Bigg Boss Elimination: బిగ్ బాస్‌లో ఇవాళ డబుల్ ఎలిమినేషన్- అతను రెండోసారి ఎలిమినేట్- శాలినిని కాపాడిన వైల్డ్ కార్డ్స్

Bigg Boss Telugu 10 Double Elimination Today: బిగ్ బాస్ తెలుగు 10లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్ జరిగింది. హౌజ్‌లోకి ఇవాళ కొత్తగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో ఇవాళ బిగ్ బాస్ 10 తెలుగు నుంచి ఇవాళ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మరి వారిద్దరు ఎవరు, ఎలిమినేషన్ ఎలా జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 11, 2026, 07:53:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss 10 Telugu Elimination This Week: తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ జోరుగా సాగుతోంది. ప్రతివారం కంటెస్టెంట్స్ రచ్చ, వీకెండ్‌లో నాగార్జున రివ్యూలతో, ఊహించని ట్విస్టులతో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ అదిరిపోతుంది.

బిగ్ బాస్‌లో ఇవాళ డబుల్ ఎలిమినేషన్- అతను రెండోసారి ఎలిమినేట్- శాలినిని కాపాడిన వైల్డ్ కార్డ్స్
బిగ్ బాస్‌లో ఇవాళ డబుల్ ఎలిమినేషన్- అతను రెండోసారి ఎలిమినేట్- శాలినిని కాపాడిన వైల్డ్ కార్డ్స్

బిగ్ బాస్ నామినేషన్స్‌లో 10 మంది

బిగ్ బాస్ తెలుగు 10 ఐదోవారం కూడా నామినేషన్స్ రచ్చ జరిగింది. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో పదిమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కెప్టెన్ అయిన వర్షిణి, టెంపర్ వంశీ, సుధీర్ ఇమ్యూనిటీ సొంతం చేసుకున్నారు. కాబట్టి వారు నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు.

రోహిత్, త్రిగుణ్, అమన్, నరేష్, అపూర్వ, ఝాన్సీ, రామ్ ప్రసాద్, శాలిని, చరణ్, ముఖేష్ పది మంది బిగ్ బాస్ 10 తెలుగు 5వ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక ఈ కంటెస్టెంట్స్ అందరికి రోడ్ టు రీలోడ్ టాస్క్‌లు పెట్టారు. ఆ టాస్క్‌ల్లో గెలిచిన వారికి పాయింట్స్‌తో స్కోర్ బోర్డ్ పెట్టారు. అందులో ఎక్కువ పాయింట్స్ ఉన్నవారు సేవ్ అవుతూ వచ్చారు.

మ్యాజికల్ పవర్ ఉపయోగించి

అలా త్రిగుణ్, అమన్, రామ్ ప్రసాద్ నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు. మిగతా వాళ్లు నామినేషన్స్‌లో ఉన్నారు. తన దగ్గర ఉన్న మ్యాజికల్ పవర్ ఉపయోగించి నామినేషన్స్ నుంచి సేవ్ అయింది సింగర్ ఝాన్సీ. ఓటింగ్ పరంగా టాప్‌లో ఉన్న రోహిత్ కూడా సేవ్ అయ్యాడు. లీస్ట్ ఓటింగ్‌తో అపూర్వ, చరణ్, శాలిని డేంజర్ జోన్‌లో ఉన్నారు.

బిగ్ బాస్ తెలుగు 10 అక్టోబర్ 10 శనివారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున హౌజ్‌లో ఉండటానికి అర్హులు కానీ వాళ్లు ఎవరో స్టాంప్ వేయాల్సిందిగా చెప్పాడు. అలా రోహిత్‌కు ఐదు, చరణ్‌కు 3 ఓట్లు ఇంటి నుంచి వెళ్లేందుకు ఓట్లు పడ్డాయి. బిగ్ బాస్ ఓటింగ్‌లో అతి తక్కువ ఓట్లు పడటంతో అపూర్వ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున అనౌన్స్ చేశాడు.

శాలినిని కాపాడిన వైల్డ్ కార్డ్స్

దీనికి సంబంధించిన షూటింగ్ అక్టోబర్ 10 నాడే పూర్తి అయింది. ఇక అందరూ ఓటింగ్‌తో సేవ్ అవ్వగా చివరిగా శాలిని, చరణ్ మిగిలారు. వీరి ఎలిమినేషన్‌ను అప్పటికే హౌజ్‌లోకి వచ్చిన కొత్త వైల్డ్ కార్డ్స్ చేతిలో పెట్టాడు హోస్ట్ నాగార్జున. వైల్డ్ కార్డ్స్ దగ్గరున్న సేవ్ కార్డ్‌ను ఎవరికి ఇస్తారో నిర్ణయించుకోమని చెప్పాడు.

దాంతో వారంతా ఆలోచించి శాలినిని కాపాడారు. కామనర్ అయిన చరణ్ మహదేవ్‌ను ఎలిమినేట్ చేశారు. దీనికి సంబంధించిన నేటి బిగ్ బాస్ 10 తెలుగు అక్టోబర్ 11 ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి అయింది. అంటే, ఇవాళ బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా అపూర్వ, చరణ్ ఎలిమినేట్ అయ్యారు.

రెండోసారి ఎలిమినేట్

బిగ్ బాస్ 10 తెలుగు ప్రారంభమైన మొదటి వారంలోనే చరణ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆడియెన్స్ ఓట్స్‌తో వైల్డ్ కార్డ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఆటతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. టాస్క్‌ల్లో కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. దాంతో అతనికి చాలా తక్కువ ఓటింగ్ పడటంతోపాటు మిగతా కంటెస్టెంట్స్ నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది.

ఫలితంగా ఈ వారం బిగ్ బాస్ నుంచి చరణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక వైల్డ్ కార్డ్‌గా 3వ వారంలో అపూర్వ ఎంట్రీ ఇచ్చింది. కంటెంట్ పరంగా స్క్రీన్ స్పేస్ బాగానే దక్కించుకున్న అపూర్వకు టాస్క్‌లు ఆడే ఛాన్స్ ఎక్కువ రాలేదు. అలాగే, ఈ వారం అపూర్వను త్రిగుణ్, శాలిని చాలా టార్గెట్ చేయడంతో చాలా లో అయిపోయింది. దాంతో ఏ గేమ్ ఆడలేకపోయింది. చివరికి అతి తక్కువ ఓటింగ్‌తో బిగ్ బాస్ ఇంటి నుంచి అపూర్వ నిష్క్రమించింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More