...
...
Next Story

అతడికి యాక్టింగ్ రాదు- కానీ, తెలివిగా పాత్రలు ఎంచుకునేవాడు.. స్టార్ హీరోపై చిరు అందరివాడు హీరోయిన్ రిమీ సేన్ కామెంట్స్

ఒకప్పుడు బాలీవుడ్ వెండితెరపై మెరిసిన బ్యూటిఫుల్ హీరోయిన్ రిమీ సేన్ స్టార్ హీరోపై సంచలన కామెంట్స్ చేశారు. తన కో స్టార్ అయిన అతనికి కెరీర్ మొదట్లో యాక్టింగ్ రాదని, కానీ, పాత్రలను చాలా తెలివిగా సెలెక్ట్ చేసుకునేవాడని చెప్పుకొచ్చారు రిమీ సేన్. ఇప్పుడు రిమీ సేన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jan 23, 2026, 13:03:24 IST
Advertisement

‘ధూమ్’, ‘హంగామా’, ‘ఫిర్ హేరా ఫేరీ’ వంటి సూపర్ హిట్ సినిమాలతో 2000వ దశకంలో కుర్రకారు మనసు గెలుచుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ రిమీ సేన్. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ రిమీ సేన్ సినిమాలకు దూరంగా ఉంటూ, దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తున్నారు. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రిమీ సేన్ తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ స్టార్ హీరోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నటన రాకపోయినా వ్యూహంతో నెట్టుకొచ్చారు!

అతడికి యాక్టింగ్ రాదు- కానీ, తెలివిగా పాత్రలు ఎంచుకునేవాడు.. స్టార్ హీరోపై చిరంజీవి అందరివాడు హీరోయిన్ రిమీ సేన్ కామెంట్స్
అతడికి యాక్టింగ్ రాదు- కానీ, తెలివిగా పాత్రలు ఎంచుకునేవాడు.. స్టార్ హీరోపై చిరంజీవి అందరివాడు హీరోయిన్ రిమీ సేన్ కామెంట్స్

ఎవరైనా తమ పరిమితులను (Limitations) గుర్తించి పనిచేస్తే జీవితంలో చాలా దూరం వెళ్తారని రిమీ సేన్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంను రిమీ సేన్ ప్రస్తావించారు.

"కెరీర్ మొదట్లో జాన్ అబ్రహం ఒక మోడల్. అతనికి నటన అస్సలు తెలియదు. అప్పట్లో దీనిపై విమర్శలు వచ్చినా ఆయన ఎప్పుడూ నోరు విప్పలేదు. తన నటన కంటే బాడీ, లుక్స్ హైలైట్ అయ్యేలా జాగ్రత్త పడ్డారు. అందుకే ఎక్కువగా యాక్షన్ సినిమాలనే ఎంచుకున్నారు. ప్రజలు వేలెత్తి చూపకుండా ఉండేలా తన ప్లానింగ్ ఉండేది. అందుకే ఆయన్ని చాలా తెలివైన నటుడు అని అంటాను" అని రిమీ సేన్ వివరించారు.

మెల్లమెల్లగా నటన నేర్చుకున్నారు

ఒక్కసారి క్రేజ్ వచ్చాక, కెమెరా ముందు సమయం గడిపే కొద్దీ ఎవరైనా నటన నేర్చుకుంటారని రిమీ సేన్ అభిప్రాయపడ్డారు. "జాన్ అబ్రహం కూడా అలాగే చేశారు. పాపులారిటీ పెరిగిన తర్వాత మెల్లమెల్లగా యాక్టింగ్ నేర్చుకున్నారు. ఆ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు" అని రిమీ సేన్ తెలిపారు.

"ఆయన (జాన్ అబ్రహం) ఒక స్ట్రాటజిక్ నటుడు మాత్రమే కాదు, ఇప్పుడు మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ప్రొడక్షన్ రంగంలోకి వెళ్లి ఎన్నో క్రెడిబిలిటీ ఉన్న హిట్ సినిమాలను అందించారు" అని రిమీ సేన్ ప్రశంసించారు.

'ధూమ్' మ్యాజిక్

జాన్ అబ్రహం చివరిగా ‘టెహ్రాన్’ (Tehran) అనే స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో కనిపించారు. 2012లో ఇజ్రాయెల్ దౌత్యవేత్తలపై జరిగిన దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

ప్రస్తుతం అరుణ్ గోపాలన్ దర్శకత్వంలో జాన్ అబ్రహం‘తారిఖ్’ (Tariq) అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

చిరంజీవి సినిమాలో

ఇదిలా ఉంటే రిమీ సేన్ తెలుగులో కూడా హీరోయిన్‌గా నటించారు. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా అందరివాడు యాక్ట్ చేసి గ్లామర్‌తో మెప్పించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe