స్టార్ హీరోను ఉక్కిరిబిక్కిరి చేసిన అభిమానులు- ఒక్కసారిగా స్టేజ్ మీదకు దూసుకొచ్చిన ఫ్యాన్స్- హీరో చేసిన తప్పుతోనే రచ్చ!

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ అభిమానులు రెచ్చిపోయారు. తమ అభిమాన హీరోను ఉక్కిరిబిక్కిరి చేశారు. ‘ఓ రోమియో’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ముంబైలో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో షాహిద్ కపూర్‌ను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. 

Published on: Feb 7, 2026, 14:53:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఓ రోమియో’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం ముంబైలో ‘పాన్ కీ దుకాన్’ అనే పాటను విడుదల చేశారు. అయితే, ఓ రోమియో సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఊహించని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అభిమానుల ఉత్సాహం హద్దులు దాటడంతో హీరో షాహిద్ కపూర్‌కు కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

స్టార్ హీరోను ఉక్కిరిబిక్కిరి చేసిన అభిమానులు- ఒక్కసారిగా స్టేజ్ మీదకు దూసుకొచ్చిన ఫ్యాన్స్- హీరో చేసిన తప్పుతోనే రచ్చ!
స్టార్ హీరోను ఉక్కిరిబిక్కిరి చేసిన అభిమానులు- ఒక్కసారిగా స్టేజ్ మీదకు దూసుకొచ్చిన ఫ్యాన్స్- హీరో చేసిన తప్పుతోనే రచ్చ!

స్టేజ్ మీదకు ఎగబడ్డ అభిమానులు

సాంగ్ లాంచ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో షాహిద్ కపూర్ తనతో పాటు డాన్స్ చేయడానికి కొందరు అభిమానులను స్టేజ్ మీదకు ఆహ్వానించారు. అలా హీరో చేసిన ఒక్క తప్పుతో ఆ ఒక్క క్షణంలోనే పరిస్థితి తలకిందులైంది. అనుమతి లేని వారు కూడా భారీ సంఖ్యలో స్టేజ్ మీదకు దూసుకువచ్చారు.

స్టేజ్ మీదకు దూసుకొచ్చిన ఫ్యాన్స్

ఒక్కసారిగా స్టేజ్ మీదకు దూసుకొచ్చిన ఫ్యాన్స్ షాహిద్ కపూర్‌ను అందరూ ఒకేసారి చుట్టుముట్టారు. తమ అభిమాన హీరోను అభిమానులంతా ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో అక్కడ తోపులాట మొదలైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగే వరకు షాహిద్ స్టేజ్ దిగి ఉండాల్సి వచ్చింది.

వీడియోలు వైరల్

సిబ్బంది ఫ్యాన్స్‌ను పంపించివేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తర్వాత షాహిద్ కపూర్ మళ్లీ స్టేజ్ మీదకు వచ్చారు. తన కోసం ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారితో కలిసి డాన్స్ చేసి అలరించారు షాహిద్. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విశాల్ భరద్వాజ్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్

ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ఓ రోమియో సినిమా హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా రూపొందింది. ఇందులో షాహిద్, తృప్తిలతో పాటు నానా పటేకర్, తమన్నా భాటియా, దిశా పటానీ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.

లోపాలను తెరపై చూపించడం

తన కెరీర్ గురించి షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. "కాలక్రమేణా నాకు లోతైన అర్థం ఉన్న పాత్రల మీద ఆసక్తి పెరిగింది. మనుషుల్లో ఉండే సంక్లిష్టతలు, వారిలోని లోపాలను తెరపై చూపించడం నాకు ఇష్టం. పరిపూర్ణమైన నటన కంటే సహజత్వానికి దగ్గరగా ఉండటమే ముఖ్యం" అని పేర్కొన్నారు.

వివాదంలో ‘ఓ రోమియో’

ఓ రోమియో సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఒక చట్టపరమైన చిక్కు వచ్చి పడింది. హుస్సేన్ ఉస్తారా కుమార్తె సనోబర్ షేక్ ఈ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన తండ్రి జీవితాన్ని ఈ సినిమాలో తప్పుగా చూపిస్తున్నారని, ఇది ఒక ‘అనధికారిక బయోపిక్’ అని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More