ఓ వైపు ధనుష్ తో డేటింగ్, పెళ్లి రూమర్లు బలంగా వినిపిస్తున్న సమయంలో మృణాల్ ఠాకూర్ పై మరో హీరో పూల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. బ్యూటీ మృణాల్ ఠాకూర్‌పై బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది పూల వర్షం కురిపించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
మృణాల్ పై పూల వర్షం

మృణాల్ ఠాకూర్‌పై బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది పూల వర్షం కురిపించాడు. మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది కలిసి ‘దో దీవానే షెహర్ మే’ సినిమా చేశారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ జంట తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొంది. అక్కడ బయట ఓ ఫొటోగ్రాఫర్ తో మాట్లాడుతున్న మృణాల్ ఠాకూర్‌పై గొడుగులో నింపుకుని వచ్చిన పూలతో వర్షం కురిపించాడు సిద్ధాంత్. దీనికి ఇంప్రెస్ అయిన మృణాల్ రియాక్షన్ వైరల్ గా మారింది.
స్టేజీ పై మళ్లీ
దో దీవాని షెహర్ మే ప్రమోషనల్ ఈవెంట్ స్టేజీపైనా సిద్ధాంత్ చతుర్వేది మళ్లీ ఆ పని చేశాడు. మృణాల్ ఠాకూర్‌పై పూలు కురిపించాడు. ఇప్పుడీ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లిద్దరి రియాక్షన్లు చూస్తే ఏదో ఉందనే పుకార్లు వినిపిస్తున్నాయి.
ధనుష్ తో డేటింగ్
{{/usCountry}}దో దీవాని షెహర్ మే ప్రమోషనల్ ఈవెంట్ స్టేజీపైనా సిద్ధాంత్ చతుర్వేది మళ్లీ ఆ పని చేశాడు. మృణాల్ ఠాకూర్‌పై పూలు కురిపించాడు. ఇప్పుడీ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లిద్దరి రియాక్షన్లు చూస్తే ఏదో ఉందనే పుకార్లు వినిపిస్తున్నాయి.
ధనుష్ తో డేటింగ్
{{/usCountry}}తమిళ స్టార్ హీరో ధనుష్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 14న వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ మృణాల్ ఠాకూర్ టీమ్ ఈ పుకార్లను ఖండించింది. ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనని చెప్పింది. అయినా ధనుష్, మృణాల్ ఠాకూర్ మధ్య డేటింగ్ రూమర్లు హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు ఈ హీరోతో
కొంతకాలంగా మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది క్లోజ్ గా ఉంటున్నారు. బయట ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. అయితే వీళ్లిద్దరు కలిసి దో దీవాని షెహర్ మే సినిమా చేశారు కాబట్టి ప్రమోషన్ ఈవెంట్ల కోసం కలిసి వెళ్తున్నారు. కానీ కేవలం మూవీ ప్రమోషన్లే కాకుండా వీళ్లిద్దరు కలిసి బయట కనిపించారనే వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఏదో సమథింగ్ ఉందనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.
మృణాల్ ఠాకూర్ సినిమాలు
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. దో దీవానే షెహర్ మే సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. మరోవైపు అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ చేసిన తెలుగు మూవీ డెకాయిట్ ఏమో ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.