సంగీత ప్రపంచంలో మల్లిక్ కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఆ ఇంటి పేరే తన కెరీర్‌కు అడ్డంకిగా మారిందని ప్రముఖ సంగీత దర్శకుడు అమాల్ మల్లిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బిగ్ బాస్ 19లో మెరిసిన అమాల్ మల్లిక్ తాజాగా పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పదేళ్ల సుదీర్ఘ పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.
15 ఏళ్లకే రోడ్డు మీదకు వచ్చా..

సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ 15 ఏళ్ల నుంచే తాను పనులు వెతుక్కున్నానని అమాల్ తెలిపారు. "నాకు 15 నుంచి 25 ఏళ్ల వరకు చాలా కష్టమైన కాలం. ఓ కొడుకుగా బాధ్యత నెరవేర్చడం కోసం ఆ వయసులోనే అసిస్టెంట్, రన్నర్‌గా పనిచేశాను. పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలకు హార్డ్ డిస్క్‌లు చేరవేసే పని కూడా చేశాను. చేతికి దొరికిన చిన్న చిన్న పనులే నాకు జీవనాధారమయ్యాయి" అని అమాల్ మల్లిక్ తన గతాన్ని వివరించారు.
ఇంటిపేరు తెలిస్తే చాలు ఉద్యోగం పీకేసేవారు!
నేపథ్యం ఉన్నవారికి అవకాశాలు సులభంగా వస్తాయనేది అందరి నమ్మకం. కానీ, పాపులర్ సంగీత దర్శకుడు అమాల్ మల్లిక్ విషయంలో అది రివర్స్ అయింది.
"నాకు ఎక్కడైనా అసిస్టెంట్‌గా ఉద్యోగం దొరికినా, నా ఇంటి పేరు 'మల్లిక్' అని తెలిసిన మరుక్షణం నన్ను పనిలో నుంచి తీసేసేవారు. 'వీడు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు.. మన మ్యూజిక్ బయట ఎక్కడైనా అమ్మేస్తాడేమో' అనే అపోహ అప్పట్లో ఉండేది. ఆ అపోహ నాకూ, నా తమ్ముడు అర్మాన్ మల్లిక్‌కు చాలా నష్టం చేసింది. మాకు ఏదీ వెండి పళ్లెంలో పెట్టి వడ్డించలేదు (ఏది సుఖంగా రాలేదన్న అర్థంలో)" అంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు అమాల్.
బిగ్ బాస్ నుంచి బాక్సాఫీస్ వరకు..
సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో' సినిమాతో అమాల్ మల్లిక్ సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 'సూరజ్ దూబా హై' వంటి సూపర్ హిట్ పాటలతో గుర్తింపు తెచ్చుకున్న అమాల్ మల్లిక్.. ఎయిర్ లిఫ్ట్, బాఘీ, బద్రీనాథ్ కీ దుల్హనియా వంటి ఎన్నో చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.
{{/usCountry}}సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో' సినిమాతో అమాల్ మల్లిక్ సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 'సూరజ్ దూబా హై' వంటి సూపర్ హిట్ పాటలతో గుర్తింపు తెచ్చుకున్న అమాల్ మల్లిక్.. ఎయిర్ లిఫ్ట్, బాఘీ, బద్రీనాథ్ కీ దుల్హనియా వంటి ఎన్నో చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.
{{/usCountry}}ఇటీవల ముగిసిన బిగ్ బాస్ 19 రియాలిటీ షోలో అమాల్ మల్లిక్ టాప్-5 కంటెస్టెంట్‌గా నిలిచారు. హౌస్‌లో ఆయన ప్రవర్తనపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, అభిమానుల మద్దతుతో గ్రాండ్ ఫినాలే వరకు చేరుకున్నారు.
ఇంటిపేరే శాపంగా
ఐదో స్థానంలో నిలిచి అమాల్ మల్లిక్ బిగ్ బాస్ 19 నుంచి ఎలిమినేట్ అయ్యారు. తన ఇంటిపేరే తనకు శాపంగా మారిందని, కేవలం బ్యాక్ గ్రౌండ్ చూసి కాకుండా, టాలెంట్ చూసి గౌరవించాలని అమాల్ మల్లిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.