు నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయ్యారు. ఈ ఇద్దరితో ఒకేసారి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ నిర్వహించారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల

ఈ బిగ్ బాస్ తెలుగు 9 బజ్ ఇంటర్వ్యూలో శివాజీ అడిగిన ప్రశ్నలకు నిఖిల్, గౌరవ్ నవ్వుతూనే సమాధానం చెప్పారు. ముందుగా నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలోకి కలిసి అడుగుపెట్టారు. "ఆహా వీళ్లిద్దరిని చూస్తుంటే గుండమ్మ కథలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల లేరు (ఉన్నారనే అర్థంలో)" అని హీరో శివాజీ అన్నాడు.
హైడ్ అండ్ సీక్ బాగా ఆడావ్
దానికి నిఖిల్ నాయర్ షాక్ అయి "నిజమా.." అని అన్నాడు. "నిఖిల్ హౌజ్‌లో హైడ్ అండ్ సీక్ బాగా ఆడావ్. స్టార్టింగ్‌లో వెళ్లావ్. మళ్లీ ఇప్పుడే కనపడ్డావ్ నాకు. మధ్యలో అంతా హైడే (కనిపించలేదన్న అర్థంలో)" అని శివాజీ అన్నాడు. దానికి ముగ్గురు నవ్వారు.
జర్నలిస్ట్ అయ్యావేంటీ
"గౌరవ్ మీరేంటీ బేసిక్‌గా ఆర్టిస్టా" అని శివాజీ అడిగితే "అవును" అని గౌరవ్ చెప్పాడు. "మరి హౌజ్‌లోకి వెళ్లాకా జర్నలిస్ట్ అయ్యారేంటీ" అని పంచ్ ఇచ్చాడు శివాజీ. దానికి గౌరవ్ నవ్వాడు. "ఆడియెన్స్‌ను గెలవాలంటే.. హౌజ్‌మేట్స్‌ను గెలవాలి" అని శివాజీ అన్నాడు.
కనపడితే కదా పాయింట్స్ ఉండేది
"హౌజ్‌మేట్స్‌ను గెలిచాను. అందుకే నేను వచ్చిన ఐదో వారం నామినేషన్స్‌లో ఉన్నాను. వారికి నామినేట్ చేసేందుకు పాయింట్స్ లేవు" అని నిఖిల్ నాయర్ చెప్పుకొచ్చాడు. "పాయింట్స్ ఉండాలంటే మీరు కనపడాలి" అని శివాజీ పంచ్ ఇచ్చాడు. దానికి "కరెక్టే కరెక్టే" అని గౌరవ్ అన్నాడు. "ఆడు చూడు కరెక్ట్ అంటున్నాడు" అని శివాజీ నవ్వుతూ అన్నాడు.
నాకు ఏం తెలియదు సర్
{{/usCountry}}"హౌజ్‌మేట్స్‌ను గెలిచాను. అందుకే నేను వచ్చిన ఐదో వారం నామినేషన్స్‌లో ఉన్నాను. వారికి నామినేట్ చేసేందుకు పాయింట్స్ లేవు" అని నిఖిల్ నాయర్ చెప్పుకొచ్చాడు. "పాయింట్స్ ఉండాలంటే మీరు కనపడాలి" అని శివాజీ పంచ్ ఇచ్చాడు. దానికి "కరెక్టే కరెక్టే" అని గౌరవ్ అన్నాడు. "ఆడు చూడు కరెక్ట్ అంటున్నాడు" అని శివాజీ నవ్వుతూ అన్నాడు.
నాకు ఏం తెలియదు సర్
{{/usCountry}}"క్లీన్ చేయాలంటే గొడవ, పిలిచారంటే గొడవ.. ఏంటీ ఈ గొడవలు" అని శివాజీ అడిగాడు. "నాకు ఏం తెలియదు సర్" అని గౌరవ్ అన్నాడు. "అదే కదా నేను చెప్పేది మీకు ఏం తెలియదూ.. ఎందుకు వెళ్లారు అని కదా" అని శివాజీ అన్నాడు. దానికి గౌరవ్ నవ్వాడు. "అడుగుతుంటే నవ్వుతావేంటీ గురు. ఓరి బాబు ఏంట్రా ఇది" అని శివాజీ అన్నాడు.
నేను పడుకుంటా
"నువ్వు అతను తప్పులు చెప్పు.. మీరు వాడు ఏం చేశాడో చెప్పు. మీరిద్దరు తప్పులు చెప్పండి. ఈలోపు నేను కాసేపు పడుకుంటా" అని సోఫాపై పడుకున్నాడు హీరో శివాజీ. దానికి ఇద్దరు నవ్వారు. అలా శివాజీతో నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ సాగింది.