బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 12వ వారానికి చేరుకుంది. గత వారం అంతా ఫ్యామిలీ వీక్ సాగింది. అలాగే, వీకెండ్స్‌లో కంటెస్టెంట్స్‌కు రిలేటివ్స్, సెలబ్రిటీలు వచ్చి హింట్స్ ఇచ్చి వెళ్లారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 9 పన్నెండో వారం నామినేషన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
రెండు రకాలుగా నామినేషన్స్

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే, వీరికి ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ రెండు రకాలుగా జరిగాయి. ఒకటి బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిలో ప్రైవేట్‌గా, మరోటి అందరి ముందు ఓపెన్‌గా కారణాలు చెప్పి నామినేట్ చేయడం. బ్యాలెట్ విధానంలో కెమెరాలను చూస్తూ పాయింట్స్ చెప్పి ఒకరిని నామినేట్ చేయాలి.
మరోకరిని అందరి ముందే వారి ఫొటోను ఫైర్‌లో వేసి నామినేట్ చేయాలి. ఈ విధానంలోనే కల్యాణ్ పడాల, డీమాన్ పవన్ మధ్య బిగ్గెస్ట్ ఫైట్ జరిగిందని సమాచారం. ఈ గొడవ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో బిగ్గెస్ట్ ఫైట్ అని పలువురు రివ్యూవర్స్‌కు లీకైనట్లుగా తెలుస్తోంది. నామినేషన్స్‌లో పాయింట్స్ చెప్పే క్రమంలో ఈ గొడవ జరిగిందని, మధ్యలో రీతూ కూడా వెళ్లిందని టాక్.
ముగ్గురి మధ్య గొడవ
ఆ గొడవ ముగ్గురి మధ్య జరిగి మరింత రచ్చగా మారిందని అంటున్నారు. ఇక ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌ను ఇవాళ (నవంబర్ 24) ప్రసారం చేయనున్నారు. అయితే, నేటి బిగ్ బాస్ తెలుగు 9 నవంబర్ 14 ఎపిసోడ్‌లో కేవలం ప్రైవేట్ నామినేషన్స్ మాత్రమే చూపించనున్నట్లు టాక్.
ప్రైవేట్‌గా తనూజను నామినేట్ చేసిన భరణి శంకర్ ఓపెన్‌గా దివ్య నిఖితాను చేశాడు. అదే దివ్య ప్రైవేట్‌గా భరణిని, ఓపెన్‌గా తనూజ గౌడను నామినేట్ చేసింది. అలాగే, తనూజ పుట్టస్వామి ప్రైవేట్‌గా డీమాన్ పవన్‌ను, ఓపెన్‌గా దివ్యను నామినట్ చేసింది. ఈ క్రమంలో పవన్, తనూజ మధ్య ఫైట్ జరిగింది.
అత్యధిక నామినేషన్ ఓట్లు ఆమెకే
{{/usCountry}}ప్రైవేట్‌గా తనూజను నామినేట్ చేసిన భరణి శంకర్ ఓపెన్‌గా దివ్య నిఖితాను చేశాడు. అదే దివ్య ప్రైవేట్‌గా భరణిని, ఓపెన్‌గా తనూజ గౌడను నామినేట్ చేసింది. అలాగే, తనూజ పుట్టస్వామి ప్రైవేట్‌గా డీమాన్ పవన్‌ను, ఓపెన్‌గా దివ్యను నామినట్ చేసింది. ఈ క్రమంలో పవన్, తనూజ మధ్య ఫైట్ జరిగింది.
అత్యధిక నామినేషన్ ఓట్లు ఆమెకే
{{/usCountry}}కల్యాణ్ సీక్రెట్‌గా కమెడియన్ సుమన్ శెట్టిని, ఓపెన్‌గా డీమాన్ పవన్‌ను నామినేట్ చేశాడు. ఈ సమయంలోనే కల్యాణ్ వర్సెస్ పవన్ చోటు చేసుకుంది. ఇక డీమాన్ పవన్ ప్రైవేట్‌గా కల్యాణ్‌ను, ఓపెన్‌గా ఇమ్మాన్యూయెల్‌ను నామినేషన్స్‌లోకి పంపించాడు. సుమన్ ప్రైవేట్‌గా సంజనను, ఓపెన్‌గా తనూజను నామినేట్ చేశాడు.
ఇమ్మాన్యూయెల్ సీక్రెట్‌గా డీమాన్ పవన్‌ను, ఓపెన్‌గా తనూజను నామినేషన్స్‌లోకి పంపించాడు. రీతూ చౌదరి సీక్రెట్‌గా సంజన గల్రానిని, ఓపెన్‌గా కల్యాణ్ పడాలను నామినేట్ చేసింది. ఇలా రెండు దశల్లో జరిగిన ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో అత్యధికంగా ఓట్లు సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామికి పడ్డాయి.
ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది
ఇకపోతే బిగ్ బాస్‌లో ఈ వారం 8 మంది నామినేట్ అయ్యారు. అంటే ఒక్కరు తప్పా ఈ వారం అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి కెప్టెన్ అయిన కారణంగా బిగ్ బాస్ తెలుగు 9 పన్నెండో వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయింది.