...
...
Next Story

4 కోట్ల స్కామ్‌లో బిగ్ బాస్ రన్నరప్- హనీమూన్‌కు వెళ్తుండగా అరెస్ట్- కుట్ర చేస్తున్నారు, దేనికీ భయపడనంటూ జై రియాక్షన్

రియల్ ఎస్టేట్ మోసం కేసులో బిగ్ బాస్ మరాఠీ 3 రన్నరప్ జై దుధానేను ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, జై దుధానేను మాత్రం తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని, న్యాయస్థానంపై తనకు పూర్తి నమ్మకం ఉందని జై పేర్కొన్నారు.

Published on: Jan 5, 2026, 13:05:22 IST
Advertisement

మరాఠీ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, రన్నరప్ జై దుధానే చిక్కుల్లో పడ్డారు. ఒక రియల్ ఎస్టేట్ స్కామ్‌కు సంబంధించి థానే పోలీసులు ఆయనను ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో కలిసి హనీమూన్‌కు విదేశాలకు వెళ్తున్న తరుణంలో ఈ అరెస్ట్ జరగడం సంచలనం సృష్టించింది.

హనీమూన్ ట్రిప్‌లో ఊహించని మలుపు

4 కోట్ల స్కామ్‌లో బిగ్ బాస్ రన్నరప్- హనీమూన్‌కు వెళ్తుండగా అరెస్ట్- కుట్ర చేస్తున్నారు, దేనికీ భయపడనంటూ జై రియాక్షన్
4 కోట్ల స్కామ్‌లో బిగ్ బాస్ రన్నరప్- హనీమూన్‌కు వెళ్తుండగా అరెస్ట్- కుట్ర చేస్తున్నారు, దేనికీ భయపడనంటూ జై రియాక్షన్

తన అరెస్టుపై జై దుధానే స్పందిస్తూ.. "నేను నా భార్య, సోదరుడు, వదినతో కలిసి హనీమూన్ కోసం విదేశాలకు వెళ్తున్నాను. నాపై లుకౌట్ నోటీసులు ఉన్నాయన్న విషయం కూడా నాకు తెలియదు. పోలీసులు నన్ను అడ్డుకుని, దేశం విడిచి వెళ్లకూడదని చెప్పారు. నేను వారికి పూర్తిగా సహకరిస్తున్నాను" అని తెలిపారు.

పోలీసు వ్యానులో కూర్చుని మీడియాతో మాట్లాడిన జై దుధానే.. ముఖానికి మాస్క్ వేసుకోవడానికి కూడా నిరాకరించారు. "నేను తప్పు చేయలేదు, అలాంటప్పుడు భయపడి ముఖం దాచుకోవాల్సిన అవసరం లేదు" అని ధీమా వ్యక్తం చేశారు.

ఏమిటా రూ. 4.61 కోట్ల ఆరోపణలు?

ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జై, అతని నలుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. థానేలో ఇప్పటికే బ్యాంకులో తాకట్టు పెట్టిన ఐదు కమర్షియల్ షాపులను తమకు అమ్మి మోసం చేశారని బాధితుడు ఆరోపించారు.

ఒకే షాపును పలువురికి అమ్మారన్న వార్తలపై జై స్పందిస్తూ.. "ఒకసారి అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఒకే ఆస్తిని పదిమందికి అమ్మడం అసాధ్యం. ఎవరి వద్దైనా ఆధారాలు ఉంటే చూపమనండి. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోంది" అని కొట్టిపారేశారు.

చట్టంపై నమ్మకం ఉంది

జై దుధానే మోడల్‌గా, ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కెరీర్ ప్రారంభించారు. 2021లో 'స్ల్పిట్స్ విల్లా' విన్నర్‌గా నిలిచిన జై దుధానే ఆ తర్వాత 'బిగ్ బాస్ మరాఠీ సీజన్ 3'లో రన్నరప్‌గా నిలిచి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

వ్యక్తిగత జీవితానికి వస్తే.. గత ఏడాది డిసెంబర్‌లో తన చిరకాల ప్రేయసి హర్షల పాటిల్‌ను వివాహం చేసుకున్నారు జై దుధానే. పెళ్లయిన కొద్దిరోజులకే ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe