...
...
Next Story

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10.. ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్.. నెక్స్ట్ శాలిని?

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 తెలుగులోకి వైల్డ్ కార్డు 2.0 సునామీ రాబోతుంది. రేపే (అక్టోబర్ 10) వైల్డ్ కార్డు ద్వారా కొత్త కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుందని తెలిసింది. అపూర్వ ఎలిమినేట్ అవుతుందని టాక్.

Published on: Oct 10, 2026, 20:49:08 IST
Advertisement

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో అపూర్వ జర్నీ ముగిసిందని సమాచారం. ఈ వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతుందని తెలిసింది. వైల్డ్ కార్డు గా మూడో వారం హౌస్ లోకి వచ్చిన అపూర్వ.. అయిదో వారం ఎగ్జిట్ కావాల్సి రావడం గమనార్హం.

బిగ్ బాస్ 10 తెలుగు ఎలిమినేషన్

బిగ్ బాస్ 10.. ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్.. నెక్స్ట్ శాలిని? (youtube/starmaa)
బిగ్ బాస్ 10.. ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్.. నెక్స్ట్ శాలిని? (youtube/starmaa)

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు ఆదివారం ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ లేదంటే ట్రిపుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వీకెండ్ లో ఫస్ట్ అపూర్వ ఎలిమినేట్ అవుతుందని తెలిసింది.

వైల్డ్ కార్డు ఎంట్రీ

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ అగ్ని పరీక్షలో అపూర్వ అదరగొట్టింది. కానీ బిగ్ బాస్ కొత్త సీజన్ లో ఫస్ట్ సెలెక్ట్ కాలేదు. అయితే ఆ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టింది. మూడో వారంలో అపూర్వ, మిథిలేష్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అపూర్వ వద్దని హౌస్ లో మెజారిటీ కంటెస్టెంట్లు ఓటు వేశారు. అందుకు రివర్స్ గా అపూర్వను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు.

అసలేం చేసింది?

బిగ్ బాస్ రియాలిటీ షో అనేది బిగ్ ప్లాట్ ఫామ్. ఈ షోలో పాల్గొనే ఒక్క అవకాశం కోసం బయట కొన్ని లక్షల మంది ఎంతో ప్రయత్నిస్తుంటారు. అలాంటి గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న అపూర్వ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో అసలేం చేసిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. త్రిగుణ్ ను టార్గెట్ చేయడం, ముఖేష్ పై పెద్దగా అరవడం, సుధీర్ ను మాటలు అనడం తప్ప అపూర్వ ఏం చేయలేదనే విమర్శలు వస్తున్నాయి.

డిజాస్టరస్ కెప్టెన్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో అయిదో వారంలో డబుల్ ఎలిమినేషన్ పక్కా అని సమాచారం. అపూర్వ తర్వాత శాలిని కూడా ఎలిమినేట్ అయి వెళ్లిపోతుందని తెలిసింది. రోహిత్ తో లవ్ ట్రాక్, పెద్దపెద్దగా అరవడం తప్ప శాలిని కూడా ఏం చేయలేదని జనాలు ఫీల్ అయ్యారని టాక్. అందుకే ఆమెకు పెద్దగా ఓట్లు కూడా పడలేదని అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks