...
...
Next Story

Bigg Boss Telugu 10: నువ్వు ఆడియ‌న్‌గా ఉండ‌ట‌మే బెట‌ర్‌-చ‌ర‌ణ్ వ‌ర్సెస్ ముఖేష్‌-ఈ వార‌మే హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నామినేషన్ ప్రక్రియలో చరణ్ వర్సెస్ ముఖేష్ గొడవ ఇప్పుడు వైరల్ గా మారింది. చరణ్ ఆడియన్ గా ఉండటమే బెటర్ అని ముఖేష్ అనేశాడు. ఇక ఈ వారమే హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని టాక్.

Published on: Sep 22, 2026, 11:37:45 IST
Advertisement

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో హౌస్ మేట్స్ మధ్య హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో మూడో వీక్ నామినేషన్స్ లో మళ్లీ గొడవ షురూ అయింది. చరణ్ వర్సెస్ ముఖేష్ గౌడ, శాలిని వర్సెస్ వర్షిణి మాటల యుద్ధం వైరల్ గా మారింది.

బిగ్ బాస్ 10 తెలుగు

నువ్వు ఆడియ‌న్‌గా ఉండ‌ట‌మే బెట‌ర్‌-చ‌ర‌ణ్ వ‌ర్సెస్ ముఖేష్‌-ఈ వార‌మే హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ! (youtube/starmaa)
నువ్వు ఆడియ‌న్‌గా ఉండ‌ట‌మే బెట‌ర్‌-చ‌ర‌ణ్ వ‌ర్సెస్ ముఖేష్‌-ఈ వార‌మే హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ! (youtube/starmaa)

పాపులర్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ 10వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మూడో వారం నామినేషన్లలో ముఖేష్, చరణ్ గొడవపడ్డారు. చరణ్ ను ముఖేష్ నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరూ మాటలు అనుకున్నారు. ముఖేష్ అయితే ఏకంగా చరణ్ ఆడియన్ గా ఉండటమే బెటర్ అని అనేశాడు. అంటే హౌస్ లో కంటెస్టెంట్ గా చరణ్ పనికి రాడన్నది ముఖేష్ అభిప్రాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దమ్ముంటే చేస్కో

మరోవైపు బిగ్ బాస్ 10 తెలుగు కంటెస్టెంట్లు అయిన శాలిని, వర్షిణి కూడా వర్డ్స్ వార్ లో సై అంటే సై అన్నారు. సంచాలకురాలిగా వర్షిణి ఫెయిల్ అంటూ శాలిని పాయింట్ లేవనెత్తింది. దీంతో ఒక్కసారిగా వర్షిణి ట్రిగర్ అయింది. దమ్ముంటే చేసుకో అని ఛాలెంజ్ విసిరింది.

వైల్డ్ కార్డు ఎంట్రీ

అదిరిపోయే ట్విస్ట్ లతో సాగుతున్న బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో మరో ట్విస్ట్ కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ వీక్ లోనే బిగ్ బాస్ ఇద్దరిని మిడ్ వీక్ ఎలిమినేట్ చేశాడు. వాళ్లలో ఒకరిని మళ్లీ రప్పించాడు. సెకండ్ వీక్ ఓ కంటెస్టెంట్ ను ఇంటికి పంపించేశారు. ఇప్పుడు మూడో వారమే వైల్డ్ కార్డు ఎంట్రీకి ప్లాన్ చేసినట్లు తెలిసింది.

ఆ ముగ్గురిలో ఒకరు

అగ్నిపరీక్షలో అదరగొట్టినప్పటికీ హౌస్ లో అడుగుపెట్టే ఛాన్స్ దక్కించుకోని మిథిలేష్, అపూర్వ, రామకృష్ణ‌లో ఒకరు ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీగా వస్తారని సమాచారం. మరి వాళ్లలో ఎవరు హౌస్ లోకి అడుగుపెడతారో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks