ఓటీటీలోని ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ చూశారా? ఫోన్ ఎత్తితే అంతే సంగతి-వెన్నులో వణుకు పుట్టించే మూవీ
ఓటీటీలోకి కొత్తగా వచ్చిన ఓ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను వణికిస్తోంది. వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో ఈ మూవీ హడలెత్తిస్తోంది. ఫోన్ ఎత్తితే ఇక అంతే సంగతి. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.
క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ, వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో ఓటీటీలోకి ఓ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేసింది. సినిమాలోని క్యారెక్టర్లను చావులా వెంటాడుతూ ఈ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ కు మంచి థ్రిల్ పంచుతుంది. ఒరిజినల్ కంటే కూడా సీక్వెల్ అదరగొడుతోంది. అదే ‘బ్లాక్ ఫోన్ 2’ మూవీ. ఓటీటీలో ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ భయపెడుతోంది.

బ్లాక్ ఫోన్ 2 ఓటీటీ
ఓటీటీలోకి థ్రిల్లర్లకు, అందులోనూ హారర్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ఇక హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ల స్థాయి మరో లెవల్. ఈ సినిమాల్లోని ట్విస్ట్ లు, ఉత్కంఠ.. అవి కలిగించే భయం ఇంకో లెవల్. అలాంటి ఓ సూపర్ నేచురల్ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ సినిమానే ‘బ్లాక్ ఫోన్ 2’. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
సీక్వెల్
2022లో బ్లాక్ ఫోన్ మూవీ వచ్చింది. అది 1978 కాలంలో సాగుతుంది. సీరియల్ కిల్లర్ (ది గ్రాబర్) 13 ఏళ్ల ఫిన్నీని కిడ్నాప్ చేస్తాడు. కానీ అక్కడ గోడకు ఉన్న పనిచేయని బ్లాక్ ఫోన్ తో ఆత్మలు అతనితో మాట్లాడతాయి. గ్రాబర్ నుంచి ఫిన్నీ తప్పించుకోవడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. దీని సీక్వెల్ అక్టోబర్ 31, 2025న థియేటర్లలో రిలీజైంది.
డాక్టర్ స్ట్రేంజ్ డైరెక్టర్
హాలీవుడ్ లో పాపులర్ సినిమాలైన డాాక్టర్ స్ట్రేంజ్, సినిస్టర్ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన స్కాట్ డెరిక్సన్ ఈ బ్లాక్ ఫోన్, బ్లాక్ ఫోన్ 2 మూవీస్ డైరెక్టర్. ఇందులో ఈథన్ హాక్, మాసన్ థేమ్స్, మాడలిన్ మెక్ గ్రా, జెరెమీ డేవిస్ తదితరులు నటించారు.
బ్లాక్ ఫోన్ 2 స్టోరీ
బ్లాక్ ఫోన్ ఫస్ట్ పార్ట్ ఎండ్ అయిన తర్వాత నాలుగేళ్లకు అంటే 1982లో బ్లాక్ ఫోన్ 2 కథ సాగుతుంది. ఫిన్నీకి అప్పుడప్పుడూ ఫోన్ రింగ్ అవుతున్న శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఫిన్నీ సిస్టర్ గ్వెన్ కు అతీంద్రియ శక్తులుంటాయి. ఆమెకు ఏవో కలలు వస్తాయి. మంచుతో నిండిన వింటర్ క్యాంప్ లో ముగ్గురు అబ్బాయిలను ఎవరో వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది.
మరోవైపు చనిపోయిన గ్రాబర్ ఈ సారి ఆత్మగా మారి వస్తాడు. మరింత పవర్స్ తో క్రూరంగా తయారవుతాడు. గ్వెన్ ను బంధిస్తాడు. మరి గ్వెన్ ను ఫిన్నీ ఎలా కాపాడుకున్నాడు? గ్వెన్ కు ఉన్న శక్తులేంటీ? ఫిన్నీకి సాయం చేసిన దెయ్యాలు ఏవరు? అనేది బ్లాక్ ఫోన్ 2 సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


