ఓటీటీలోని పాపులర్ వెబ్ సిరీస్ ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. అసలు ఈ సిరీసే ఓ సంచనలం. అధికారం, ఆధిపత్యం కోసం సాగే పోరు చుట్టు అల్లుకున్న కథతో తెరకెక్కిన మీర్జాపూర్ లో అడ్డూ అదుపు లేని అసభ్య పదాలు, బోల్డ్ సీన్లు చాలానే ఉంటాయి. అందుకే ఈ సిరీస్ ఓటీటీలోకి రాగానే సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ సిరీస్ లో మూడు సీజన్ ల తర్వాత ఓ మూవీ నేరుగా థియేటర్లలోకి రానుంది.
మీర్జాపూర్ ది మూవీ రిలీజ్ డేట్

ఇండియన్ పాపులర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ మూడు సీజన్లు ఓటీటీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాయి. ఇక ఈ సిరీస్ జర్నీ సినిమాగా మారి బిగ్ స్క్రీన్ పై ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. మీర్జాపూర్ ది మూవీ పేరుతో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ డేట్ ను ఇవాళ (ఫిబ్రవరి 5) మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 4, 2026న రిలీజ్ కానుంది.
స్పెషల్ పోస్టర్ తో
మీర్జాపూర్ ది మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ స్పెషల్ పోస్టర్ తో పంచుకున్నారు. ఇందులో ఏడారిలోని ఓ మార్గంలో జీపులు వెళ్తున్నాయి. అందులో ఉన్న వ్యక్తుల దగ్గర పెద్ద పెద్ద తుపాకులున్నాయి. చివరి జీపుకు కుర్చీని తాడుతో కట్టి లాక్కెళ్తున్నట్లు ఉంది. మీర్జాపూర్ చిత్రం విడుదల తేదీ పోస్టర్ ను గురువారం అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేశాయి.
మీర్జాపూర్ గురించి
బోల్డ్ డైలాగ్స్, సీన్లతో మీర్జాపూర్ సింహాసనం దక్కించుకోవడం కోసం జరిగే పోరాటం నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కిన ఇందులో ఫస్ట్ సీజన్ 2018 నవంబర్ 16న రిలీజైంది. ఇది ప్రధానంగా కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డు భయ్యా (అలీ ఫజల్) మధ్య పోరాటం చుట్టూ సాగుతుంది.
మీర్జాపూర్ స్టోరీ
{{/usCountry}}బోల్డ్ డైలాగ్స్, సీన్లతో మీర్జాపూర్ సింహాసనం దక్కించుకోవడం కోసం జరిగే పోరాటం నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కిన ఇందులో ఫస్ట్ సీజన్ 2018 నవంబర్ 16న రిలీజైంది. ఇది ప్రధానంగా కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డు భయ్యా (అలీ ఫజల్) మధ్య పోరాటం చుట్టూ సాగుతుంది.
మీర్జాపూర్ స్టోరీ
{{/usCountry}}మీర్జాపూర్ ను డాన్ లా పాలిస్తుంటాడు కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి). తన కొడుకు మున్నా భయ్యా (దివ్యేందు శర్మ)కు అధికారం కట్టబెట్టాలని చూస్తాడు. కానీ బ్రదర్స్ అయిన గుడ్డు (అలీ ఫజల్), బబ్లూ ఎంట్రీతో సీన్ రివర్స్ అవుతుంది. 2020లో సీజన్ 2, 2024లో సీజన్ 3 స్ట్రీమింగ్ కు వచ్చాయి. సీజన్ 3లో కాలీన్ కనిపించకుండా పోతాడు.
దీంతో అధికారం కోసం అందరూ చూస్తుంటారు. మరి మీర్జాపూర్ మీద ఆధిపత్యం ఎవరికి దక్కింది? సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? అన్నది మీర్జాపూర్ ది మూవీలో చూసే అవకాశముంది. ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు.