Bigg Boss 10 Winner: బిగ్ బాస్ తెలుగు 10 (దశావతారం) సీజన్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ హౌస్‌లో, బయట ప్రేక్షకుల్లో ఉత్కంఠ రెట్టింపు అవుతోంది. సెప్టెంబర్ 6న అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ప్రారంభమైన ఈ సీజన్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ నడుస్తోంది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరూ అనేది హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ 10 హీరో త్రిగుణేనా?

బిగ్ బాస్ తెలుగు 10 మొదటి వారం నుంచే అగ్రెసివ్ గేమ్, మైండ్ గేమ్‌తో కంటెంట్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నాడు త్రిగుణ్ (ఆదిత్ అరుణ్). ఇప్పుడు అతను దాదాపు షో మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. దీంతో 'బిగ్ బాస్ 10 అంటే త్రిగుణ్' అనే అభిప్రాయం అటు ప్రేక్షకుల్లోనే కాకుండా, ఇటు హౌస్మేట్స్లోనూ బలంగా నాటుకుపోయింది.
హౌస్మేట్స్ టార్గెట్ త్రిగుణ్
ఇటీవల జరిగిన ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లో స్టేజ్‌పైకి వచ్చిన పలువురు సెలబ్రిటీలు, ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు దాదాపు అందరూ త్రిగుణ్‌ను తమ టాప్-3 జాబితాలో చేర్చారు. దర్శకుడు సాయి రాజేష్ ఏకంగా 'ఈ సీజన్ అంటేనే త్రిగుణ్' అని ప్రశంసించగా, హైపర్ ఆది సైతం దశావతారంలో కమల్ హాసన్ కంటే ఎక్కువ అవతారాలు త్రిగుణ్ చూపిస్తున్నాడంటూ పంచ్ వేశాడు.
ఈ సంకేతాలతో హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. బిగ్ బాస్ దశావతారం అంటే త్రిగుణ్ అన్నట్లుగా పరిస్థితి మారిపోవడంతో, అతని హవాకు బ్రేక్ వేసి కిందకు దించాలని ప్రత్యర్థి వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ముఖేష్ గౌడ, రామకృష్ణ, నరేష్, రామ్ ప్రసాద్, వర్షిణి బృందం త్రిగుణ్ వ్యూహాలను డీకోడ్ చేస్తూ అతన్ని ఇరకాటంలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
డిక్టేటర్స్ వీక్‌లో మాస్టర్ స్ట్రోక్!
పదకొండో వారంలో టికెట్ టు ఫినాలే కంటెండర్స్ రేసు కోసం బిగ్ బాస్ 'డిక్టేటర్స్ వీక్' టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇందులో త్రిగుణ్, ముఖేష్ గౌడలను ఇద్దరు డిక్టేటర్లుగా నియమించారు. ఆరంభంలో జరిగిన టాస్క్‌లో ముఖేష్ గెలిచి, తనకు నచ్చిన ఆరుగురు ఫాలోవర్లను ఎంచుకునే అడ్వాంటేజ్ పొందాడు. అయినా సరే త్రిగుణ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన వద్ద ఉన్న శివ, దేబ్జానీ, వంశీ, నీతూలతోనే పక్కా వ్యూహాలు రచించి ఆటను తనవైపు తిప్పుకున్నాడు.
{{/usCountry}}పదకొండో వారంలో టికెట్ టు ఫినాలే కంటెండర్స్ రేసు కోసం బిగ్ బాస్ 'డిక్టేటర్స్ వీక్' టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇందులో త్రిగుణ్, ముఖేష్ గౌడలను ఇద్దరు డిక్టేటర్లుగా నియమించారు. ఆరంభంలో జరిగిన టాస్క్‌లో ముఖేష్ గెలిచి, తనకు నచ్చిన ఆరుగురు ఫాలోవర్లను ఎంచుకునే అడ్వాంటేజ్ పొందాడు. అయినా సరే త్రిగుణ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన వద్ద ఉన్న శివ, దేబ్జానీ, వంశీ, నీతూలతోనే పక్కా వ్యూహాలు రచించి ఆటను తనవైపు తిప్పుకున్నాడు.
{{/usCountry}}ముందుగా బెడ్రూమ్ ఏరియాను సొంతం చేసుకున్న త్రిగుణ్, ప్రత్యర్థి టీమ్‌లోని సుధీర్‌ను సంచాలకుడిగా పక్షపాతం చూపాడనే కారణంతో ఆట నుంచి తప్పించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన 'స్వాప్' (Swap) ఆఫర్‌ను తెలివిగా వాడుకుని, తన మాట వినని నీతూను అవతలి టీమ్‌కు పంపి, ముఖేష్ టీమ్‌లో అత్యంత బలమైన ఆటగాడైన అమన్‌ను తన జట్టులోకి లాగేసుకున్నాడు. అనంతరం జరిగిన కీలక టాస్క్‌లో అమన్ అద్భుత ప్రదర్శనతో గెలవడంతో కిచెన్ ఏరియా కూడా త్రిగుణ్ ఆధీనంలోకి వచ్చింది.
'వార్ వన్ సైడ్' అయిపోయిందా?
బలమైన పోటీదారుగా ఉన్న రోహిత్ నాయుడు అనూహ్యంగా ఇంటి సభ్యుల ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ కావడం, మరోవైపు డిక్టేటర్స్ వీక్‌లో త్రిగుణ్ టీమ్ వరుస విజయాలు సాధించడంతో 'వార్ వన్ సైడ్' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, అన్అఫీషియల్ ఓటింగ్ సరళిని లోతుగా పరిశీలిస్తే పోటీ ఇంకా పూర్తిగా ఏకపక్షంగా మారలేదనే చెప్పాలి. ఈ 11వ వారంలో మొత్తం 11 మంది నామినేషన్స్‌లో ఉండగా, అందులో దాదాపు 60 శాతం ఓట్లను త్రిగుణ్, ముఖేష్ గౌడ ఇద్దరే పంచుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు, ఆన్లైన్ పోల్స్ విశ్లేషిస్తున్నాయి.
ఫైనల్ రేసు దాదాపు త్రిగుణ్ వర్సెస్ ముఖేష్గానే సాగేలా కనిపిస్తోంది. మొత్తానికి హౌస్‌లో ఆట పరంగా త్రిగుణ్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ టైటిల్ ఫేవరెట్‌గా దూసుకుపోతున్నా, రాబోయే వారాల్లో హౌస్మేట్స్ వ్యూహాలను, ముఖేష్ ఓటు బ్యాంకును తట్టుకుని 'దశావతారం' కప్పు ఎగరేసుకుపోతాడా లేదా అన్నది చూడాలి!