...
...
Next Story

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 నుంచి అపూర్వ, చరణ్ ఔట్.. వైల్డ్ కార్డు, రీ ఎంట్రీ.. వీళ్లు ఎంత సంపాదించారంటే?

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో అయిదో వారం వీకెండ్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వైల్డ్ ఫైర్ కారణంగా ఈ వీకెండ్ లో ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి వెళ్లిపోయారు. అపూర్వ, చరణ్ ఎలిమినేట్ అయ్యారు. మరి బిగ్ బాస్ షో నుంచి ఈ ఇద్దరూ ఎంత సంపాదించారో ఇక్కడ చూసేయండి.

Published on: Oct 11, 2026, 13:41:11 IST
Advertisement

Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారం ముగింపులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ జరగడంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన అపూర్వ, అలాగే రీ-ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఇద్దరూ ఒకేసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఆడియన్స్ ఓటింగ్ తక్కువగా ఉండటంతో వీరిద్దరి ప్రయాణం బిగ్‌బాస్ హౌస్‌లో ముగిసింది.

అపూర్వ రెమ్యునరేషన్

బిగ్ బాస్ 10 నుంచి అపూర్వ, చరణ్ ఔట్.. వైల్డ్ కార్డు, రీ ఎంట్రీ.. వీళ్లు ఎంత సంపాదించారంటే?
బిగ్ బాస్ 10 నుంచి అపూర్వ, చరణ్ ఔట్.. వైల్డ్ కార్డు, రీ ఎంట్రీ.. వీళ్లు ఎంత సంపాదించారంటే?

'అగ్ని పరీక్ష' షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హౌస్‌లోకి కామనర్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అపూర్వ అడుగుపెట్టింది. ఈ వారంతో ఆమె జర్నీ ముగిసింది. అపూర్వకు వారానికి దాదాపు రూ.75 వేల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలిసింది. ఆమె హౌస్‌లో మూడు వారాల పాటు కొనసాగడంతో మొత్తంగా రూ.2.25 లక్షల వరకు పారితోషికం దక్కించుకున్నట్లు సమాచారం. అంతకుముందు అగ్నిపరీక్ష షో నుంచి ఆమె ఖాతాలో రూ.50 వేలు చేరాయని టాక్.

అదే మైనస్

వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన అపూర్వకు గేమ్ ప్లాన్ మార్చుకునేందుకు మంచి అవకాశం లభించినా ఆమె దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. టాస్కులపై పూర్తి దృష్టి పెట్టాల్సింది పోయి.. హౌస్‌లో ప్రతి చిన్న విషయానికీ గొడవపడటం, మితిమీరి అరవడం, ఓవర్ యాక్షన్‌గా అనిపించేలా ప్రవర్తించడంతో ఆమెపై ప్రేక్షకుల్లో నెగెటివిటీ పెరిగింది. హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లతో జరిగిన వాగ్వాదాలు ఆమెకు ఓటింగ్ భారీగా తగ్గడానికి కారణమయ్యాయి.

చరణ్ ఎంత సంపాదించాడంటే?

మొదటి వారం ఎలిమినేషన్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ రూపంలో లక్కీ ఛాన్స్ దక్కినా చరణ్ తన ఆటతీరును మార్చుకోలేకపోయాడు. అసలు అతను హౌస్ లో ఏం చేశాడని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అతను టాస్కుల్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.

హౌస్ వ్యవహారాల్లో పెద్దగా యాక్టివ్‌గా కనిపించకపోవడం, ఇతర కంటెస్టెంట్ల నుంచి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రావడం మరియు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో ఓట్లు పడకపోవడంతో ఐదో వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా అతను ఇంటి బాట పట్టాల్సి వచ్చింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks