ఏంటీ బాసు సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి.. ఇదీ మన శంకర వరప్రసాద్ గారు మూవీలోని సాంగ్ లిరిక్స్. ఇందుకు తగ్గట్లే డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతికి అదరగొట్టాడు. చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరూ ఫ్లాప్ అన్నదే లేని రికార్డును కొనసాగించాడు. సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి సినిమాలేవో ఇక్కడ చూసేయండి.
వరుసగా 9

అనిల్ రావిపూడి కెరీర్ లో ఇప్పటివరకూ ఫ్లాప్ అన్నదే లేదు. 2015లో పటాస్ సినిమాతో స్టార్ట్ చేసి 2026లో మన శంకర వరప్రసాద్ గారు వరకు తొమ్మిది సినిమాలను డైరెక్ట్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ 9 మూవీస్ కూడా హిట్లే. ఒక్క ఫ్లాప్ కూడా లేదు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్.. ఇలా 9 సూపర్ హిట్లు అందుకున్నాడు అనిల్.
అనిల్ సంక్రాంతి సినిమాలు
ఇక సంక్రాంతి పండగకు రావడం హిట్ కొట్టడం అనిల్ రావిపూడికి అలవాటుగా మారింది. ఇప్పటివరకూ మొత్తం నాలుగు సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేశాడు అనిల్ రావిపూడి. అవే ఎఫ్2 (2019), సరిలేరు నీకెవ్వరు (2020), సంక్రాంతికి వస్తున్నాం (2025), మన శంకర వరప్రసాద్ గారు (2026). ఇప్పుడు వరుసగా సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారుతో బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతి హిట్లు కొట్టాడు.
ఫ్యాన్ పల్స్
అనిల్ రావిపూడి మేకింగ్ స్టైలే వేరు. ఫస్ట్ మూవీ పటాస్ నుంచి కూడా ఆయన కామెడీ యాంగిల్ వదల్లేదు. కామెడీకి ఫ్యామిలీ ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి హిట్లు అందుకుంటున్నాడు. ఆడియన్స్ కు కావాల్సింది ఫుల్ ఎంటర్ టైన్మెంట్. ఆ పల్స్ పట్టుకుని వరుసగా హిట్లు సాధిస్తున్నాడు. అనిల్ సినిమాకు వెళ్తే ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ అనే పేరు సంపాదించుకున్నాడు.
స్పీడ్ కు ఫిదా
{{/usCountry}}అనిల్ రావిపూడి మేకింగ్ స్టైలే వేరు. ఫస్ట్ మూవీ పటాస్ నుంచి కూడా ఆయన కామెడీ యాంగిల్ వదల్లేదు. కామెడీకి ఫ్యామిలీ ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి హిట్లు అందుకుంటున్నాడు. ఆడియన్స్ కు కావాల్సింది ఫుల్ ఎంటర్ టైన్మెంట్. ఆ పల్స్ పట్టుకుని వరుసగా హిట్లు సాధిస్తున్నాడు. అనిల్ సినిమాకు వెళ్తే ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ అనే పేరు సంపాదించుకున్నాడు.
స్పీడ్ కు ఫిదా
{{/usCountry}}అనిల్ రావిపూడి స్పీడ్ వేరే లెవల్. స్టోరీ రాసుకోవడం, హీరోను సెట్ చేసుకోవడం, మెరుపు వేగంతో షూటింగ్ కంప్లీట్ చేయడం అనిల్ స్టైల్. అందుకే 11 ఏళ్ల కెరీర్ లో 9 సినిమాలు తీశాడు. ఆయన సినిమా టేకింగ్ లో పెద్దగా రిస్క్ ఉండదు. ఆయా హీరోలను జనాలు ఎలా చూడాలనుకుంటున్నారు? వాళ్లతో మూవీ ఎలా తీస్తే నచ్చుతుందో అనిల్ కు బాగా తెలుసు.
అందుకే వెంకటేష్ లోని కామెడీ టైమింగ్ ను పట్టుకుని ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం హిట్లు అందుకున్నాడు అనిల్. ఇక భగవంత్ కేసరిలో బాలయ్య యాక్షన్ తో అదరగొట్టేలా చేశాడు. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి కామెడీ, డ్యాన్స్, ఫైట్లను ఫ్యాన్స్ కు నచ్చేలా తీశాడు.