Bigg Boss 10 Nominations: బిగ్ బాస్ హౌస్ అంటేనే అనూహ్య పరిణామాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడు ఎవరు స్నేహితులుగా ఉంటారో, ఎప్పుడు శత్రువులుగా మారుతారో ఎవరూ ఊహించలేరు. బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతోంది. బయట పరిచయం ఉందని, హౌస్ లోకి వచ్చాక కూడా ఎంతో అన్యోన్యంగా కలిసే ఉన్న ముగ్గురు కంటెస్టెంట్లు ఇప్పుడు ఉప్పు, నిప్పులా మారారు.
ఆడియన్స్ షాక్

మంచి ఫ్రెండ్స్ అయిన వర్షిణి, రాంప్రసాద్, నరేష్ మధ్య ఫ్రెండ్స్ అనే ముసుగు తొలగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు 10లో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ వీరి మధ్య ఉన్న స్నేహానికి బీటలు వారేలా చేసింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో మాటల దాడికి దిగడం ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
నామినేషన్లలో స్నేహితుల వార్
నిన్నటి మొన్నటి వరకు ఎంతో క్లోజ్ గా ఉన్న ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్స్ లో పెద్ద యుద్ధమే జరిగింది. స్ట్రాటజీలో భాగమో లేక నిజంగానే మనస్పర్థలు వచ్చాయో కానీ ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకున్నారు. నరేష్ ను వర్షిణి నామినేట్ చేయగా, వర్షిణిని రాంప్రసాద్ నామినేట్ చేసి షాక్ ఇచ్చాడు.
ఈ సమయంలో వీరి మధ్య జరిగిన వాగ్వాదం హైలైట్ గా నిలవడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నేహం పేరుతో మోసం చేసుకున్నారంటూ ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు హౌస్ లో వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి.
ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే
ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ అత్యంత వాడీవేడిగా సాగింది. పాత పగలు, కొత్త కోపాలు అన్నీ నామినేషన్స్ రూపంలో బయటపడ్డాయి. ఫైనల్ గా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు మొత్తం 10 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఆ ఫుల్ లిస్ట్ చూస్తే.. వర్షిణి, ముఖేష్, అమన్, వంశీ, నీతు, శివ, నరేష్, దేబ్జానీ, సుధీర్, రాంప్రసాద్ ఉన్నారు. చాలా మంది నామినేషన్స్ లో ఉండటంతో ఈ వారం ఓటింగ్ మరింత రసవత్తరంగా మారనుంది.
వర్షిణి ఎలిమినేషన్ ఖాయమేనా?
{{/usCountry}}ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ అత్యంత వాడీవేడిగా సాగింది. పాత పగలు, కొత్త కోపాలు అన్నీ నామినేషన్స్ రూపంలో బయటపడ్డాయి. ఫైనల్ గా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు మొత్తం 10 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఆ ఫుల్ లిస్ట్ చూస్తే.. వర్షిణి, ముఖేష్, అమన్, వంశీ, నీతు, శివ, నరేష్, దేబ్జానీ, సుధీర్, రాంప్రసాద్ ఉన్నారు. చాలా మంది నామినేషన్స్ లో ఉండటంతో ఈ వారం ఓటింగ్ మరింత రసవత్తరంగా మారనుంది.
వర్షిణి ఎలిమినేషన్ ఖాయమేనా?
{{/usCountry}}నామినేషన్స్ లో ఉన్న 10 మందిలో వర్షిణి పరిస్థితి చాలా డేంజర్ లో ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వారం హౌస్ నుంచి వర్షిణి ఎలిమినేట్ అవడం దాదాపు ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. గత వారం కూడా ఆమె ఎలిమినేషన్ ముంగిట నిలిచింది. కానీ అనూహ్యంగా గ్రీన్ జోన్లోకి వెళ్లి సేఫ్ అయిపోయింది.
వాస్తవానికి గత వారమే వర్షిణి ఎలిమినేట్ కావాల్సి ఉందని, కానీ సమీకరణాల వల్ల ఝాన్సీ బలైపోయిందనే కామెంట్స్ బయట బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తన సొంత స్నేహితులనే నామినేట్ చేయడం, తిరిగి వాళ్లతోనే నామినేట్ అవ్వడంతో ఈసారి వర్షిణికి ఎలిమినేషన్ గండం తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.