Hanuman Ansh: భారీ బడ్జెట్‌లు, వందల కోట్ల రెమ్యునరేషన్లు కాదు.. ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించేది కేవలం కంటెంట్, అసలైన కథలు మాత్రమేనని బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా తేల్చి చెప్పారు. ముంబైలోని గ్రాండ్ హయత్ వేదికగా జరిగిన ఫిక్కీ ఫ్రేమ్స్ 2026 (FICCI Frames 2026) ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో రీసెంట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'హనుమాన్ అంశ్', హాలీవుడ్ హారర్ మూవీ 'అబ్సెషన్' సినిమాల సక్సెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

స్టార్ పవర్ కంటే కంటెంట్ గొప్పదని చెప్పడానికి ఈ రెండు సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని ఆయుష్మాన్ అన్నారు. ప్రేక్షకులు ఓటీటీలు, రకరకాల ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ చూస్తున్న ఈ రోజుల్లో థియేటర్‌కి రావాలంటే కథలో సత్తా ఉండాలని స్పష్టం చేశారు.
రూ.2 కోట్ల బడ్జెట్.. ఏకంగా రూ.300 కోట్ల సునామీ
విశాల్ చతుర్వేది డైరెక్షన్‌లో తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' మూవీ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా (మహారాజ్ జీ) జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంది. కేవలం రూ.2 కోట్ల అత్యల్ప బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు కేవలం రూ.10 లక్షల ఓపెనింగ్స్ మాత్రమే సాధించింది. కానీ వర్డ్ ఆఫ్ మౌత్‌తో పుంజుకుని, థియేటర్లలో ఏకంగా 50 రోజులు పూర్తి చేసుకుని ఇండియాలో రూ.300 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది.
లక్ష్మణ్ దాస్ ఆధ్యాత్మిక ప్రయాణం, 13 ఏళ్ల వయస్సు నుంచి ఆయన నీమ్ కరోలీ బాబాగా ఎలా మారారనేది నటుడు శోభినావ్ సత్య తన అద్భుత నటనతో ఆవిష్కరించారు. నాలుగో వారంలో ఈ సినిమా చూపించిన గ్రోత్ బాక్సాఫీస్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది.
7 లక్షల డాలర్ల బడ్జెట్.. 30 కోట్ల డాలర్ల హాలీవుడ్ మ్యాజిక్
మరోవైపు హాలీవుడ్లో రిలీజైన 'అబ్సెషన్' హారర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం 20 ఏళ్ల యూట్యూబర్ కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దాదాపు 700k డాలర్ల (రూ. 5 నుండి 6 కోట్లు) స్వల్ప బడ్జెట్‌తో రూపొందించారు. కానీ థియేటర్లలో ఈ సినిమా ఏకంగా $300 మిలియన్లకు పైగా వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది.
{{/usCountry}}మరోవైపు హాలీవుడ్లో రిలీజైన 'అబ్సెషన్' హారర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం 20 ఏళ్ల యూట్యూబర్ కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దాదాపు 700k డాలర్ల (రూ. 5 నుండి 6 కోట్లు) స్వల్ప బడ్జెట్‌తో రూపొందించారు. కానీ థియేటర్లలో ఈ సినిమా ఏకంగా $300 మిలియన్లకు పైగా వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది.
{{/usCountry}}ఒక మాయా వస్తువు (వన్ విష్ విల్లో) ద్వారా తాను ప్రేమించిన అమ్మాయిని వశపరుచుకోవాలనుకునే ఒక కుర్రాడి కథతో ఈ సినిమా సాగుతుంది. మైకేల్ జాన్‌స్టన్, ఇండే నవరెట్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సీటు అంచున కూర్చోబెట్టే సైకలాజికల్ హార్రర్ డ్రామా గ్లోబల్ వైడ్‌గా పిచ్చి క్రేజ్ తెచ్చుకుంది.
'ఉడ్తా తీర్'తో ఒరిజినల్ రూట్‌లోకి ఆయుష్మాన్
తన కెరీర్ గురించి చెబుతూ.. "నా మొదటి సినిమా నుంచీ కథనే అసలైన సూపర్‌స్టార్ అని నమ్మాను. ఇప్పటివరకు చేసిన 20కి పైగా సినిమాల్లో రకరకాల జానర్లు ట్రై చేశాను. కానీ ఇప్పుడు మళ్లీ నా ఒరిజినల్ రూట్ అయిన అథెంటిక్ స్టోరీ టెల్లింగ్‌కి వెళ్తున్నాను" అని ఆయుష్మాన్ అన్నారు.
ప్రస్తుతం ఆయన 'ఉడ్తా తీర్' అనే స్పై కామెడీ సినిమాలో నటిస్తున్నారు. శ్రీరామ్ రాఘవన్, డెన్జిల్ డియాస్ (వార్నర్ బ్రదర్స్) సమక్షంలో జరిగిన ఈ ప్యానెల్ డిస్కషన్‌లో ఆయుష్మాన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.