Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఎట్టకేలకు ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ కనిపించేలా ఉంది. బిగ్ బాస్ హిస్టరీలో మోస్ట్ ఫన్ సెగ్మెంట్ అయిన బిగ్ బాస్ హోటల్ కాన్సెప్ట్ ఇప్పుడు పదో సీజన్ లోకి వచ్చింది. ఇప్పటికైనా కంటెస్టెంట్లు కాస్త ఎంటర్ టైన్మెంట్ పంచుతారేమో చూడాలి.
బిగ్ బాస్ 10 హోటల్

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో హోటల్ సెగ్మెంట్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. ఎనిమిదో వారంలో హోటల్ థీమ్ ను ప్రవేశపెట్టారు. ఇందులో మూడు గ్రూప్ లుగా కంటెస్టెంట్లను డివైడ్ చేశారు. ఓనర్స్, గెస్ట్, వర్కర్స్ గా హౌస్ మేట్స్ విడిపోయారు. ఇక హోటల్లో ఆతిథ్యం ప్రకారం వర్కర్స్, ఓనర్స్ కు గెస్ట్ లు డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది.
దేబ్జానీ భర్తగా ముఖేష్
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో దేబ్జానీ, ముఖేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దేబ్జానీ అంటేనే ముఖేష్ కు పడటం లేదు. దేబ్జానీ ఏది మాట్లాడినా ముఖేష్ దాన్ని గొడవగానే క్రియేట్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పుడు బిగ్ బాస్ వీళ్లతో ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లాన్ చేశాడు.
బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో దేబ్జానీకి కాబోయే భర్తగా ముఖేష్ ను సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్. వీళ్లు ఈ హోటల్ కు గెస్ట్ లుగా వస్తారు. వీళ్ల మధ్యలోకి ఓనర్లలో ఒకరైన వర్షిణి వచ్చినట్లు లేెటెస్ట్ ప్రోమోలో కనిపించింది.
ఓటింగ్ ఇలా
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఎనిమిదో వారంలో అనఫిషియల్ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే వర్షిణి, శివ డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు. లైవ్ ఓటింగ్ ప్రకారం వీళ్లు లాస్ట్ రెండు స్థానాల్లో ఉన్నారు. ముఖ్యంగా వర్షిణి ఓటింగ్ లో లీస్ట్ ప్లేస్ లో ఉంది. ఆమెకు జనాలు ఎక్కువగా ఓట్లు వేయలేదని తెలిసింది.
ఎలిమినేషన్ ఎవరు?
{{/usCountry}}బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఎనిమిదో వారంలో అనఫిషియల్ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే వర్షిణి, శివ డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు. లైవ్ ఓటింగ్ ప్రకారం వీళ్లు లాస్ట్ రెండు స్థానాల్లో ఉన్నారు. ముఖ్యంగా వర్షిణి ఓటింగ్ లో లీస్ట్ ప్లేస్ లో ఉంది. ఆమెకు జనాలు ఎక్కువగా ఓట్లు వేయలేదని తెలిసింది.
ఎలిమినేషన్ ఎవరు?
{{/usCountry}}బిగ్ బాస్ లో ఏడో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. దక్షి, శాలిని హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఎనిమిదో వారంలో వర్షిణి, సుధీర్ లో ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోతారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ వారం వర్షిణి ఎలిమినేట్ అయేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఓటింగ్ లో రోహిత్ టాప్ లేపుతున్నాడు. త్రిగుణ్ నామినేషన్లో లేకపోవడంతో రోహిత్ కు ఎక్కువ ఓట్లు పడుతున్నాయని చెప్పొచ్చు.