మహేష్ బాబు ఫౌండేషన్‌తో బ్లూ క్లౌడ్ ఐటీ ఒప్పందం.. 'GMB Life' యాప్ లాంచ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫౌండేషన్‌తో ప్రముఖ ఐటీ సంస్థ బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా ఉచిత ఏఐ హెల్త్ స్క్రీనింగ్ యాప్ 'GMB Life'ను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు.

Published on: Aug 31, 2026, 14:31:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఏఐ టెక్నాలజీ సంస్థ బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ డిజిటల్ హెల్త్‌కేర్ రంగంలో కీలక మైలురాయిని చేరుకుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని నేతృత్వంలోని 'మహేష్ బాబు ఫౌండేషన్'తో ఈ స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

మహేష్ బాబు ఫౌండేషన్‌తో బ్లూ క్లౌడ్ ఐటీ ఒప్పందం.. 'GMB Life' యాప్ లాంచ్
మహేష్ బాబు ఫౌండేషన్‌తో బ్లూ క్లౌడ్ ఐటీ ఒప్పందం.. 'GMB Life' యాప్ లాంచ్

గౌతమ్ పుట్టినరోజున 'GMB Life' యాప్ అందుబాటులోకి

ఈ రెండు సంస్థల భాగస్వామ్యంలో మొదటి ప్రాజెక్ట్‌గా 'జిఎమ్‌బి లైఫ్' (GMB Life) అనే ప్రివెంటివ్ స్క్రీనింగ్ యాప్‌ను ఆవిష్కరించారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజును పురస్కరించుకుని ఈ యాప్‌ను ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లలో అందుబాటులోకి తెచ్చారు.

బ్లూ క్లౌడ్ సొంతంగా అభివృద్ధి చేసిన 'బ్లూహెల్త్' (BluHealth) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేదిక ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ కెమెరా సహాయంతో సాధారణ స్కానింగ్ ద్వారానే గుండె స్పందనల రేటు, రక్తపోటు (బిపి), శ్వాసక్రియ రేటు, స్ట్రెస్ ఇండెక్స్, బాడీ మాస్ ఇండెక్స్ (బిఎమ్‌ఐ), వాస్కులర్ ఏజ్ వంటి పలు ప్రాథమిక ఆరోగ్య వివరాలను ఒక్క నిమిషంలోనే ఈ యాప్ అంచనా వేస్తుంది. దీని కోసం ఎలాంటి మెడికల్ డివైజ్‌లు లేదా సూదుల అవసరం లేదు.

గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్‌కేర్ కియోస్క్‌లు

ఈ యాప్ ద్వారా మహేష్ బాబు ఫౌండేషన్ నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు, హెల్త్ క్యాంప్‌ల వివరాలు తెలుసుకోవడంతో పాటు నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. మలి విడత ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక హెల్త్‌కేర్ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. ఈ కియోస్క్‌ల ద్వారా స్థానిక వైద్యులు ప్రత్యక్షంగా లేదా టెలీ-కన్సల్టేషన్ విధానంలో రోగుల నివేదికలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందిస్తారు.

"సమయానికి వైద్యం దక్కక ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డను కోల్పోకూడదనే స్పష్టమైన లక్ష్యంతోనే మా ఫౌండేషన్ మొదలైంది. జిఎమ్‌బి లైఫ్ యాప్‌లోని బ్లూహెల్త్ ఏఐ టెక్నాలజీ ద్వారా స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా సులభంగా తమ ఆరోగ్య స్థితిని ప్రాథమికంగా పరీక్షించుకోవచ్చు" అని మహేష్ బాబు తెలిపారు.

"చిన్నారుల ప్రాణాలు కాపాడుతూ సామాజిక సేవలో ముందంజలో ఉన్న మహేష్ బాబు గారు, నమ్రత గారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. స్మార్ట్‌ఫోన్ సాంకేతికత ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి ఉచిత ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను అందించడమే మా ప్రధాన ఉద్దేశం" అని బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ గ్రూప్ ఛైర్మన్ తేజేష్ కుమార్ కొడాలి వెల్లడించారు.

స్టాక్ మార్కెట్ తీరు.. షేరు ప్రయాణం

మరోవైపు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, దలాల్ స్ట్రీట్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి మధ్య బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ షేరు ఈరోజు బీఎస్ఈలో రూ.20.25 వద్ద ప్రారంభమై స్వల్ప నష్టాల్లో ముగిసింది. గత శుక్రవారం ఈ షేరు క్రితం ముగింపు రూ.20.21 వద్ద ఉంది. పశ్చిమాసియాలో పెరిగిన ఆందోళనలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల వైఖరి కారణాలతో దేశీయ సూచీలు సైతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 284.52 పాయింట్లు క్షీణించి 76,979.99 వద్ద, నిఫ్టీ 58.10 పాయింట్లు పడిపోయి 24,117.55 వద్ద ముగిశాయి.

బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ స్మాల్ క్యాప్ షేరు గత వారంలో 12.43% క్షీణించగా, గత నెల రోజుల్లో 3% పైగా లాభపడింది. ఏడాది కాల పరిమితిలో 32% మేర పడిపోయినప్పటికీ, గడిచిన ఐదేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 242% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది.

(గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి పెట్టుబడులు పెట్టేముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More