Bigg Boss 10 Nominations: అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావా? ఏమైనా ఆడుతున్నావా? అని నాగార్జున ఫైర్ అయ్యేసరికి సృష్టి యాంగర్ మోడ్ లోకి వెళ్లినట్లు అనిపిస్తోంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో మూడో వారం నామినేషన్లలో సుధీర్ పై ఆమె మాటలతో రెచ్చిపోయింది.
సృష్టి వర్సెస్ సుధీర్

బిగ్ బాస్ 10 తెలుగు మూడో వీక్ నామినేషన్ రణరంగంగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సృష్టి వర్సెస్ సుధీర్ గొడవ వేరే లెవల్ లో ఉందని అంటున్నారు. సుధీర్ పై సృష్టి మాటలతో రెచ్చిపోయింది. నోటికి ఎంతొస్తే అంత వాగేసింది. లేటెస్ట్ బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమోలో ఇదంతా కనిపించింది.
మంట రాజేసిన రోహిత్
మూడో వారం నామినేషన్లలో సృష్టి వర్సెస్ సుధీర్ గొడవకు రోహిత్ మంట రాజేసినట్లు కనిపిస్తోంది. రోహిత్ నామినేషన్లలో సుధీర్, సృష్టి పేరు తీసుకొచ్చాడు. సుధీర్ అంటే సృష్టి అని సుధీర్ చెప్పాడని రోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో హౌస్ లో కలకలం రేగింది.
రెచ్చిపోయిన సృష్టి
రోహిత్ మాటలకు సుధీర్ కౌంటర్ ఇచ్చాడు. కానీ రోహిత్ ప్లాన్డ్ గా సుధీర్ ను ఇరికించినట్లు తెలుస్తోంది. తనతో సుధీర్ క్లోజ్ గా ఉంటున్నట్లు చెప్పుకోవడం సృష్టికి నచ్చలేదు. దీంతో సుధీర్ పై రెచ్చిపోయింది.
సుధీర్ ఏమో బిగ్ బాస్ హౌస్ లో సృష్టి, నేను మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. సృష్టి ఏమో ఫ్రెండ్స్ కూడా కాదన్నది. దీంతో ‘బిగ్ బాస్ నాకు ఫ్రీడమ్ దొరికింది’ అని సుధీర్ గట్టిగట్టిగా అరిచాడు.
పళ్లు రాలిపోతాయ్
సుధీర్ గట్టిగా అరవడంతో సృష్టి ఇంకా ట్రిగర్ అయింది. ఆమెలోని కోపమంతా ఒక్కసారిగా బయటకు వచ్చింది. ‘గుద్దితే పళ్లు రాలిపోతాయ్’ అంటూ సుధీర్ పైకి వేలు చూపిస్తూ సృష్టి దూసుకెళ్లింది. ఇంకా చాలా మాటలే అన్నది. సృష్టిని ఆపేందుకు హౌస్ మేట్స్ ట్రై చేసినా, ఆమె కంట్రోల్ చేసుకోలేకపోయింది.
నామినేషన్స్ లో వీళ్లు
{{/usCountry}}సుధీర్ గట్టిగా అరవడంతో సృష్టి ఇంకా ట్రిగర్ అయింది. ఆమెలోని కోపమంతా ఒక్కసారిగా బయటకు వచ్చింది. ‘గుద్దితే పళ్లు రాలిపోతాయ్’ అంటూ సుధీర్ పైకి వేలు చూపిస్తూ సృష్టి దూసుకెళ్లింది. ఇంకా చాలా మాటలే అన్నది. సృష్టిని ఆపేందుకు హౌస్ మేట్స్ ట్రై చేసినా, ఆమె కంట్రోల్ చేసుకోలేకపోయింది.
నామినేషన్స్ లో వీళ్లు
{{/usCountry}}బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ మూడో వారంలో 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నట్లు తెలిసింది. టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ థీమ్ తో సాగుతున్న ఈ వీక్ లో.. సుధీర్, వంశీ, వర్షిణి, సృష్టి, రోహిత్, శాలిని, త్రిగుణ్, ముఖేష్ నామినేట్ అయినట్లు సమాచారం. ఈ నామినేషన్ ప్రక్రియలో ముఖేష్ వర్సెస్ త్రిగుణ్, సుధీర్ వర్సెస్ త్రిగుణ్ గొడవలు కూడా జరిగినట్లు టాక్.