Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఫస్ట్ వీక్ లోనే ఇద్దరిని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. సెకండ్ వీక్ లో మళ్లీ అందులో నుంచి ఒకరిని తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో సెకండ్ వీక్ కూడా ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది.
డబుల్ ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ఫస్ట్ వీక్ లోనే బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. మిడ్ వీక్ లోనే చరణ్, చైత్రను ఎలిమినేట్ చేశాడు. ఇప్పుడు సెకండ్ వీక్ లోనూ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. ఈ సారి ఓటింగ్ పరంగా లాస్ట్ 2లో ఇద్దరిని ఇంటికి పంపనున్నారని సమాచారం.
బిగ్ బాస్ 10 ఓటింగ్
బిగ్ బాస్ 10 ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే టాప్ ప్లేస్ కోసం రోహిత్, త్రిగుణ్ మధ్య టఫ్ ఫైట్ సాగుతున్నట్లు కనిపిస్తోంది. అనఫిషియల్ ఓటింగ్ ట్రెండ్ లో రోహిత్, త్రిగుణ్ కొద్ది తేడాతో టాప్ 1, 2 ప్లేసుల్లో కొనసాగుతున్నారు. ఒకసారేమో త్రిగుణ్, మరోసారి రోహిత్ టాప్ ప్లేస్ కు దూసుకొస్తున్నారు. వీళ్లకు 31 శాతానికి పైగా ఓట్లు పడుతున్నాయి.
వీళ్లు సేఫ్
ఇక బిగ్ బాస్ 10 తెలుగు సెకండ్ వీక్ లో మొత్తం 11 మంది నామినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఓటింగ్ లో మూడో ప్లేస్ నుంచి 9వ ప్లేస్ వరకు చూస్తే వరుసగా ముఖేష్ గౌడ, రాంప్రసాద్, దేబ్జానీ, శాలిని, ఝాన్సీ, సృష్టి, సుధీర్ ఉన్నారు. వీళ్లలో ముఖేష్ 10.13 శాతం, రాంప్రసాద్ 7.86 శాతంతో బెటర్ పొజిషన్ లో ఉన్నారు.
దేబ్జానీ (5.23), శాలిని (3.88), ఝాన్సీ (2.38), సృష్టి (2.25), సుధీర్ (2.14) కు ఓటింగ్ శాతం ఇంకా పెరగాల్సి ఉంది.
డేంజర్ జోన్లో
{{/usCountry}}దేబ్జానీ (5.23), శాలిని (3.88), ఝాన్సీ (2.38), సృష్టి (2.25), సుధీర్ (2.14) కు ఓటింగ్ శాతం ఇంకా పెరగాల్సి ఉంది.
డేంజర్ జోన్లో
{{/usCountry}}ప్రస్తుతం బిగ్ బాస్ 10 తెలుగు అనఫిషియల్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం కృష్ణుడు, వర్షిణి డేంజర్ జోన్లో ఉన్నారని సమాచారం. వర్షిణికి 1.77 శాతం, కృష్ణుడికి 1.76 శాతం ఓటింగ్ ఉందని తెలిసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ వారం హౌస్ నుంచి కృష్ణుడు వెళ్లిపోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వర్షిణిని కూడా హౌస్ నుంచి పంపించేస్తారని తెలుస్తోంది.
అయితే పట్టుబట్టి మరీ వర్షిణిని ఈ సీజన్ కోసం తీసుకొచ్చారు. అలాంటిది ఇప్పుడే వర్షిణిని ఎలిమినేట్ చేసే పరిస్థితి లేదని మరో టాక్ కూడా ఉంది. మరి చివరకు ఏం జరుగుతుందో వీకెండ్ ఎపిసోడ్లో తేలిపోతుంది.