నా డిప్రెషన్‌కు కారణం విడాకులు కాదు, ఆమెతో విడిపోయాకే నేను కోలుకున్నా-భార్యతో విడాకులపై యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం, విడాకులు, మానసిక ఆరోగ్య ప్రయాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విడాకులే మానసిక సమస్యలకు కారణమన్న వార్తల్లో నిజం లేదని, నిజానికి ఆ అన్ హెల్తీ రిలేషన్ షిప్ నుంచి బయటకు వచ్చాకే తాను మళ్లీ కోలుకోగలిగానని స్పష్టం చేశారు.
బాలీవుడ్‌లో చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ఒకప్పుడు అలరించిన యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ చాలా కాలం తర్వాత తన వ్యక్తిగత విషయాలపై మనసు విప్పారు. ముఖ్యంగా తన విడాకుల చుట్టూ అల్లుకున్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. తన వైవాహిక జీవితం గురించి, అది తన మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేసిందనే దానిపై ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

ఆ బంధం ఆరోగ్యకరంగా లేదు..
తన చిన్ననాటి స్నేహితురాలు అవంతికా మాలిక్‌తో విడాకులపై టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. "మా ఇద్దరి మధ్య బంధం ఆరోగ్యకరంగా లేదని నాకు అర్థమైంది. మేము చాలా చిన్న వయసులో (18-19 ఏళ్లలో) ప్రేమలో పడ్డాం. ఆ వయసులో జీవితానుభవం తక్కువగా ఉంటుంది కాబట్టి, వ్యక్తుల మధ్య ఉండాల్సిన సరైన అవగాహన మాకు అప్పట్లో తెలియలేదు" అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
వీరిద్దరూ టీనేజర్స్‌గా ఉన్నప్పుడే డేటింగ్ మొదలుపెట్టి, 2011లో వివాహం చేసుకున్నారు. 2013లో వీరికి ఇమారా అనే కుమార్తె జన్మించింది. అయితే 2019లో మనస్పర్థల కారణంగా విడిపోయి, అదే ఏడాది విడాకులు తీసుకున్నారు.
విడాకులు ఒక టర్నింగ్ పాయింట్!
చాలామంది ఇమ్రాన్ ఖాన్ విడాకుల వల్లే డిప్రెషన్‌లోకి వెళ్లారని భావిస్తారు. కానీ, ఇమ్రాన్ ఖాన్ మాత్రం మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. "నేను మీడియాకు దూరంగా ఉండటంతో చాలా రకాల పుకార్లు వచ్చాయి. విడాకులే నా మానసిక సమస్యలకు కారణమని జనం అనుకున్నారు. కానీ అసలు నిజం వేరు" అని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
"పెళ్లి బంధంలో ఉన్న చివరి రెండేళ్లే నా జీవితంలో అత్యంత దారుణమైన రోజులు. ఆ బంధం నుంచి బయటకు రావాలని నేను తీసుకున్న నిర్ణయమే నా మానసిక ఆరోగ్య ప్రయాణంలో ఒక టర్నింగ్ పాయింట్. మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకోలేకపోయేవాళ్లం. విడిపోయిన తర్వాతే నేను కోలుకోవడం ప్రారంభించాను" అని ఇమ్రాన్ వివరించారు.
మళ్లీ కెమెరా ముందుకు..
దాదాపు దశాబ్ద కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు. ఈ ఏడాది తన స్నేహితుడు వీర్ దాస్ దర్శకత్వంలో 'హ్యాపీ పటేల్' అనే సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన ఇమ్రాన్ త్వరలో హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
భూమి పెడ్నేకర్‌తో జంటగా నటిస్తున్న ‘అధూరే హమ్ అధూరే తుమ్’ (Adhure Hum Adhure Tum) చిత్రంతో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


