Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ శ్వేత నాయుడు జర్నీ ముగిసినట్లు తెలిసింది. ఈ సీజన్ పదో వారంలో హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఈ ఎలిమినేషన్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శ్వేత షాకింగ్ ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నుంచి ఈ వారం శ్వేత నాయుడు ఎలిమినేట్ అవుతుందనే విషయం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎందుకంటే వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన శ్వేత ఇంత త్వరగా ఎగ్జిట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. హౌస్ లో కూడా ఆమె యాక్టివ్ గానే కనిపించింది. కానీ ఈ సీజన్ లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న బిగ్ బాస్.. ఈ వారం శ్వేత ఎలిమినేషన్ తో మరో షాక్ ఇచ్చారని తెలిసింది.
ఓటింగ్ ఇలా
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో నామినేషన్లలో ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, అమన్, నరేష్, సుధీర్, నీతు, రాంప్రసాద్, శ్వేత, ఆర్కే, శివ కుమార్ ఉన్నారు. అనఫిషియల్, సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే శివ కుమార్ లాస్ట్ ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఓటింగ్ రిజల్ట్ పట్టించుకోకుండా శ్వేతను బయటకు పంపించారని సమాచారం.
బిగ్ బాస్ పై విమర్శలు
ఇక ఈ వారం హౌస్ లో ఫ్యామిలీ వీక్ సాగింది. కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో హౌస్ లో ఎమోషనల్ ఫీలింగ్స్ కనిపించాయి. వాతావరణం మొత్తం మారిపోయింది. కానీ ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ వ్యవహరించిన తీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
{{/usCountry}}ఇక ఈ వారం హౌస్ లో ఫ్యామిలీ వీక్ సాగింది. కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో హౌస్ లో ఎమోషనల్ ఫీలింగ్స్ కనిపించాయి. వాతావరణం మొత్తం మారిపోయింది. కానీ ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ వ్యవహరించిన తీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
{{/usCountry}}ఫస్ట్ నుంచి వర్షిణి, ఆర్కే పేరెంట్స్ రారు అని బిగ్ బాస్ చెప్తూ వచ్చాడు. కానీ ఆఖర్లో వీళ్ల ఇద్దరి పేరెంట్స్ ను హౌస్ లోని యాక్టివిటీ ఏరియాకు తీసుకొచ్చారు. కానీ హౌస్ మేట్స్ ఓటింగ్ ప్రకారం మెజారిటీ ఓట్లు వర్షిణికి రావడంతో వాళ్ల అమ్మను మాత్రం ముందు లోపలికి పంపించారు.
మూడు గంటలు కూర్చోబెట్టి
అప్పుడు ఆర్కే వాళ్ల అమ్మ చాలా ఏడ్చారు. అయితే ఆ తర్వాత ఆర్కే వాళ్ల అమ్మను కూడా హౌస్ లోకి పంపించారని తెలిసింది. కానీ ఆమెను దాదాపు మూడు గంటల పాటు కూర్చోబెట్టారంటా. దీంతో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆటలేంటీ? ఈ చీప్ టీఆర్పీ స్టంట్లు ఏంటని బిగ్ బాస్ పై విమర్శలు వస్తున్నాయి.
ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్లో సందడి డబుల్ కానుంది. బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ల కోసం సెలబ్రిటీలు స్టేజీపైకి రానున్నారు.