బిగ్ బాస్ ఓటింగ్‌లో ఫేక్ ఓట్లు- పొజిషన్స్ తారుమారు- టాప్ 5 నుంచి ఫస్ట్ సంజన ఔట్! విన్నర్ ఎవరంటే?
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ విన్నర్ ఎవరో తెలిసేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఓటింగ్ లో ఫేక్ ఓట్లతో రిజల్ట్ తారుమారు కావొచ్చన్న టాక్ వైరల్ గా మారింది.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ విన్నర్ ఎవరు? రూ.50 లక్షలు దక్కించుకునేదెవరు? సూట్ కేస్ తో బయటకు వెళ్లేదెవరు?.. ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకబోతోంది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఫైనల్ రేపే. ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరో తేలిపోతుంది. అయితే బిగ్ బాస్ 9 ఫైనల్ ఓటింగ్ లో ఫేక్ ఓట్ల కారణంగా రిజల్ట్ తారుమారయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
బిగ్ బాస్ 9 ఓటింగ్
బిగ్ బాస్ 9 తెలుగు మరో రోజులో ఎండ్ కానుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరు? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే జనాలు తాము గెలవాలని కోరుకున్న కంటెస్టెంట్లకు ఓట్లు వేసేశారు. ఇక రిజల్ట్ రావడమే మిగిలింది. అయితే ప్రస్తుతం జియోహాట్ స్టార్ లో వచ్చిన ఓట్ల ప్రకారం ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ ట్రోఫీ సొంతం చేసుకోవడం ఖాయమని అంటున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
ఫేక్ ఓట్లు
బిగ్ బాస్ 9 ఓటింగ్ లో ఫేక్ ఓట్లు కలకలం రేపుతున్నాయి. మరోవైపు జియోహాట్ స్టార్ ఓటీటీలో పోలైన ఓట్లు చూసుకుంటే పడాల కల్యాణ్ విన్నర్ అన్నది క్లారిటీగా తెలిసిపోతుంది. అయితే మిస్డ్ కాల్స్ ఓటింగ్స్ ఎవరికి ఎక్కువ పడ్డాయన్న దానిపై ఇప్పుడే సమాచారం లేదు. మరోవైపు బోట్ మెయిల్స్, ఫేక్ మెయిల్స్, ఫేక్ ఐడీలతో వచ్చిన ఓట్లున్నాయి. వీటిని ఎండెమోల్ షైన్ టీమ్ ఫిల్టర్ చేస్తున్నట్లు టాక్.
ఓటింగ్ తారుమారు
ఏ రకంగా చూసుకున్నా బిగ్ బాస్ 9 టైటిల్ కు పడాల కల్యాణ్ చేరువగా ఉన్నాడు. ఓటింగ్ లో అతనికే ఎక్కువ శాతం ఓట్లు పడ్డాయి. మరోవైపు హౌస్ లో పర్ఫార్మెన్స్ పరంగానూ ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. అయితే రెండో స్థానంలో తనూజ పుట్టస్వామి ఉంది. మరోవైపు ఈ ఫేక్ ఓట్లు టాప్-5లో ఉన్న అందరికీ పడ్డాయంటున్నారు. ఈ ఓట్ల ఆడిటింగ్ తర్వాత రిజల్ట్ తారుమారు కావొచ్చనే టాక్ వినిపిస్తోంది.
సంజన ఔట్
బిగ్ బాస్ 9 సీజన్ తెలుగు టాప్-5 నుంచి ఫస్ట్ సంజన ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. పడాల కల్యాణ్, తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయెల్, సంజన టాప్-5లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వీళ్లలో సంజన ఫస్ట్ ఎలిమినేట్ అయిందని సమాచారం. ఇమ్ము గెలవాలని ఆమె కోరుకుంటున్నట్లు తెలిసింది. మరోవైపు టైటిల్ కోసం కల్యాణ్ వర్సెస్ తనూజ పోరు గట్టిగానే సాగుతోంది.
{{/usCountry}}బిగ్ బాస్ 9 సీజన్ తెలుగు టాప్-5 నుంచి ఫస్ట్ సంజన ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. పడాల కల్యాణ్, తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయెల్, సంజన టాప్-5లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వీళ్లలో సంజన ఫస్ట్ ఎలిమినేట్ అయిందని సమాచారం. ఇమ్ము గెలవాలని ఆమె కోరుకుంటున్నట్లు తెలిసింది. మరోవైపు టైటిల్ కోసం కల్యాణ్ వర్సెస్ తనూజ పోరు గట్టిగానే సాగుతోంది.
{{/usCountry}}