...
...
Next Story

బిగ్ బాస్‌లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్- నిన్న ఒకరు, ఇవాళ మరొకరు ఎలిమినేట్- వర్కౌట్ కానీ ఫైర్ స్టోర్మ్స్ కాన్సెప్ట్!

బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం కూడా షాకింగ్‌గా డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. ఇప్పటికీ శనివారం (నవంబర్ 15) నాటి ఎపిసోడ్‌లో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. తాజాగా ఇవాళ మరొకరు ఎలిమినేట్ కానున్నారు. మరి బిగ్ బాస్ తెలుగు 9 పదోవారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 16, 2025, 08:46:15 IST
Advertisement

ఊహించని ట్విస్టులు, అనుకోని సర్‌ప్రైజ్‌లతో బిగ్ బాస్ తెలుగు 9 సాగుతోంది. ఇప్పటికే గత వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సెల్ఫ్ నామినేషన్‌తో రాము రాథోడ్ షో నుంచి వైదొలిగితే.. బిగ్ బాస్ ఓటింగ్ తక్కువ రావడంతో సాయి శ్రీనివాస ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు.

ఇమ్మాన్యూయెల్ తప్పా

బిగ్ బాస్‌లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్- నిన్న ఒకరు, ఇవాళ మరొకరు ఎలిమినేట్- వర్కౌట్ కానీ ఫైర్ స్టోర్మ్స్ కాన్సెప్ట్!
బిగ్ బాస్‌లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్- నిన్న ఒకరు, ఇవాళ మరొకరు ఎలిమినేట్- వర్కౌట్ కానీ ఫైర్ స్టోర్మ్స్ కాన్సెప్ట్!

ఇక బిగ్ బాస్ 9 తెలుగు పదో వారం కూడా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది. అయితే, బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో ఇమ్మాన్యూయెల్ తప్పా మిగతా 10 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్

ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో నిఖిల్ నాయర్, భరణి శంకర్, గౌరవ్ గుప్తా, దివ్య నిఖిత, సంజన గల్రానీ, తనూజ గౌడ, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, రీతూ చౌదరి, కల్యాణ్ పడాల పది మంది ఉన్నారు. వీరికి నామినేషన్స్ అనంతరం నుంచే ఓటింగ్ పోల్స్ నిర్వహించారు.

నిఖిల్ నాయర్ ఎలిమినేట్

అయితే, వీరిలో టాప్ 1లో కల్యాణ్ పడాలా రాగా రెండో స్థానంలో తనూజ పుట్టస్వామి బిగ్ బాస్ ఓటింగ్ తెచ్చుకుంది. అతి తక్కువ ఓటింగ్‌తో చివరి స్థానం అంటే పదో ప్లేసులో నిఖిల్ నాయర్ ఉన్నాడు. దాంతో నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు 9 నవంబర్ 15వ తేది ఎపిసోడ్‌లోనే నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.

ఇవాళ గౌరవ్ గుప్తా ఎలిమినేట్

ఈ ఇద్దరితో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయారు. బిగ్ బాస్ ప్రారంభంలో వచ్చిన కంటెస్టెంట్స్ మాత్రమే ప్రస్తుతం మిగిలారు. వీరిలో ఒక దివ్య నిఖిత బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నిరూపించుకుని వైల్డ్ కార్డ్‌లా వచ్చింది. ఆమెను ఫైర్ స్టోర్మ్ బ్యాచ్‌గా అనుకోలేం.

వర్కౌట్ కానీ ఫైర్ స్టోర్మ్స్

వైల్డ్ కార్డ్ లేదా రాయల్ కార్డ్ అనే పేరు చెప్పి అసలైన ఫైర్ స్టోర్మ్స్ అంటూ తీసుకొచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ప్రేక్షకులకు నచ్చక ఎలిమినేట్ చేసి పంపించేశారు. దీంతో ఈ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో ఫైర్ స్టోర్మ్స్ అనే కాన్సెప్ట్ ఏమాత్రం వర్కౌట్ కాలేదని స్పష్టంగా తెలుస్తోంది.

అందుకు పెద్దగా భాష రాని వాళ్లను తీసుకురావడం, లేదా పెద్దగా పాపులారిటీ లేని సెలబ్రిటీలను తీసుకురావడమే కారణంగా పలువురి రివ్యూస్ ద్వారా అర్థం అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe