...
...
Next Story

భరణి ట్విస్ట్.. తనూజకు షాక్.. ఫైనలిస్ట్ రేస్ నుంచి ఔట్.. బిగ్ బాస్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే?

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో తనూజకు భరణి దిమ్మతిరిగే షాకిచ్చాడు. టాస్క్ లో తనూజ ఓడిపోవడంలో కీ రోల్ ప్లే చేసి, ఫైనలిస్ట్ రేస్ నుంచి ఆమె తప్పుకునేలా చేశాడు.

Published on: Dec 3, 2025, 13:44:13 IST
Advertisement

బిగ్ బాస్ స్టార్ట్ అయిందో లేదో నాన్న అంటూ భరణితో బాండింగ్ ఫామ్ చేసుకుంది తనూజ. వీళ్ల బంధం తండ్రీకూతురును గుర్తు చేసింది. కానీ ఇప్పుడా తండ్రే కూతురికి షాకిచ్చాడు. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు. భరణి దెబ్బతో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఫైనలిస్ట్ రేస్ నుంచి తనూజ తప్పుకోవాల్సి వచ్చింది.

బిగ్ బాస్ 9 తెలుగు

బిగ్ బాస్ 9 తెలుగు (youtube)
బిగ్ బాస్ 9 తెలుగు (youtube)

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో తనూజ పుట్టస్వామికి షాక్ తగిలింది. ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. సుమన్ శెట్టితో టాస్క్ లో తనూజ ఓడిపోయింది. ఫస్ట్ ఫైనలిస్ట్ రేసులో భాగంగా సుమన్, తనూజ టాస్క్ లో పోటీపడ్డారు. రెండు తాళ్లతో తమ తల మీద ఉన్న బ్యారెల్ ను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కంటెస్టెంట్లు ఇందులో వాటర్ పడేలా ట్యాప్ తిప్పుతారు.

భరణి ట్విస్ట్

సుమన్ శెట్టి, తనూజ టాస్క్ కు సంజన సంచాలక్. బజర్ మోగినప్పుడల్లా సంజన పిలిచిన వాళ్లు వచ్చి ట్యాప్ తిప్పి, ఫైనలిస్ట్ అయేందుకు ఇష్టం లేని వాళ్ల బ్యారెల్ నింపాల్సి ఉంటుంది. ఫస్ట్ భరణిని పిలుస్తుంది సంజన. అతను నేరుగా వెళ్లి తనూజ ట్యాప్ ను తిప్పడంతో అందరూ షాక్ అవుతారు. తనూజ కూడా ఇది ఊహించి ఉండదు.

టాక్స్ లో ఓటమి

ఆ తర్వాత కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతు చౌదరి వెళ్లి సుమన్ బ్యారెల్ ట్యాప్ తిప్పుతారు. బరువు ఎక్కువైనా సుమన్ బ్యాలెన్స్ చేస్తాడు. ఈ సమయంలో పవన్ వెళ్లి తనూజ బ్యారెల్ లోకి వాటర్ వెళ్లేలా ట్యాప్ తిప్పుతాడు. దీంతో బరువు ఆపలేక తనూజ వదిలేస్తుంది. ఓడిపోవడంతో ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి తనూజ ఔట్ అయింది. దీంతో మళ్లీ తనకు అలవాటైన రీతిలో ఏడుస్తూ కూర్చుంది.

ఫస్ట్ ఫైనలిస్ట్

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks