Bigg Boss Elimination: బిగ్‌బాస్ 10 తెలుగులో డబుల్ ఎలిమినేషన్- రోహిత్, ఝాన్సీ అవుట్- ఇద్దరి రెమ్యునరేషన్, సంపాదన ఎంతంటే?

Bigg Boss 10 Telugu Double Elimination This Week: బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ 8వ వారంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. హౌస్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరున్న రోహిత్ నాయుడు ఎలిమినేట్ అయ్యాడు. నిన్న ఎలిమినేట్ అయిన ఝాన్సీతోపాటు రోహిత్ రెమ్యునరేషన్, 8 వారాల్లో సంపాదించింది ఎంతో చూద్దాం.

Published on: Nov 1, 2026, 17:11:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss 10 Telugu Rohit Jhansi Remuneration: బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్‌లో రసవత్తర పోరు సాగుతోంది. అనుక్షణం ఉత్కంఠ రేపుతున్న ఈ ఓటీటీ రియాలిటీ షోలో 8వ వారం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.

బిగ్‌బాస్ 10 తెలుగులో డబుల్ ఎలిమినేషన్- రోహిత్, ఝాన్సీ అవుట్- ఇద్దరి రెమ్యునరేషన్, సంపాదన ఎంతంటే?
బిగ్‌బాస్ 10 తెలుగులో డబుల్ ఎలిమినేషన్- రోహిత్, ఝాన్సీ అవుట్- ఇద్దరి రెమ్యునరేషన్, సంపాదన ఎంతంటే?

ఈసారి కూడా డబుల్ ఎలిమినేషన్

ఈసారి వరుసగా రెండో వారం డబుల్ ఎలిమినేషన్ నిర్వహించి షాకిచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. గతవారం షాలిని, దక్షి హౌస్ నుంచి బయటకు రాగా.. ఈ వారం ఫోక్ సింగర్ ఝాన్సీతో పాటు టైటిల్ రేసులో ఉంటాడనుకున్న రోహిత్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు.

సీక్రెట్ రూమ్‌కి పంపకుండా

"టాప్-3లో కచ్చితంగా ఉంటా" అని ధీమా వ్యక్తం చేసిన రోహిత్ ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా బలమైన కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసినట్లు చూపిస్తూ సీక్రెట్ రూమ్‌కి పంపడం బిగ్ బాస్ రివాజు. అయితే, హోస్ట్ నాగార్జున ఈసారి ఎలాంటి ఆప్షన్ ఇవ్వకుండా రోహిత్‌ని నేరుగా బయటకు పంపించారు.

అయితే, బిగ్ బాస్ ప్రారంభమైనప్పుడు రోహిత్ నాయుడుని అందరూ టార్గెట్ చేయడం, ముఖ్యంగా త్రిగుణ్ ఇబ్బంది పెట్టడం, వీకెండ్‌లో నాగార్జున కూడా రోహిత్‌నే తప్పుబట్టడం ఈ కామనర్‌కు సింపతీ పెరిగింది. అగ్ని పరీక్ష 2లో ఆడిన తీరుతో విన్నర్ మెటీరియల్‌గా పేరు తెచ్చుకున్నాడు రోహిత్.

ఎన్ని హింట్స్ ఇచ్చిన కూడా

కానీ, రెండు వారాల తర్వాత రోహిత్ పతనం మొదలైంది. తను మారేందుకు ఆడియెన్స్‌తో ఎన్నిసార్లు హింట్స్ ఇచ్చిన కూడా పట్టించుకోకుండా చేతులారా గేమ్ నాశనం చేసుకున్నాడు రోహిత్. హౌస్‌లో షాలినితో అనవసరమైన లవ్ ట్రాక్, త్రిగుణ్‌తో అర్థం పర్థం లేని గొడవలు, బూతులు మాట్లాడటం, వీకెండ్‌లో దొరికిపోవడం తప్పితే రోహిత్ చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి.

రోహిత్ ఎలిమినేషన్

ప్రతివారం నిర్వహించే బిగ్ బాస్ నామినేషన్లలో చూపించిన పొగరు, గేమ్‌పై శ్రద్ధ చూపకపోవడమే రోహిత్ ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమనే తెలుస్తోంది. అయితే, రోహిత్ ఎలిమినేషన్ అయిన నేటి (నవంబర్ 1) బిగ్ బాస్ తెలుగు 10 ఎపిసోడ్ ఇంకా టెలీకాస్ట్ కాలేదు.

కానీ, ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కావడంతో లీక్స్ బయటకొచ్చేశాయి. వీటికిమించి రోహిత్‌ను గొప్పగా పొగుడుతూ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌ను బట్టి రోహిత్ నాయుడు ఎలిమినేట్ అయినట్లు స్పష్టంగా తెలిసిపోతుంది.

8 వారాల సంపాదన ఎంత?

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు హౌస్‌లో రోహిత్ 8 వారాల పాటు ఉన్నాడు. ఇందుకు గానూ వారానికి రూ. 70,000 చొప్పున రోహిత్ పారితోషికం తీసుకున్నాడని సమాచారం. ఈ లెక్కన 8 వారాలకు గానూ సుమారు రూ. 5,60,000 వరకు బిగ్‌బాస్ ద్వారా రోహిత్ సంపాదించినట్లు తెలుస్తోంది.

మరోవైపు శనివారం (అక్టోబర్ 31) నాటి బిగ్ బాస్ తెలుగు 10 ఎపిసోడ్‌లో ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. రోహిత్ లాగే ఆమె కూడా బిగ్ బాస్ హౌజ్‌లో 8 వారాలపాటు కొనసాగింది. అందుకు ఝాన్సీ రూ. 70,000 నుంచి రూ. 75,000 వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇలా అయితే, ఝాన్సీ బిగ్ బాస్ 10 తెలుగు ద్వారా రూ. 5 లక్షల 60 వేల నుంచి రూ. 6 లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More