...
...
Next Story

OTT: ఓటీటీ షోలో లవ్ ప్రపోజ్- పెళ్లికి ముందే కలిసి ఉండమన్న బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి తల్లి- కూతురుని నమ్మలేనంటూ కండీషన్

Tejasswi Prakash Mother Live In Relationship Condition: బుల్లితెర క్రేజీ కపుల్ కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ త్వరలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే పెళ్లికి ముందే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలని తేజస్వి తల్లి వీరికి కండిషన్ పెట్టడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Published on: May 23, 2026, 06:16:21 IST
Advertisement

Tejasswi Prakash Mother Live In Relationship Condition: రియాలిటీ షో 'బిగ్ బాస్' వేదికగా చిగురించిన ప్రేమకథలు చాలా వరకు బయటకు వచ్చాక ఎక్కువ కాలం నిలబడవు అనే అపవాదు ఉంది. కానీ, ఆ అపవాదును అబద్ధం చేస్తూ గత కొన్నేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు బాలీవుడ్ నటీనటులు కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్.

దేశీ బ్లింగ్ ఓటీటీ షోలో

ఓటీటీ షోలో లవ్ ప్రపోజ్- పెళ్లికి ముందే కలిసి ఉండమన్న బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి తల్లి- కూతురుని నమ్మలేనంటూ కండీషన్
ఓటీటీ షోలో లవ్ ప్రపోజ్- పెళ్లికి ముందే కలిసి ఉండమన్న బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి తల్లి- కూతురుని నమ్మలేనంటూ కండీషన్

ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ రిలీజ్ అయిన 'దేశీ బ్లింగ్' షోలో ఈ జంట అధికారికంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న ఈ లవ్ బర్డ్స్ తమ పెళ్లి ప్లాన్స్, కుటుంబ సభ్యుల మద్దతు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సాధారణంగా భారతీయ సమాజంలో పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి కలిసి ఒకే ఇంట్లో ఉండే 'లైవ్-ఇన్ రిలేషన్‌షిప్' సంస్కృతిని పెద్దలు అస్సలు ఒప్పుకోరు. కానీ, తేజస్వి ప్రకాష్ విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టే ముందే ఇద్దరూ కలిసి ఉండి ఒకరి అలవాట్లను మరొకరు గమనించాలని స్వయంగా తేజస్వి తల్లి కండీషన్ పెట్టడం విశేషం.

అత్తగారి వినూత్న ఆలోచన.. పెళ్లికి ముందే లైవ్-ఇన్!

నటుడు అంగద్ బేడీ, నేహా ధూపియా నడుపుతున్న యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌ షోలో కరణ్, తేజస్వి జంటగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ రిలేషన్‌షిప్ గురించి కరణ్ కుంద్రా మాట్లాడుతూ అత్తగారి చెప్పిన ఆసక్తికర విషయం గురించి బయటపెట్టారు.

"కరణ్ నాతో కంఫర్ట్‌గా ఉంటాడో లేదో తెలుసుకోవాలని మా అమ్మ అనుకుంది. అందుకే పెళ్లి నిశ్చయించుకునే ముందే మేమిద్దరం లైవ్-ఇన్‌లో ఉండాలని అమ్మే పట్టుబట్టింది. సమాజంలో చాలా మంది దీనిని వ్యతిరేకిస్తారని తెలుసు, కానీ మా అమ్మ మాత్రం ప్రాక్టికల్‌గా ఆలోచించి ఒకరినొకరు పరీక్షించుకోవాలని ఈ సలహా ఇచ్చింది" అని తేజస్వి ప్రకాష్ స్పష్టం చేసింది.

'రెండు వారాలు కూడా గడవదన్నారు'.. విమర్శలకు చెక్!

బిగ్ బాస్ సీజన్ 15 హౌస్‌లో ఉన్నప్పుడు వీరి మధ్య ప్రేమాయణం మొదలైంది. స్క్రీన్ పై కనిపించే కెమిస్ట్రీ కేవలం షో కోసమేనని, బయటకు వచ్చాక రెండు వారాలు కూడా వీరి బంధం నిలవదని అప్పట్లో నెటిజన్లు, విమర్శకులు దెప్పిపొడిచారు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ కరణ్ తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు అందులో ఎంతో నిజాయితీ కనిపించిందని తేజస్వి చెప్పింది.

మొదట్లో నమ్మకం కలగడానికి తాను కొంత సమయం తీసుకున్నప్పటికీ, కరణ్ ప్రతి విషయంలోనూ తన ప్రేమేంటో నిరూపించుకుంటూనే వచ్చాడని కొనియాడింది. అన్ని రకాల ఒడిదుడుకులను తట్టుకుని నిలబడ్డాం కాబట్టే తమ బంధం ఇంత బలంగా మారిందని ఈ జంట గర్వంగా చెబుతోంది.

దుబాయ్‌లో డ్రీమ్ ప్రపోజల్.. నెట్‌ఫ్లిక్స్ వేదికగా హంగామా

'దేశీ బ్లింగ్' ఓటీటీ షోలో వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు, డ్రామాలు జరగడంతో ఈ జంట విడిపోతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. అయితే వాటన్నింటికీ కరణ్ కుంద్రా దుబాయ్‌లో ఫుల్ స్టాప్ పెట్టాడు. దుబాయ్‌లో ఒక అద్భుతమైన సెటప్ సిద్ధం చేసి, మోకాళ్లపై కూర్చుని పెద్ద డైమండ్ రింగ్‌తో తేజస్వికి ప్రపోజ్ చేశాడు.

పంజాబీ స్టైల్‌లో "తేజస్వి ప్రకాష్, నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడగడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఊహించని ఈ సర్‌ప్రైజ్‌తో కళ్లల్లో నీళ్లు తిరగ్గా, చేతులు వణుకుతున్నాయంటూ తేజస్వి ఆ క్షణంలో ఉద్వేగానికి లోనైంది. టాలీవుడ్‌లో కూడా 'నాగిని' సిరీస్ ద్వారా తేజస్వికి మంచి గుర్తింపు ఉండటంతో, ఈ క్రేజీ కపుల్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని తెలుగు అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ ఎక్కడ కలుసుకున్నారు?

వీరిద్దరూ ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్ 15' హౌస్‌లో మొదటిసారి కలుసుకున్నారు. అక్కడే వీరి మధ్య ప్రేమ చిగురించింది.

2. పెళ్లికి ముందు లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలని వీరికి ఎవరు సలహా ఇచ్చారు?

నటి తేజస్వి ప్రకాష్ తల్లి స్వయంగా వీరికి ఈ సలహా ఇచ్చారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.

3. కరణ్ కుంద్రా తేజస్వికి ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేశారు?

దుబాయ్‌లో ఒక రోమాంటిక్ వాతావరణంలో, మోకాళ్లపై కూర్చుని పంజాబీ భాషలో మాట్లాడుతూ కరణ్ కుంద్రా భారీ డైమండ్ రింగ్‌తో తేజస్వికి ప్రపోజ్ చేశారు.

4. ఈ జంట నిశ్చితార్థం ఏ ఓటీటీ షోలో హైలైట్‌గా నిలిచింది?

నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమైన 'దేశీ బ్లింగ్' (Desi Bling) షోలో వీరి నిశ్చితార్థం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe