...
...
Next Story

లేడీ సింగం.. అది నా పిల్లరా.. తనూజాను చూస్తూ ముద్ద మందారం హీరో డైలాగ్.. హరిత ఎమోషనల్

అది నా పిల్లరా అంటూ తనూజాను చూస్తూ ముద్ద మందారం హీరో పవన్ బిగ్ బాస్ స్టేజీ పై హడావుడి చేశాడు. బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వీకెండ్ లో కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తనూజ కోసం ముద్ద మందారం సీరియల్ టీమ్ వచ్చింది.

Published on: Nov 23, 2025, 16:18:15 IST
Advertisement

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ పదకొండో వారం వీకెండ్ ఎపిసోడ్స్ కొనసాగుతున్నాయి. ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి వీకెండ్ లో కూడా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ లేదా సన్నిహితులు స్టేజీపైకి వస్తున్నారు. హౌస్ మేట్స్ తో మాట్లాడి తప్పొప్పులు చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఆదివారం (నవంబర్ 23) మరికొంత మంది కంటెస్టెంట్లకు సంబంధించిన వాళ్లు స్టేజీ మీదకు రానున్నారు.

బిగ్ బాస్ 9 తెలుగు

బిగ్ బాస్ 9 తెలుగు
బిగ్ బాస్ 9 తెలుగు

బిగ్ బాస్ 9 తెలుగు పదకొండో వారంలో ఇవాళ ఆదివారం తనూజ పుట్టస్వామి కోసం ముద్ద మందారం సీరియల్ టీమ్ స్టేజీపైకి వచ్చింది. ఆ సీరియల్ హీరో పవన్ సాయి, కీ క్యారెక్టర్ హరిత వచ్చారు. వాళ్లను చూడగానే ముఖ్యంగా హరితను చూసి తనూజ ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. హరిత కూడా స్టేజీపై ఎమోషనల్ అయింది. పవన్ ఆమెను ఓదార్చాడు.

నా పిల్లరా

సండే ఎపిసోడ్ లో తనూజ పుట్టస్వామి కోసం పవన్ సాయి, హరిత వచ్చారు. స్టేజీపై ఓ మూవీ పేరు లేదా క్యారెక్టర్ పిక్ చేసి అది ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలి. పవన్ బాక్స్ లో నుంచి అర్జున్ రెడ్డి మూవీ పోస్టర్ తీశాడు. ఈ మూవీలోని ఫేమస్ డైలాగ్ గుర్తుందా అని నాగార్జున అడిగితే.. అది నా పిల్లరా అని పవన్ చెప్పాడు. వెంటనే తనూజ నవ్వేసింది. ఈ ప్రొమో వైరల్ గా మారింది. పవన్ స్టేజీపైకి వస్తూనే తనూజాను లేడీ సింగం అని పిలిచాడు.

చాలా గర్వంగా

తనూజ, పవన్, హరిత లీడ్ రోల్స్ ప్లే చేసిన ముద్ద మందారం సీరియల్ ఎంతటి హిట్ అయిందో తెలిసిందే. 2014 నుంచి 2019 వరకు జీ తెలుగులో వచ్చిన ఈ సీరియల్ 1585 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయింది. ఈ సీరియల్ తో తనూజ తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఇప్పుడు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks