Bigg Boss Telugu 10: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 10వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న గొడవలు చాలవన్నట్లు ఇప్పుడు కొత్తగా కెప్టెన్సీ రేసుతో హీట్ మరింత పెరిగింది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో సెకండ్ వీక్ కెప్టెన్సీ ఫైట్ చాలా టఫ్ గా మారింది.
పవర్ ఆఫ్ పీపుల్

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ను మేకర్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ ఏమో ‘మహా పరీక్ష’ పేరుతో హౌస్ మేట్స్ కావడానికి కంటెస్టెంట్లకు టాస్క్ లు పెట్టారు. మిడ్ వీక్ లోనే ఇద్దరిని ఇంటికి పంపించేశారు. ఇక ఇప్పుడు సెకండ్ వీక్ లో ‘పవర్ ఆఫ్ పీపుల్’ అనే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
ఆడియన్స్ ఓటింగ్
సెకండ్ వీక్ లో కెప్టెన్ కావడం కోసం బిగ్ బాస్ డిఫరెంట్ సెటప్ ప్లాన్ చేశాడు. హౌస్ లో ఉన్న 14 మంది కంటెస్టెంట్లలో ఎవరిని కెప్టెన్సీ కంటెండర్ గా చూడాలనుకుంటున్నారో, వాళ్లకు ఓట్లు వేసే ఛాన్స్ ఆడియన్స్ కు కల్పించారు. అలా ఆడియన్స్ నుంచి వచ్చిన ఓట్ల ప్రకారం 8 మందికి కెప్టెన్సీ రేసులో పోటీపడే అవకాశం కల్పించారు.
8 మంది వీళ్లే
ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కెప్టెన్సీ రేసులో పోటీపడుతున్న కంటెస్టెంట్లు.. త్రిగుణ్, దేబ్జానీ, అమన్, శాలిని, ముఖేష్, రోహిత్, ఝాన్సీ, ఆటో రాంప్రసాద్. ఈ వారం కెప్టెన్ కావడం కోసం ఈ 8 మంది పోటీపడుతున్నారు. అయితే వీళ్లకు బిగ్ బాస్ గట్టి టాస్క్ లనే ప్లాన్ చేశాడు.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెకండ్ వీక్ లో కెప్టెన్సీ రేసులో ఉన్న 8 మందికి టాస్క్ లు పెడుతున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ టాస్క్ ఏమో.. మిస్ మ్యాచ్ గా ఉన్న స్పెల్లింగ్ ను గెస్ చేసి ఆ వర్డ్ ను కరెక్ట్ గా రాయాలి. అలా రాసేవాళ్లు మిగతా కంటెండర్స్ ను రేసు నుంచి తప్పించేందుకు బెలూన్ పగలగొట్టే ఛాన్స్ పొందుతారు.
మళ్లీ ఫైర్
{{/usCountry}}బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెకండ్ వీక్ లో కెప్టెన్సీ రేసులో ఉన్న 8 మందికి టాస్క్ లు పెడుతున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ టాస్క్ ఏమో.. మిస్ మ్యాచ్ గా ఉన్న స్పెల్లింగ్ ను గెస్ చేసి ఆ వర్డ్ ను కరెక్ట్ గా రాయాలి. అలా రాసేవాళ్లు మిగతా కంటెండర్స్ ను రేసు నుంచి తప్పించేందుకు బెలూన్ పగలగొట్టే ఛాన్స్ పొందుతారు.
మళ్లీ ఫైర్
{{/usCountry}}కెప్టెన్సీ టాస్క్ తో మరోసారి బిగ్ బాస్ హౌస్ లో ఫైర్ మొదలైంది. త్రిగుణ్, రోహిత్, ముఖేష్, అమన్, శాలిని, ఝాన్సీ, రాంప్రసాద్.. ఇలా ఎవరికి వాళ్లు తమ పాయింట్ ను గట్టిగా వినిపిస్తున్నారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే త్రిగుణ్, రోహిత్ ను మెజారిటీ కంటెండర్లు టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మరి ఈ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఫస్ట్ కెప్టెన్ ఎవరవుతారన్నది వేచి చూడాల్సిందే.