Bigg Boss Rohit elimination: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ రోజుకో మలుపు తిరుగుతోంది. ముందెన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొదటి వారం నుంచే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరుతెచ్చుకున్న రోహిత్ నాయుడు ఎలిమినేషన్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ప్రేక్షకుల ఓటింగ్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ టీమ్ కేవలం తమ ఇష్టాయిష్టాల కోసమే రోహిత్‌ను ఎలిమినేట్ చేసిందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
రోహిత్ చేసిన తప్పేంటి?

బిగ్ బాస్ హౌస్‌లో ఏది తప్పో, ఏది ఒప్పో ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్లు చెప్పే నైజం రోహిత్‌ది. బిగ్ బాస్ యాజమాన్యం, అలాగే వీకెండ్స్‌లో హోస్ట్ తీసుకునే కొన్ని ఏకపక్ష నిర్ణయాలను, పార్షియాలిటీని రోహిత్ చాలాసార్లు ధైర్యంగా ప్రశ్నించాడు. ఎవరికీ భయపడకుండా అతడు లాజికల్‌గా మాట్లాడటం మేనేజ్‌మెంట్‌కు నచ్చలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో గీతూ, శ్రీజ విషయంలో కూడా బిగ్ బాస్ టీమ్ ఇలాగే వ్యవహరించిందని, ఎంత ఆడియన్స్ సపోర్ట్ ఉన్నా సరే తమకు నచ్చకపోతే బయటకు పంపించేయడం వాళ్లకు అలవాటుగా మారిందని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
డబుల్ ఓటింగ్ కుట్ర!
గేమ్‌లో రోహిత్‌ను హైలైట్ కాకుండా చేసేందుకు బిగ్ బాస్ టీమ్ మొదటి నుంచీ ప్రయత్నించిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రోహిత్‌ను రెడ్ టీమ్‌లో వేసి, ఆ టీమ్‌కు ఎలాంటి ప్రాముఖ్యత ఉన్న టాస్కులు ఇవ్వకుండా కావాలనే సైడ్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అంతటితో ఆగకుండా, శుక్రవారం హౌస్‌మేట్స్ ఓటింగ్ పూర్తయిన తర్వాత కూడా మళ్లీ ఆదివారం రెండోసారి హౌస్‌మేట్స్‌తో ఓటింగ్ వేయించి మరీ రోహిత్‌ను అన్యాయంగా ఎలిమినేట్ చేయడం పక్కా కుట్రేనని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా టీఆర్పీ స్టంట్ కోసమేనా?
"బిగ్ బాస్ అంటేనే ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడం.. కప్పు గెలిచినా గెలవకపోయినా ఆడియన్స్ హార్ట్స్ ఎలా గెలవాలో రోహిత్ చూపించాడు" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రోహిత్ ఎలిమినేషన్ వెనుక పెద్ద టీఆర్పీ స్టంట్ ఉందనే వాదన కూడా ఉంది. రోహిత్ రీ ఎంట్రీ కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
వైరల్ అవుతున్న రోహిత్ ఎమోషనల్ ట్వీట్
{{/usCountry}}"బిగ్ బాస్ అంటేనే ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడం.. కప్పు గెలిచినా గెలవకపోయినా ఆడియన్స్ హార్ట్స్ ఎలా గెలవాలో రోహిత్ చూపించాడు" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రోహిత్ ఎలిమినేషన్ వెనుక పెద్ద టీఆర్పీ స్టంట్ ఉందనే వాదన కూడా ఉంది. రోహిత్ రీ ఎంట్రీ కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
వైరల్ అవుతున్న రోహిత్ ఎమోషనల్ ట్వీట్
{{/usCountry}}తన ఎలిమినేషన్‌పై జరుగుతున్న రచ్చ నేపథ్యంలో రోహిత్ నాయుడు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. "అధికారం, పలుకుబడి కంటే మన కష్టం గట్టిగా మాట్లాడినప్పుడు.. ఎవరికి నిజమైన గుర్తింపు దక్కాలో ప్రేక్షకులకు బాగా తెలుసు. ప్రతి ప్రయాణానికి సమాన గౌరవం దక్కాలి. ఇప్పుడు మన గొంతును వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది" అంటూ రోహిత్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.