...
...
Next Story

Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్ 10 ‘లవ్ బర్డ్స్’ విడిపోతారా? ఆరో వారం నామినేషన్స్ లో శాలిని.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఆరో వారంలో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. హౌస్ లో క్లోజ్ గా ఉంటూ లవ్ బర్డ్స్ అనే ముద్ర వేసుకున్న శాలిని, రోహిత్ విడిపోతారా? అనే చర్చ జోరందుకుంది. ఎందుకంటే నామినేషన్స్ లో ఉన్న శాలిని డేంజర్ జోన్లోకి వెళ్లడమే కారణం.

Published on: Oct 14, 2026, 13:48:22 IST
Advertisement

Bigg Boss Telugu 10: బుల్లితెర హిట్‌ రియాలిటీ షో బిగ్‌ బాస్ తెలుగు 10వ సీజన్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి హౌస్‌లో మునుపెన్నడూ లేనంతగా హీట్ పెరిగింది. ఈ వారం ఎలిమినేషన్ రేసులో నిలిచిన కంటెస్టెంట్ల జాతకాలు మారబోతున్నాయి. ముఖ్యంగా కొందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్లలోకి రావడంతో ఓటింగ్ లెక్కలు ఒక్కసారిగా తలకిందులవుతున్నాయి.

నామినేషన్లలో ఆరుగురు

బిగ్‌ బాస్ 10 ‘లవ్ బర్డ్స్’ విడిపోతారా? ఆరో వారం నామినేషన్స్ లో శాలిని.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు! (youtube/starmaa)
బిగ్‌ బాస్ 10 ‘లవ్ బర్డ్స్’ విడిపోతారా? ఆరో వారం నామినేషన్స్ లో శాలిని.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు! (youtube/starmaa)

బిగ్ బాస్ తెలుగు 10లో ఆరో వారం నామినేషన్ల అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్న వారిలో టెంపర్ వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, శాలిని, రాంప్రసాద్ ఉన్నారు. హౌస్‌లో జరిగిన గొడవలు, వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ హోరాహోరీగా సాగిన ఈ ప్రక్రియతో వీరంతా డేంజర్ జోన్‌కు చేరుకున్నారు. ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం ఈ ఆరుగురిలో కొందరికి భారీగా ఓట్లు పడుతుండగా, మరికొందరు వెనుకబడిపోయారు.

లవ్ బర్డ్స్ రోహిత్, శాలిని విడిపోతారా?

ఈ వారం నామినేషన్లలో హాట్ టాపిక్‌గా మారింది మాత్రం రోహిత్, శాలిని జంటే! హౌస్‌లో ఎంతో క్లోజ్‌గా ఉంటూ 'లవ్ బర్డ్స్'గా ముద్రపడిన ఈ ఇద్దరూ ఒకేసారి నామినేషన్స్ లోకి రావడం గమనార్హం. ఓటింగ్ పరంగా చూస్తే రోహిత్ టాప్ ప్లేసులో దూసుకెళ్తున్నాడు. శాలిని మాత్రం బాటమ్ లో ఉంది.

ఈ నేపథ్యంలో బిగ్‌ బాస్ హౌస్ లోని ఈ క్రేజీ కపుల్ ఈ వీకెండ్ విడిపోక తప్పదా? శాలిని ఎలిమినేట్ అయితే రోహిత్ గేమ్ ప్లాన్ ఎలా మారబోతోంది? అనేది ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు

ఈ ముగ్గురి నుంచే ఈ వారం ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. దసరా పండుగకు ముందు వారం కావడం, హౌస్‌లో కంటెస్టెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. ఈసారి ఒక్కరు కాకుండా ఇద్దరు (డబుల్ ఎలిమినేషన్) ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా పుష్కలంగా ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

శాలిని ఔట్?

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి శాలిని, వర్షిణిలో ఒకరు లేదా ఇద్దరూ ఎలిమినేట్ అవుతారనే టాక్ బలంగా వినిపిస్తోంది. హౌస్ లో శాలిని అరవడం, రోహిత్ చుట్టూ తిరగడం తప్పా ఏం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత వారం ఎలిమినేషన్ కు దగ్గరగా వెళ్లి శాలిని తప్పించుకుంది. మరి ఈ వారం ఆమె భవిష్యత్ ఏంటో వేచి చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks