బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇకపై ఆట మరో లెక్క! ముగింపు దిశగా సాగుతున్న ఈ సీజన్ లో అత్యంత కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఫినాలే రేసు వచ్చేసింది. టాప్-5లో చోటు దక్కించుకోవడం కోసం కంటెస్టెంట్ల మధ్య సమరం ప్రారంభమైంది. ఈ వారం ఇవే టాస్క్ లతో హౌస్ రణరంగంగా మారబోతుంది.
బిగ్ బాస్ 9 తెలుగు ఫినాలే

బిగ్ బాస్ 9 తెలుగులో ఇప్పుడు 13వ వారం. హౌస్ లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీళ్లలో నుంచి అయిదుగురు టాప్-5కు వెళ్తారు. ఫైనల్ చేరతారు. ఆ అయిదుగురు ఎవరో నిర్ణయించే పోరు ప్రారంభమైంది. బిగ్ బాస్ హౌస్ లో రేస్ టు ఫినాలే స్టార్ట్ అయింది. హౌస్ మేట్స్ మధ్య పోరు మరో స్థాయికి చేరింది.
తనూజ వర్సెస్ రీతు
రేస్ టు ఫినాలేను బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు. అయిదే ముందుగా ఫస్ట్ రౌండ్ లో పోటీపడే ముగ్గురు కంటెస్టెంట్ల పేర్లను చెప్పమన్నాడు బిగ్ బాస్. ఫస్ట్ పవన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ అని హౌస్ మేట్స్ డిసైడ్ చేశారు. కానీ ఆ తర్వాత నాకూ ఆడాలని ఉందని రీతు రచ్చ స్టార్ట్ చేస్తుంది. మరి ముందే ఎందుకు చెప్పలేదని తనూజ అంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దగానే అయింది. చివరకు కల్యాణ్, రీతు, ఇమ్మాన్యుయేల్ మధ్య మ్యాథ్స్ టాస్క్ జరిగింది.
బిగ్ బాస్ 9 నామినేషన్స్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో 13వ వారం నామినేషన్లలో ఆరుగురున్నారు. తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, రీతు చౌదరి, డీమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి ఈ వారం నామినేట్ అయ్యారు. వీళ్లలో నుంచి ఒకరు లేదా ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
బిగ్ బాస్ ఓటింగ్
{{/usCountry}}బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో 13వ వారం నామినేషన్లలో ఆరుగురున్నారు. తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, రీతు చౌదరి, డీమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి ఈ వారం నామినేట్ అయ్యారు. వీళ్లలో నుంచి ఒకరు లేదా ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
బిగ్ బాస్ ఓటింగ్
{{/usCountry}}ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ కూడా చూసే ఛాన్స్ ఉంది. నామినేషన్లలో ఉన్న ఆరుగురి ప్రస్తుతం ఓటింగ్ చూస్తే సీనియర్ నటులు భరణి, సుమన్ శెట్టి డేంజర్ జోన్లో ఉన్నారు. ఎప్పటిలాగే తనూజ ఓటింగ్ లో అదరగొడుతోంది. 31.36 శాతం ఓట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ తర్వాత సంజన (16.59 శాతం) ఉంది. మూడో ప్లేస్ రీతు (16.53 శాతం)ది. నాలుగో స్థానంలో డీమాన్ పవన్ (12.06 శాతం) ఉన్నాడు.
మరోవైపు భరణి, సుమన్ శెట్టి డేంజర్ జోన్లో కొనసాగుతున్నారు. భరణి 11.89 శాతం ఓటింగ్ తో అయిదో స్థానంలో, సుమన్ శెట్టి 11.57 శాతం ఓటింగ్ తో ఆరో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరిలో ఒకరు లేదా ఇద్దరూ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశముంది.