ఆర్మీ జవాన్ నుంచి జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ వ‌ర‌కు-బిగ్ బాస్ 9 టాప్ 5 వీళ్లే-మ‌రి 50 ల‌క్ష‌లు గెలిచేదెవ‌రో?

బిగ్ బాస్ 9 తెలుగులో సస్పెన్స్ కు తెరపడింది. టాప్-5 ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఫైనల్ చేరిన అయిదుగురు ఎవరో తేలిపోయింది. మరి వీళ్లలో ట్రోఫీ కొట్టేదెవరు? రూ.50 లక్షలు పట్టేదెవరు? 

Dec 15, 2025, 09:21:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగులో క్లైమాక్స్ కు రంగం సిద్ధమైంది. 15 వారాల ఈ రియాలిటీ షో సీజన్ లో అత్యంత కీలకమైన చివరి వారం వచ్చేసింది. ఇక ఈ సీజన్ లో మిగిలింది ఒక్క వారమే. ఈ నేపథ్యంలో ఫైనల్ చేరిన టాప్-5 కంటెస్టెంట్లు ఎవరో తెలిసిపోయింది. పడాల కల్యాణ్, ఇమ్మాన్యుయెల్, తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్, సంజన గల్రానీ బిగ్ బాస్ 9 తెలుగు ఫినాలేకి అర్హత సాధించారు.

బిగ్ బాస్ 9 తెలుగు టాప్ 5 (youtube)
బిగ్ బాస్ 9 తెలుగు టాప్ 5 (youtube)

డబుల్ ఎలిమినేషన్ తో

బిగ్ బాస్ 9 తెలుగులో గత వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. సుమన్ శెట్టి శనివారం, భరణి శంకర్ ఆదివారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. దీంతో హౌస్ లో అయిదుగురు మిగిలారు. కల్యాణ్, తనూజ, సంజన, ఇమ్మాన్యుయెల్, పవన్ టాప్-5లో చోటు దక్కించుకున్నారు. ఇక టైటిల్ రేసులో ఉన్న ఈ అయిదుగురిలో ఎవరు విజేతగా నిలుస్తారో అనే ఉత్కంఠ మొదలైంది.

రూ.50 లక్షలు

బిగ్ బాస్ ప్రైజ్ మనీని హోస్ట్ నాగార్జున ప్రకటించేశారు. ఈ 9వ సీజన్ లో విన్నర్ కు రూ.50 లక్షలు వస్తాయని అనౌన్స్ చేశారు. మరి ఈ అయిదుగురిలో ఆ అరకోటి ఎవరు సొంతం చేసుకుంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ టాప్-5లో ఒక్కొక్కరిది ఒక్కో బ్యాక్ గ్రౌండ్. హౌస్ లో జర్నీ కూడా ఒక్కొక్కరిది డిఫరెంట్. ఇక టైటిల్ విన్నర్ ను తేల్చేందుకు ఓటు వేయాలని నాగార్జున చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆడియన్స్ చేతుల్లోనే పవర్ ఉంది.

ఆర్మీ జవాన్ నుంచి

బిగ్ బాస్ 9 తెలుగు టాప్-5 చేరిన వాళ్లలో వేర్వేరు నేపథ్యాలున్న కంటెస్టెంట్లున్నారు. పడాల కల్యాణ్ ఆర్మీ జవాన్. సైన్యంలో పని చేసే అతను సినిమాలు, బిగ్ బాస్ పై ఇష్టంతో ఈ అవకాశాన్ని వదులుకోలేదు. అగ్నిపరీక్షలో నెగ్గి హౌస్ లో అడుగుపెట్టాడు. టాస్క్ ల్లో ఇరగదీశాడు. ఏ విషయాన్నయినా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్తూ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. టాస్క్ ల్లో గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ కప్ సొంతం చేసుకున్నాడు.

ఇక జబర్దస్త్ షోతో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుని, సినిమాల్లోనూ రాణిస్తున్న ఇమ్మాన్యుయెల్ సెకండ్ ఫైనలిస్ట్ గా ఫినాలే చేరాడు. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి నవ్విస్తూ, టాస్క్ లు ఆడేస్తూ ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు ఇమ్ము. మరోవైపు ముద్ద మందారం సీరియల్ తో తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన తనూజ పుట్టస్వామి, బుజ్జిగాడు సినిమాలో అలరించిన సంజన గల్రానీ, కామనర్ గా వచ్చి సెలబ్రిటీగా మారిపోయిన డీమాన్ పవన్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More