...
...
Next Story

Bigg Boss: పూరి జగన్నాథ్ శిష్యుడితో బిగ్ బాస్ అంబటి అర్జున్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- ఆకట్టుకునేలా పరమపద సోపానం పోస్టర్!

Bigg Boss Ambati Arjun Paramapada Sopanam Release Date Poster: బుల్లితెరపై సీరియళ్లు, బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నా అంబటి అర్జున్ నటించిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పరమపద సోపానం. పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ అలరిస్తోంది.

Published on: Apr 13, 2026, 14:09:21 IST
Advertisement

Bigg Boss Ambati Arjun Paramapada Sopanam: 'అర్ధనారి' 'తెప్ప సముద్రం' 'వెడ్డింగ్ డైరీస్' వంటి వైవిద్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి.. అటు తర్వాత బుల్లితెరపై 'బిగ్ బాస్' రియాలిటీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది'లో కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు అర్జున్ అంబటి.

జెన్నిఫర్ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్

పూరి జగన్నాథ్ శిష్యుడితో బిగ్ బాస్ అంబటి అర్జున్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- ఆకట్టుకునేలా పరమపద సోపానం పోస్టర్!
పూరి జగన్నాథ్ శిష్యుడితో బిగ్ బాస్ అంబటి అర్జున్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- ఆకట్టుకునేలా పరమపద సోపానం పోస్టర్!

అయితే, అర్జున్ అంబటి హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'పరమపద సోపానం'. ఈ సినిమాలో అర్జున్ అంబటికి జోడీగా జెన్నిఫర్ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్‌గా నటించింది. పరమపద సోపానం సినిమాను 'గణపర్తి శ్వేత' సమర్పణలో 'స్వయంభూ క్రియేషన్స్' సంస్థపై గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమాకు పులగం సుప్రియ సహ నిర్మాత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు, ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నాగ శివ 'పరమపద సోపానం' చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నాగ శివ.

లిరికల్ సాంగ్స్ అండ్ టీజర్

ఇక మాస్ మహారాజ్ రవితేజ 'ఈగల్' వంటి భారీ బడ్జెట్ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవ్ జాండ్ ఈ పరమపద సోపానం చిత్రానికి సంగీతం అందించారు. ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన పరమపద సోపానం సినిమాలోని 'చిన్ని చిన్ని తప్పులేవో' 'భూమ్ భూమ్' వంటి లిరికల్ సాంగ్స్‌కి, అలాగే టీజర్‌కి విశేషాధారణ లభించింది.

ఓవైపు అర్జున్ అంబటి మొహం ఉంటే మరోవైపు ఏదో కాలుతున్నట్లుగా చూపించారు. చూస్తుంటే ఇది ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తోంది. ఈ పోస్టర్ ద్వారా పరమపద సోపానం కథ, కథనాలపై కూడా అవగాహన కలిగించేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌కి విశేషాదరణ లభిస్తుంది. కాగా, పసుపులేటి సౌమ్య లైన్ ప్రొడ్యూసర్‌గా ఉన్న ఈ సినిమాకు ఈశ్వర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

ఇదిలా ఉంటే, బుల్లితెరపై సీరియల్లలో హీరోగా చేసి తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్న అంబటి అర్జున్ బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ అంబటి తన పర్ఫామెన్స్, స్ట్రాటజీతో చాలా బాగా ఆకట్టుకున్నాడు. టాప్ 5 వరకు చేరుకున్నాడు.

ఫ్యాన్ బేస్ రావడంతో

అయితే, అప్పటికే పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, నటుడు శివాజీకి మంచి ఫ్యాన్ బేస్ రావడంతో అర్జున్ అంబటి టాప్ 3లో నిలబడలేకపోయాడు. కానీ, తన ఆట తీరుపై బిగ్ బాస్ ప్రశంసలు కురిపించారు. బిగ్ బాస్ అనంతరం సినిమాల్లో హీరోగా, కీలక పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు అర్జున్ అంబటి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe