హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు-కెప్టెన్సీ పోరు-డీమాన్ పవన్‌పై విపరీతమైన ట్రోల్స్-బిగ్ బాస్ ఓటింగ్‌లో ట్విస్ట్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఇంకా కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్ లో ఈ వారమే చివరి కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా మాజీ కంటెస్టెంట్లు హౌస్ లోకి వస్తున్నారు. మరోవైపు డీమాన్ పవన్ పై తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ ఓటింగ్ లో ట్విస్ట్ నెలకొంది.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 12వ వారానికి చేరుకుంది. 15 వారాలకు ఇంకా మూడు వారాలు మాత్రమే ఉన్నాయి. ఈ సీజన్ ఎండింగ్ దిశగా సాగుతోంది. ట్రోఫీని అందుకునే కంటెస్టెంట్ ఎవరన్నది ఉత్కంఠగా మారింది. ఈ వారం హౌస్ లోని పరిణామాలు మొత్తం సినారియోనే మార్చేశాయి. ఇక 12వ వారం కెప్టెన్సీ టాస్క్ కూడా విభిన్నంగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ 9 తెలుగు (youtube)
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 12వ వారం కెప్టెన్సీ టాస్క్ డిఫరెంట్ గా ఉంది. కంటెండర్ షిప్ కోసం హౌస్ మేట్స్ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లతో పోటీపడుతున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ గౌతమ్ కృష్ణ హౌస్ లోకి వచ్చాడు. అతనితో భరణి పోటీపడి గెలిచాడు.
పవన్ పై ట్రోల్స్
ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరైన డీమాన్ పవన్ పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాతో అతణ్ని గట్టిగానే వేసుకుంటున్నారు. అందుకు కారణం పడాల కల్యాణ్ తో గొడవ. పవన్ మంచి కోసం చెెప్పిన కల్యాణ్ మెడను అతను పట్టుకోవడం కరెక్ట్ కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అమ్మాయి కోసం కల్యాణ్ తో గొడవ పడటం ఏంటీ? అంటూ డీమాన్ పవన్ బిహేవియర్ ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ గొడవ ఎఫెక్ట్ పవన్ పై గట్టిగానే పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.
బిగ్ బాస్ ఓటింగ్
బిగ్ బాస్ 9 తెెలుగు సీజన్ 12 వారం ఓటింగ్ లో పవన్ కు షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఈ వారం కెప్టెన్ రీతు మినహా తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, భరణి, దివ్య నిఖిత ఉన్నారు. ఎప్పటిలాగే ఓటింగ్ టాప్ లో తనూజ 29.83 శాతం ఓటింగ్ తో కొనసాగుతోంది.
కల్యాణ్ జోరు
గేమ్ ను సరిగ్గా ఆడుతూ, తన వాయిస్ ను బలంగా వినిపిస్తున్న కల్యాణ్ పడాల కూడా ఓటింగ్ లో దూసుకెళ్తున్నాడు. అతను 28.8 శాతం ఓటింగ్ తో రెండో ప్లేస్ లో ఉన్నాడు. ఇమ్యాన్యుయేల్ ఓటింగ్ పర్సంటేజీ కాస్త పడిపోతోంది. అతను 10.9 ఓటింగ్ శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. సంజన 6.82 శాతంతో నాలుగో స్థానంలో ఉంది.
డీమాన్ పవన్ 6.21 శాతం, సుమన్ శెట్టి 5.98 శాతం ఓటింగ్ తో వరుసగా అయిదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. భరణి 5.92 శాతం, దివ్య నిఖిత 5.54 శాతంతో లాస్ట్ రెండు స్థానాల్లో నిలిచి డేంజర్ జోన్లో ఉన్నారు. గత వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న దివ్య ఈ సారి మాత్రం హౌస్ నుంచి వెళ్లిపోయేలా కనిపిస్తోంది.
News/Entertainment/హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు-కెప్టెన్సీ పోరు-డీమాన్ పవన్‌పై విపరీతమైన ట్రోల్స్-బిగ్ బాస్ ఓటింగ్‌లో ట్విస్ట్
News/Entertainment/హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు-కెప్టెన్సీ పోరు-డీమాన్ పవన్‌పై విపరీతమైన ట్రోల్స్-బిగ్ బాస్ ఓటింగ్‌లో ట్విస్ట్