దివ్య ఔట్‌-మిగిలింది 8 మంది-బిగ్ బాస్ టాప్‌-5 వీళ్లే-టైటిల్ ఎవ‌రిదంటే? హిస్ట‌రీకి చేరువ‌గా హీరోయిన్!

బిగ్ బాస్ 9 తెలుగు ముగింపు దిశగా సాగుతోంది. గత వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. ఇప్పుడు హౌస్ లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మరో మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ టాప్-5, విన్నర్ ఎవరనేది ఉత్కంఠగా మారింది. 

Published on: Dec 1, 2025, 11:08:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఎండింగ్ దిశగా సాగిపోతోంది. ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. హౌస్ లో ఇప్పుడు 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. తనూజ పుట్టస్వామి, రీతు చౌదరి, డీమాన్ పవన్, పడాల కల్యాణ్, సంజన, భరణి, సుమన్ శెట్టి, ఇమ్యాన్యుయేల్ ఉన్నారు. గత వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయిపోయింది. మరి వీళ్లలో టాప్-5లో నిలిచేది ఎవరు? విన్నర్ గా ట్రోఫీని ముద్దాడేదెవరో? చూసేద్దాం.

బిగ్ బాస్ 9 తెలుగు (youtube)
బిగ్ బాస్ 9 తెలుగు (youtube)

బిగ్ బాస్ 9 టాప్ 5

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. 13వ వారం వచ్చేసరికి 8 మంది కంటెస్టెంట్లు మిగిలారు. ఇందులో టాప్-5 ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే అభిమానుల ఓటింగ్, సోషల్ మీడియా క్రేజ్, హౌస్ లో పర్ఫార్మెన్స్ బట్టి టాప్-5 వీళ్లే నంటూ క్రేజీ బజ్ ఒకటి తెగ వైరల్ గా మారింది. మరి ఆ టాప్-5 కంటెస్టెంట్ లు ఎవరన్నది సస్పెన్స్ రేపుతోంది.

అయిదుగురు వీళ్లే

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో టాప్-5లో కచ్చితంగా ఉండేలా కనిపిస్తున్న కంటెస్టెంట్లు తనూజ పుట్టస్వామి, పడాల కల్యాణ్, ఇమ్మాన్యుయేల్. వీళ్లు ముగ్గురు కచ్చితంగా టాప్-3లో ఉంటారని సోషల్ మీడియా, రివ్యూవర్లు కోడై కూస్తున్నారు. మరి టాప్-5లో నిలిచే మిగతా ఇద్దరు ఎవరూ అనే చర్చ సాగుతోంది. మిగిలిన వాళ్లను చూసుకుంటే భరణి, సంజన, రీతు, సుమన్ శెట్టి, పవన్ లో పవన్, సంజన కాస్త బెటర్ గా కనిపిస్తున్నారు.

అంటే తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ తో పాటు పవన్, సంజన కలిసి బిగ్ బాస్ 9 తెలుగు టాప్-5లో నిలిచే అవకాశముంది. ఒకవేళ ఏమైనా సమీకరణాలు మారి, ఓటింగ్ లోనూ భారీ తేడా వస్తే మాత్రం రీతు చౌదరి, భరణికి కూడా ఛాన్స్ దొరుకుతుందనే టాక్ వినిపిస్తోంది.

బిగ్ బాస్ విన్నర్

15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో సమయాన్ని గడిపి, టాస్క్ లు ఆడి, కో కంటెస్టెంట్లను దాటుకుని ఒకరే విన్నర్ గా నిలుస్తారు. ఈ సారి 9వ సీజన్ లో ఆ విన్నర్ ఎవరనేది ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే ఓటింగ్, పర్ఫార్మెన్స్ రెండూ కలిపి చూసుకుంటే సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి విన్నర్ అయేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు. రివ్యూవర్లు కూడా ఇదే మాట చెబుతున్నారు.

హిస్టరీకి దగ్గరగా

ఇప్పటివరకూ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో రెగ్యులర్ సీజన్లలో ఎప్పుడూ మహిళా కంటెస్టెంట్ విజేతగా నిలవలేదు. ఓటీటీ బిగ్ బాస్ లో మాత్రం బిందు మాధవి టైటిల్ గెలిచింది. ఈ సారి తనూజ విజేతగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే టైటిల్ రేసులో కల్యాణ్ కూడా గట్టి పోటీనిస్తున్నాడు. ఓటింగ్ పరంగా చూస్తే వీళ్లిద్దరే టాప్ 2లో కొనసాగుతున్నారు. మరోవైపు ఇమ్మాన్యుయేల్ కూడా గట్టిగానే పోరాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More