...
...
Next Story

ఈ వెబ్ సిరీస్ కోసం రోజుకు 12 గంటలు పని చేశాం.. రోజుకు 8 గంటల పని అన్నది ఆమె ఇష్టం: బాలీవుడ్ సీనియర్ నటి కామెంట్స్

దీపికా పదుకోన్ 8 గంటలు షిఫ్ట్ డిమాండ్ పై సీనియర్ నటి మాధురీ దీక్షిత్ స్పందించింది. ఆమె లేటెస్ట్ వెబ్ సిరీస్ మిసెస్ దేశ్‌పాండే ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడిన ఆమె.. తాను రోజుకు 12 గంటలపాటు పని చేసినట్లు తెలిపింది.

Published on: Dec 01, 2025 10:04 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

'స్పిరిట్', 'కల్కి' సీక్వెల్ నుంచి దీపికా పదుకోన్ తప్పుకోవడానికి పని గంటలే కారణమన్న చర్చ టాలీవుడ్, బాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. దీనిపై తాజాగా సీనియర్ నటి మాధురీ దీక్షిత్ స్పందించింది. తాను 'వర్క్‌హాలిక్' అని, తన వెబ్ సిరీస్ కోసం 12 గంటలు పనిచేశానని చెబుతూనే, దీపికా నిర్ణయాన్ని సమర్థించేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

దీపిక డిమాండ్‌పై మాధురి ఇలా..

ఈ వెబ్ సిరీస్ కోసం రోజుకు 12 గంటలు పని చేశాం.. రోజుకు 8 గంటల పని అన్నది ఆమె ఇష్టం: బాలీవుడ్ సీనియర్ నటి కామెంట్స్
ఈ వెబ్ సిరీస్ కోసం రోజుకు 12 గంటలు పని చేశాం.. రోజుకు 8 గంటల పని అన్నది ఆమె ఇష్టం: బాలీవుడ్ సీనియర్ నటి కామెంట్స్

సందీప్ రెడ్డి వంగా ప్రతిష్టాత్మక మూవీ 'స్పిరిట్' (Spirit), నాగ్ అశ్విన్ భారీ ప్రాజెక్ట్ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ నుంచి స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తప్పుకోవడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఆమె కేవలం 8 గంటల షిఫ్ట్ మాత్రమే చేస్తానని కోరడమే ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి సినీ పరిశ్రమలో పనివేళల గురించి వాడివేడి చర్చ నడుస్తోంది. తాజాగా ఈ డిబేట్‌లోకి సీనియర్ నటి మాధురీ దీక్షిత్ ఎంట్రీ ఇచ్చింది.

ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ మాధురీ దీక్షిత్ తన పని తీరు గురించి, అలాగే నటీమణుల హక్కుల గురించి మాట్లాడింది. "విషయం ఏంటంటే.. మేము 'మిసెస్ దేశ్‌పాండే' చేస్తున్నప్పుడు ప్రతిరోజూ 12 గంటల షిఫ్ట్‌లు చేసేవాళ్ళం. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే ఉండేది. అయితే ఎవరి పద్ధతి వారిది. నేనొక వర్క్‌హాలిక్‌ని. కాబట్టి నా విషయం వేరు కావచ్చు. కానీ ఒక మహిళకు 'నేను ఇన్ని గంటలే పని చేస్తాను' అని చెప్పే శక్తి, అధికారం ఉంటే.. అది ఆమె ఇష్టం, ఆమె లైఫ్. ఆమె ఎలా చేయాలనుకుంటే అలా చేయొచ్చు. దానికి నా మద్దతు ఉంటుంది " అని మాధురీ చెప్పుకొచ్చింది.

అసలు వివాదం ఏంటి?

"పరిశ్రమలో చాలా మంది ప్రముఖ మేల్ స్టార్లు ఏళ్ల తరబడి 8 గంటల షిఫ్టులు చేస్తున్నారు. వారి గురించి ఎప్పుడూ వ్యతిరేక వార్తలు రాలేదు. ఒక స్త్రీగా నేను అడిగితే మాత్రం అది మొండితనం అనిపిస్తే.. అలాగే అనుకోనివ్వండి" అని ఆమె ఘాటుగా బదులిచ్చింది. సినిమా పరిశ్రమ బయటకి గ్లామరస్‌గా కనిపించినా, చాలా విషయాల్లో అస్తవ్యస్తంగా ఉంటుందని కూడా దీపికా పేర్కొంది.

'మిసెస్ దేశ్‌పాండే' గురించి..

నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ‘మిసెస్ దేశ్‌పాండే’.. ఫ్రెంచ్ థ్రిల్లర్ 'లా మాంటే' (La Mante) కు అధికారిక రీమేక్. ఒక కాపీక్యాట్ హంతకుడిని పట్టుకోవడానికి పోలీసులకు సహాయం చేసే ఒక సీరియల్ కిల్లర్ (మాధురీ) కథ ఇది. అయితే తన కొడుకుతో మాత్రమే కలిసి పనిచేస్తానని ఆమె షరతు విధించడం, తద్వారా వారి మధ్య ఏర్పడే భావోద్వేగ సంఘర్షణ ఈ కథలో కీలకం. ఈ సిరీస్ డిసెంబర్ 19న జియోహాట్‌స్టార్ లో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe