...
...
Next Story

సినిమాల్లో మ‌హిళ‌ల‌కు ఎక్స్పైరీ డేట్ ఏంటీ? పురుషులు మాత్రం 60 ఏళ్ల‌లోనూ రొమాన్స్ చేయొచ్చా: మండిప‌డ్డ న‌టి

నటీనటుల వయస్సుకు సంబంధించి భారతీయ చిత్ర పరిశ్రమ ద్వంద్వ ప్రమాణాలను మోనా సింగ్ తప్పుబట్టారు. మహిళలకు ఎక్స్పైరీ డేట్ ఏంటీ? అని ప్రశ్నించారు. పురుషులు 60 ఏళ్లలోనూ రొమాంటిక్ క్యారెక్టర్లు చేస్తున్నారని మండిపడ్డారు.

Published on: Jan 29, 2026, 10:12:19 IST
Advertisement

బాలీవుడ్ నటి మోనా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా బోర్డర్ 2 మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ సీనియర్ నటి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో డబుల్ స్టాండర్డ్స్ ను ప్రశ్నించింది. వయసు విషయంలో మహిళల పరంగా ఎందుకు తేడా చూపుతారని మండిపడింది.

మోనా సింగ్ కామెంట్లు

మోనా సింగ్ (instagram)
మోనా సింగ్ (instagram)

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న కొహ్రా సీజన్ 2లో మోనా సింగ్ పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో పీటీఐ ఇంటర్వ్యూలో మోనా సంచలన వ్యాఖ్యలు చేసింది. మోనా 44 ఏళ్ల వయసులో స్క్రీన్ పై 50, 60 ఏళ్ల ఏజ్ ఉన్న క్యారెక్టర్లలో నటించడం గురించి మాట్లాడింది.

అది పట్టించుకోలేదు

"నా ఆన్-స్క్రీన్ వయస్సు గురించి నేను పట్టించుకోలేదు. నేను నిజంగానే పట్టించుకోను. ఎందుకంటే నేను చాలా నమ్మకంగా ఉన్నా. ఆ క్యారెక్టర్ చేయగలనని తెలుసు. అలాగే నేనేంటో నాకు తెలుసు. నిరూపించుకోవడానికి కొత్తగా ఏమీ లేదు. అందుకే నేను రిస్క్ తీసుకుంటూనే ఉంటా. ప్రజలు తరచూ నన్ను.. ‘స్క్రీన్ పై ఎందుకు అంత పెద్ద వయసు క్యారెక్టర్లు చేస్తున్నార’ని అడుగుతున్నారు. అది నా క్యారెక్టర్ అని చెప్తా’’ అని మోనా సింగ్ తెలిపింది.

60 ఏళ్లకు రొమాన్స్

"ఈ ఇండియన్ చిత్ర పరిశ్రమలో మహిళలకు మాత్రమే వయసు పరంగా ఎక్స్పైరీ డేట్ ఎందుకు? ఇది చాలా విచారకరం. 60 ఏళ్ళలో ఉన్న పురుషులు ఇప్పటికీ స్క్రీన్ పై రొమాన్స్ చేస్తున్నారు. మరి మహిళలు ఎందుకు చేయలేరు?"అని మోనా మండిపడింది.

ఓటీటీ సిరీస్

"సరైన సమయం వచ్చినప్పుడు మీరు సరైన వ్యక్తులను కలుస్తారు. కొహ్రా 2లో భాగం కావడం చాలా అదృష్టంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నా. నేను కొహ్రా సీజన్ 1కు పెద్ద అభిమానిని. ఆ సీజన్ లో నేను ఎందుకు లేనా? అని అనుకుంటూ ఉంటా’’ అని మోనా సింగ్ చెప్పింది.

స్ట్రీమింగ్ డేట్

మోనా, బరుణ్ లతో పాటు రణ్ విజయ్ సింఘా, అనురాగ్ అరోరా, ప్రధుమన్ సింగ్, పూజా భమ్రా, ప్రయాక్ మెహతా తదితరులు నటించిన కొహ్రా సీజన్ 2 సిరీస్ ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks