Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ సారి పదో సీజన్ కాబట్టి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న మేకర్స్ వరుసగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్ లోకి తీసుకురాబోతున్నారు.
బిగ్ బాస్ ట్విస్ట్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సెకండ్ వీక్ ను ‘పవర్ ఆఫ్ పీపుల్’ గా బిగ్ బాస్ మేకర్స్ నిర్ణయించారు. అంటే షో చూసే ఆడియన్స్ చేతుల్లోనే పవర్ పెట్టారు. ఏదో పేరుకే పవర్ ఆఫ్ పీపుల్ అన్నారనుకున్నారు కానీ నిజంగానే రెండో వారంలో ఓటింగ్ తో అంతా తారుమారు చేస్తున్నారు.
ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లు
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఫస్ట్ వీక్ లోనే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మిడ్ వీక్ లోనే ఫస్ట్ చరణ్ ను, ఆ తర్వాత చైత్ర రాయ్ ను ఇంటి నుంచి పంపించేశారు. ఇప్పుడు వీళ్లలో ఒకరిని తిరిగి హౌస్ లోకి తీసుకొచ్చే పవర్ ను ఆడియన్స్ కు ఇచ్చాడు బిగ్ బాస్.
ఓటింగ్ తో
పవర్ ఆఫ్ పీపుల్ లో ఆడియన్స్ కు ఫైనల్ పవర్ ఇచ్చారు. అదే ఎలిమినేట్ అయిన చరణ్, చైత్రకు ఓటు వేయడం. ఇద్దరిలో తమకు నచ్చిన కంటెస్టెంట్ ను తిరిగి హౌస్ లో చూడాలనుకుంటే ఆడియన్స్ వాళ్లకు ఓట్లు వేయాలి. ఇలా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లను హౌస్ లోకి తిరిగి తీసుకురాబోతున్నారు.
కెప్టెన్సీ రేసు
బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారంలో జనాలు ఓటింగ్ తో ఎంచుకున్న కంటెస్టెంట్లకే కెప్టెన్సీ రేసులో పోటీ పెట్టారు. చివరకు ఝాన్సీ, ముఖేష్ నిలిచారు. ఈ నేపథ్యంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల నుంచి హౌస్ లోకి అడుగుపెట్టే చరణ్ లేదా చైత్ర డైరెక్ట్ గా కెప్టెన్సీ రేసులో పోటీపడే అవకాశముందని టాక్. అంటే ఝాన్సీ, ముఖేష్ తో పాటు చరణ్ లేదా చైత్రలో ఒకరు కెప్టెన్సీ కోసం తలపడనున్నారు.
ఎవరో మరి?
{{/usCountry}}బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారంలో జనాలు ఓటింగ్ తో ఎంచుకున్న కంటెస్టెంట్లకే కెప్టెన్సీ రేసులో పోటీ పెట్టారు. చివరకు ఝాన్సీ, ముఖేష్ నిలిచారు. ఈ నేపథ్యంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల నుంచి హౌస్ లోకి అడుగుపెట్టే చరణ్ లేదా చైత్ర డైరెక్ట్ గా కెప్టెన్సీ రేసులో పోటీపడే అవకాశముందని టాక్. అంటే ఝాన్సీ, ముఖేష్ తో పాటు చరణ్ లేదా చైత్రలో ఒకరు కెప్టెన్సీ కోసం తలపడనున్నారు.
ఎవరో మరి?
{{/usCountry}}బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిన చరణ్, చైత్రలో ఎవరు తిరిగి హౌస్ లోకి వస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే ఓట్లు వేయాలని సోషల్ మీడియాలో చరణ్, చైత్ర రిక్వెస్ట్ లు పెడుతూనే ఉన్నారు. ఈ ఓటింగ్ లైన్స్ ఇవాళ (సెప్టెంబర్ 16) మధ్యాహ్నం 12 గంటలకు ముగిశాయి. మరి వీళ్లలో ఎవరు రీ ఎంట్రీ ఇస్తారో చూడాలి.