...
...
Next Story

హీరోయిన్లు.. మీ అందం చీరలో ఉంది.. సామాన్లు కనపడేదాంట్లో కాదు: శివాజీ కాంట్రవర్సీ కామెంట్లు

టాలీవుడ్ లో ఒకప్పటి హీరో, సీనియర్ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘాటు మాటలతో కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. హీరోయిన్ల అందం చీరలోనే ఉందని, సామాన్లు కనిపించే వాటిల్లో కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు శివాజీ.

Published on: Dec 23, 2025, 09:46:12 IST
Advertisement

దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్ ల గురించి శివాజీ మాటలు కాంట్రవర్సీకి కారణమయ్యాయి. చీరలో అందం ఉందని, సామాన్లు కనబడేలా బట్టలు వేసుకోకూడదని శివాజీ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

శివాజీ కామెంట్లు

శివాజీ (x)
శివాజీ (x)

సోమవారం (డిసెంబర్ 22) రాత్రి దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు యాంకర్, హీరోయిన్ తో సహా అందరూ పద్ధతిగా దుస్తులు ధరించి వచ్చారు. ఈ క్రమంలోనే శివాజీ మాట్లాడుతూ హీరోయిన్ డ్రెస్ లపై కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. సామాన్లు అంటూ మాట్లాడారు.

సామాన్లు కనపడేలా

‘‘ఒక విషయం చెబుతున్నా. అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తదమ్మా. ఏం అనుకోవద్దు హీరోయిన్లందరూ, మీరు అనుకున్నా నాకు పోయేదేం లేదు. లైట్ తీసుకుంటాం అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనే, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్లు కనపడేదాంట్లో ఏముండదమ్మా’’ అని శివాజీ అన్నారు.

‘‘అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రపు ము*.. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? మంచివి వేసుకోవచ్చు కదా అని అనాలని ఉంటుంది లోపల. కానీ అనలేం కదా. అంటే మళ్లీ స్ట్రీ స్వాతంత్రం లేదంటారు’’ అని శివాజీ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు.

స్త్రీ అంటే ప్ర‌కృతి

‘‘నేనెవరు చెప్పడానికి రేప్పొద్దున పెద్ద పెద్దొల్లంతా బయల్దేరతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదా అని. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛను కోల్పోవద్దు. మన వేష భాషల నుంచే మన గౌరవం పెరుగుతుంది. ప్రపంచ వేదికల మీదైనా సరే చీరలు కట్టుకున్న వాళ్లకే విశ్వ సుందరి కిరీటాలు వచ్చాయి’’ అని శివాజీ ముగించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks