Janga: బిగ్ బాస్ త్రిగుణ్ హీరోగా రా అండ్ రస్టిక్ ఫిల్మ్ జంగా- పవర్‌ఫుల్ పోలీస్‌గా మధునందన్- బర్త్ డేకి పోస్టర్ రిలీజ్

Madhunandan Poster Release Form Bigg Boss Trigun Janga: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న త్రిగుణ్ హీరోగా తెరకెక్కిన రా అండ్ రస్టిక్ మూవీ జంగా. ఈ సినిమా నుంచి తాజాగా పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్న నటుడు మధునందన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆ వివరాలపై చూద్దాం.

Published on: Oct 2, 2026, 11:24:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Madhunandan Poster Release Form Bigg Boss Trigun Janga: శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న లేటెస్ట్ తెలుగు చిత్రం ‘జంగా’. ఈ సినిమాలో బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ త్రిగుణ్ హీరోగా చేస్తున్నాడు.

బిగ్ బాస్ త్రిగుణ్ హీరోగా రా అండ్ రస్టిక్ ఫిల్మ్ జంగా- పవర్‌ఫుల్ పోలీస్‌గా మధునందన్- బర్త్ డేకి పోస్టర్ రిలీజ్
బిగ్ బాస్ త్రిగుణ్ హీరోగా రా అండ్ రస్టిక్ ఫిల్మ్ జంగా- పవర్‌ఫుల్ పోలీస్‌గా మధునందన్- బర్త్ డేకి పోస్టర్ రిలీజ్

జంగా సినిమాలోని కీలక పాత్రలు

హీరో త్రిగుణ్‌తోపాటు నేహా పఠాన్, హీరోయిన్-నటి వరలక్ష్మీ శరత్ కుమార్, నటులు శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ, సీనియర్ నటుడు సమీర్, నాగ మహేష్,భూపాల్, రఘు కారుమంచి, రచ్చ రవి, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

రా అండ్ రస్టిక్ లుక్‌లో త్రిగుణ్

వీరందరి కాంబినేషన్‌లో వస్తోన్న జంగా సినిమాకు కెవిన్ గడ్డం(శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్య త్రిగుణ్ బర్త్ డే స్పెషల్‌గా వదిలిన ‘జంగా’ పోస్టర్ అండ్ మోషన్ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించిన త్రిగుణ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మధునందన్

ఇక తాజాగా జంగా సినిమా నుంచి మరొక పోస్టర్‌ను విడుదల చేశారు. జంగా మూవీలో కీలక పాత్రను పోషిస్తున్న నటుడు మధునందన్ కారెక్టర్‌ను రివీల్ చేశారు. మధునందన్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోన్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

ఇంటెన్స్ లుక్‌తో మధునందన్ పోస్టర్

జంగాలోని మధునందన్ పోస్టర్‌లో ఆయన లుక్ చూస్తుంటే ఏదో తదేకంగా పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఆయన ఏం చేస్తున్నారు? అక్కడ ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

జంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్

ప్రస్తుతం జంగా చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జంగా సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తుండగా.. వెంకట్ సి. దిలీప్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ మాటలు రాయగా.. కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి పాటల్ని రాస్తున్నారు.

బిగ్ బాస్ తెలుగు 10లో త్రిగుణ్

అలాగే, ప్రవీణ్ పూడి జంగా సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, హీరో త్రిగుణ్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 10కి కంటెస్టెంట్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ 10 తెలుగులో తనదైన స్టైల్ గేమ్‌తో త్రిగుణ్ మెప్పిస్తున్నాడు.

బిగ్ బాస్‌లో ఉండగానే రిలీజ్?

అయితే, త్రిగుణ్ బిగ్ బాస్‌కి వెళ్లకుముందే జంగా సినిమా షూటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి త్రిగుణ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు అర్థం అవుతోంది. మరి త్రిగుణ్ బిగ్ బాస్ హౌజ్‌లో ఉండగానే జంగా సినిమా రిలీజ్ అవుతుందా..? లేదా బయటకొచ్చాకా విడుదల అవుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More