షాకింగ్.. మారిన బిగ్ బాస్ ఓటింగ్.. డేంజర్ జోన్లో రీతు.. హౌస్ లో చెఫ్ సంజయ్ తుమ్మ సందడి
బిగ్ బాస్ 9 తెలుగు పదోవారం ఓటింగ్ రోజురోజుకూ మారుతోంది. నిన్నటివరకూ డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు ఇప్పుడు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. అనూహ్యంగా రీతు ఎలిమినేషన్ కు దగ్గరగా వచ్చింది. ఈ వారం హౌస్ లోకి చెఫ్ సంజయ్ తుమ్మ వచ్చారు.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ పదో వారంలో ఓటింగ్ తారుమారవుతోంది. డేంజర్ జోన్లో ఉన్నవాళ్లు సేఫ్ జోన్లోకు, సేఫ్ జోన్లో ఉన్నవాళ్లు డేంజర్ జోన్లోకు వెళ్తున్నారు. ఈ వారం ఓటింగ్ కాస్త షాకింగ్ గానే ఉంది. ఇప్పుడు రీతు చౌదరి సడెన్ గా ఎలిమినేషన్ కు దగ్గరైంది. ఇక ఈ వారం హౌస్ లోకి చెఫ్ సంజయ్ తుమ్మ వెళ్లారు.
బిగ్ బాస్ 9 తెలుగు ఓటింగ్ (youtube)
బిగ్ బాస్ 9 నామినేషన్స్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో పదో వారం నామినేషన్లలో 10 మంది ఉన్నారు. తనుజ పుట్టస్వామి, కల్యాణ్ పడాల, సుమన్ శెట్టి, భరణి, డీమాన్ పవన్, సంజన గల్రానీ, దివ్య నిఖిత, నిఖిత్ నాయర్, గౌరవ్ గుప్తా, రీతు చౌదరి నామినేషన్లలో ఉన్నారు. ఇందులో నుంచి ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవుతారు.
బిగ్ బాస్ 9 ఓటింగ్
ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్ షాకింగ్ గానే ఉంది. ఎప్పటికప్పుడూ ఓటింగ్ పరంగా చూస్తే కంటెస్టెంట్ల స్థానాలు మారుతున్నాయి. బుధవారం చూస్తే తనుజాను వెనక్కినెట్టి కల్యాణ్ పడాల టాప్ ప్లేస్ లో ఉన్నాడు. కానీ గురువారం ఓటింగ్ చూస్తే తనుజ మళ్లీ టాప్ ప్లేస్ కు వెళ్లిపోయింది. తనుజ 29.82 శాతం, కల్యాణ్ 18.87 శాతం ఓటింగ్ తో వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
పవన్ కు పెరిగిన ఓటింగ్
నిన్నటి వరకు చూస్తే నిఖిల్ నాయర్ తో కలిసి డీమాన్ పవన్ డేంజర్ జోన్లో ఉన్నాడు. కానీ ఇవాళ ఓటింగ్ చూసుకుంటే పవన్ అయిదో ప్లేస్ లోకి వచ్చాడు. సుమన్ శెట్టి (9.31 శాతం), భరణి (9.23 శాతం), పవన్ (6.27 శాతం) ఓటింగ్ తో వరుసగా మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత సంజన (6.16 శాతం), దివ్య నిఖిత (6.04 శాతం), నిఖిల్ నాయర్ (4.89 శాతం) ఉన్నారు.
డేంజర్ జోన్లో రీతు
రీతు చౌదరి, గౌరవ్ గుప్తా ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారు. గౌరవ్ 4.72 ఓటింగ్ శాతంతో 9వ ప్లేస్ లో ఉన్నాడు. రీతు 4.71 శాతంతో లాస్ట్ ప్లేస్ లో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం ఓటింగ్ పరంగా రీతుపై వేటు పడే అవకాశముంది. మరి ఇంకొక్క రోజులో ఏమైనా ఓటింగ్ లో మార్పులు జరుగుతాయేమో చూడాలి.
హౌస్ లో సంజయ్ తుమ్మ
ప్రముఖ చెఫ్ సంజయ్ తుమ్మ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడు. హౌస్ మేట్స్ తో కలిసి సందడి చేశాడు. ఇమ్మాన్యుయేల్ తో కలిసి కామెడీ పండించాడు. హౌస్ మేట్స్ కోసం రుచికరమైన వంటకాలు చేయించాడు.
News/Entertainment/షాకింగ్.. మారిన బిగ్ బాస్ ఓటింగ్.. డేంజర్ జోన్లో రీతు.. హౌస్ లో చెఫ్ సంజయ్ తుమ్మ సందడి
News/Entertainment/షాకింగ్.. మారిన బిగ్ బాస్ ఓటింగ్.. డేంజర్ జోన్లో రీతు.. హౌస్ లో చెఫ్ సంజయ్ తుమ్మ సందడి