Bigg Boss 10 Debjani Modak: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఫస్ట్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన దేబ్జానీ మోదక్ కోల్‌కతాలోని ఒక బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించింది. తండ్రి అపూర్వ మోదక్ బిజినెస్‌మెన్, తల్లి గృహిణి కాగా, ఆమెకు నందిని అనే సోదరి ఉంది. దేబ్జానీ కుటుంబంలో ఎవరికీ సినీ పరిశ్రమతో సంబంధం లేదు.
ట్యూషన్ నుంచి వస్తుండగా

బిగ్ బాస్ 10 తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దేబ్జానీ మోదక్ యాక్టింగ్ కెరీర్ అనుకోకుండా స్టార్ట్ అయింది. దేబ్జానీ 9వ తరగతి చదువుతున్నప్పుడు మ్యాథ్స్ ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఒక డైరెక్టర్ టీమ్ మెంబర్ ఆమెను చూసి బెంగాలీ సీరియల్‌లో నటిస్తావా అని అడిగారు. తల్లి ఎంకరేజ్ చేయడంతో మొదటి సీరియల్‌లో నటించే అవకాశం దక్కించుకుంది.
ఒక్క ఆడిషన్ ఇవ్వకుండా
దేబ్జానీ మోదక్ తన కెరీర్‌లో ఇప్పటివరకు బెంగాలీ, తమిళం, తెలుగు బాషలలో నటించిన ఏ ప్రాజెక్ట్‌కూ ఎలాంటి ఫార్మల్ ఆడిషన్ ఇవ్వకపోవడం ఒక విశేషం. 2013లో ‘నాకౌట్’ (Knockout) అనే బెంగాలీ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది దేబ్జానీ. 2015లో ‘ఆపోంజోన్’ (Aponjon) సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'ఓం నమః శివాయ', 'ఫూల్మొని' వంటి పౌరాణిక, జానపద ధారావాహికలలో ద్రౌపది, సరస్వతి దేవి పాత్రలు పోషించింది.
‘ఎన్నెన్నో జన్మల బంధం’ వేదగా
2020లో సన్ టీవీ పాపులర్ తమిళ సీరియల్ ‘రసాతి’ (Rasaathi), ‘వానతై పోల’ (Vanathai Pola) లలో కీలక పాత్రలతో దక్షిణాది బుల్లితెరకు దేబ్జానీ పరిచయమైంది. స్టార్ మా లో ప్రసారమైన అత్యంత జనాదరణ పొందిన ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ ద్వారా 2021లో తెలుగులోకి అడుగుపెట్టింది.
హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఒక్క తెలుగు పదం కూడా రాకపోయినా, సెట్స్‌లోనే కష్టపడి తెలుగు నేర్చుకుని సొంతంగా డైలాగులు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సీరియల్‌లో ‘వేద’గా ఆమె కనబరిచిన నటనకుగానూ 2022లో 'స్టార్ మా పరివార్ - బెస్ట్ వైఫ్' అవార్డును అందుకని తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
దేబ్జానీ స్ట్రాటజీ
{{/usCountry}}హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఒక్క తెలుగు పదం కూడా రాకపోయినా, సెట్స్‌లోనే కష్టపడి తెలుగు నేర్చుకుని సొంతంగా డైలాగులు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సీరియల్‌లో ‘వేద’గా ఆమె కనబరిచిన నటనకుగానూ 2022లో 'స్టార్ మా పరివార్ - బెస్ట్ వైఫ్' అవార్డును అందుకని తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
దేబ్జానీ స్ట్రాటజీ
{{/usCountry}}రియాలిటీ షో ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఫస్ట్ కంటెస్టెంట్ గా దేబ్జానీ అడుగుపెట్టింది. స్టార్ మా సీరియల్స్ ద్వారా మహిళా వీక్షకులలో (Serial Avid Viewers) దేబ్జానీకి అత్యంత బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్‌లోనే నంబర్ 1 కంటెస్టెంట్‌గా పంపడం ద్వారా షో మేకర్స్ ప్రారంభ రోజులలోనే మంచి ఓటింగ్ బ్యాంక్‌ను రాబట్టే అవకాశం కల్పించారు.
బెంగాల్ నుండి వచ్చి తెలుగు బుల్లితెరపై స్టార్ నటిగా వెలిగిన దేబ్జానీ మోదక్.. బిగ్ బాస్ 10 హౌస్‌లోకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆమె కెరీర్‌కు మరో అతిపెద్ద మలుపు. తన నటనతో వేదగా మెప్పించిన దేబ్జానీ.. బిగ్ బాస్ రియాలిటీ గేమ్‌లో తన రియల్ పర్సనాలిటీతో ఎంతవరకు ఫైనల్ రేసులో నిలుస్తుందో వేచి చూడాలి!