Bigg Boss Telugu 10: బుల్లితెరపై క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం ఐదో వారం నామినేషన్ల ప్రక్రియతో ఎంతో రసవత్తరంగా సాగుతోంది. అయితే, హౌస్‌లోని సమీకరణాలను పూర్తిగా మార్చేసేందుకు మేకర్స్ సరికొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రంగంలోకి దించుతున్నారు. తాజా సమాచారం ప్రకారం అయిదారుగురు సెలబ్రిటీలు వైల్డ్ కార్డుతో వస్తారని టాక్.
బిగ్ బాస్ 10 తెలుగు వైల్డ్ కార్డు

బిగ్ బాస్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీలు కామనే. ఆటలో జోష్ తగ్గిపోతుందని ఆడియన్స్ ఫీల్ అవుతున్న టైమ్ లో వైల్డ్ కార్డులను మేకర్స్ రంగంలోకి దించుతారు. అయితే బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలు రెండు సార్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వైల్డ్ కార్డు ద్వారా అపూర్వ, మిథిలేష్ హౌస్ లోకి వచ్చారు. మిథిలేష్ ఏమో రూ.15 లక్షలు తీసుకొని వెళ్లిపోయాడు.
వీళ్లు కన్ఫామ్
బిగ్ బాస్ తెలుగు 10లో వైల్డ్ కార్డు 2.0లో భాగంగా అయిదారుగురు సెలబ్రిటీలు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని టాక్. వీళ్లలో సీరియల్ హీరో శివ్ కుమార్, నవరసాలు ఆర్కే, నీతు నటరాజ్ మాస్టర్ పేర్లు కన్ఫామ్ అయ్యాయని తెలిసింది.
• శివ్ కుమార్: ప్రముఖ సీరియల్ నటుడు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ లవర్ అయిన శివ్ కుమార్‌కు బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. ఈ బిగ్ బాస్ సీజన్ ప్రారంభం నుంచి ప్రాబబుల్స్ లిస్ట్‌లో ఉన్న శివ్ కుమార్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి రావడం కన్ఫామ్ అని తెలుస్తోంది. ఇప్పటికే అతను నిన్ను కోరి సీరియల్ నుంచి తప్పుకున్నాడు.
• రామకృష్ణ (నవరసాల రామకృష్ణ): ప్రీ-షో 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' ద్వారా పాపులర్ అయిన రామకృష్ణ, ఈ మిడ్-వీక్‌లో వైల్డ్ కార్డ్ రూపంలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ లేపడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒకసారి అతను మిథిలేష్, అపూర్వతో కలిసి హౌస్ లోకి వచ్చాడు. కానీ మిథిలేష్ తో టాస్క్ లో ఓడిపోయి వెళ్లిపోయాడు.
{{/usCountry}}• రామకృష్ణ (నవరసాల రామకృష్ణ): ప్రీ-షో 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' ద్వారా పాపులర్ అయిన రామకృష్ణ, ఈ మిడ్-వీక్‌లో వైల్డ్ కార్డ్ రూపంలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ లేపడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒకసారి అతను మిథిలేష్, అపూర్వతో కలిసి హౌస్ లోకి వచ్చాడు. కానీ మిథిలేష్ తో టాస్క్ లో ఓడిపోయి వెళ్లిపోయాడు.
{{/usCountry}}• నీతు నటరాజ్: ప్రొఫెషనల్ డాన్సర్, కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ భార్య అయిన నీతు నటరాజ్ కూడా మిడ్-వీక్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.
వీళ్లు వెయిటింగ్
ఇంకా ఈ సారి బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలుగా కావ్యశ్రీ, సీరత్ కపూర్, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్ లాంటి సెలబ్రిటీలు కూడా వస్తారని టాక్ వినిపిస్తోంది. వీళ్లలో నుంచి కావ్యశ్రీ ఎంట్రీ అయితే ఖాయమని అంటున్నారు. చెఫ్ మంత్ర కుకింగ్ షో నుంచి కావ్యశ్రీ మధ్యలోనే తప్పుకోవడమే ఇందుకు కారణం. మరి ఏ సెలబ్రిటీలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తారో వేచి చూడాల్సిందే.