ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' సేకరించిన పత్రాల ప్రకారం స్టార్ సింగర్ సోను నిగమ్ రాయ్‌గడ్ జిల్లాలోని కర్జాత్ ప్రాంతంలో ఉన్న తన భూములను వేర్వేరు వ్యక్తులకు విక్రయించారు. మొత్తం నాలుగు లావాదేవీల ద్వారా ఈ అమ్మకాలు జరిగాయి.
నాలుగు విడతలుగా
వీటిలో మొదటి విడతగా 0.405 హెక్టార్లను రూ. 50 లక్షలకు, రెండో విడతలో 0.718 హెక్టార్లను రూ. 75 లక్షలకు విక్రయించారు. మిగిలిన రెండు విడతల్లో 0.607 హెక్టార్లను రూ. 50 లక్షలకు, చిన్న పార్శిల్, 0.208 హెక్టార్లను రూ. 20 లక్షలకు అమ్మేశారు బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్.
రూ. 11.70 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు
ఈ నాలుగు రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 7, 2026న పూర్తయ్యాయి. ఈ లావాదేవీల కోసం సోను నిగమ్ ప్రభుత్వం రూ. 11.70 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ భూములు కర్జాత్ తాలూకాలోని సవేలే గ్రామంలో ఉన్నాయి.
ముంబై 3.0గా కర్జాత్ హవా
ముంబైకి దగ్గరగా ఉండటం, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో కర్జాత్ ప్రస్తుతం 'సెకండ్ హోమ్' డెస్టినేషన్‌గా ప్రాచుర్యం పొందుతోంది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 'థర్డ్ ముంబై' (ముంబై 3.0)గా ప్రమోట్ చేస్తోంది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుండటంతో రాయ్‌గడ్ జిల్లా పరిధిలోని ఈ ప్రాంతాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.
అందుకే పెట్టుబడులు లేదా విక్రయం
ముంబైలో రద్దీని తగ్గించి, కొత్త ఆర్థిక హబ్‌గా మార్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మౌలిక సదుపాయాలను భారీగా అభివృద్ధి చేస్తోంది. అందుకే సెలబ్రిటీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం లేదా ఆస్తులను విక్రయించడం ద్వారా లాభాలను వెనకేసుకుంటున్నారు.
రియల్ ఎస్టేట్‌లో నిగమ్ కుటుంబం దూకుడు
సోను నిగమ్ కేవలం ఆస్తులు అమ్మడమే కాదు, గతేడాది భారీ అద్దె ఒప్పందాల ద్వారా వార్తల్లో నిలిచారు. 2025లో ముంబై శాంతాక్రజ్ ఈస్ట్ ప్రాంతంలో తనకున్న కమర్షియల్ ప్రాపర్టీని ఐదేళ్ల కాలానికి రూ. 12.61 కోట్ల అద్దెకు లీజుకు ఇచ్చారు. మరోవైపు ఆయన తండ్రి అగమ్ కుమార్ నిగమ్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో క్రియాశీలంగా ఉన్నారు. 2026 ఫిబ్రవరిలో ఆయన ముంబైలోని మాధ్ ఐలాండ్‌లో 1,197 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన నివాస, వాణిజ్య సముదాయాన్ని రూ. 10 కోట్లకు కొనుగోలు చేశారు.
బాలీవుడ్ ప్రముఖులు
{{/usCountry}}సోను నిగమ్ కేవలం ఆస్తులు అమ్మడమే కాదు, గతేడాది భారీ అద్దె ఒప్పందాల ద్వారా వార్తల్లో నిలిచారు. 2025లో ముంబై శాంతాక్రజ్ ఈస్ట్ ప్రాంతంలో తనకున్న కమర్షియల్ ప్రాపర్టీని ఐదేళ్ల కాలానికి రూ. 12.61 కోట్ల అద్దెకు లీజుకు ఇచ్చారు. మరోవైపు ఆయన తండ్రి అగమ్ కుమార్ నిగమ్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో క్రియాశీలంగా ఉన్నారు. 2026 ఫిబ్రవరిలో ఆయన ముంబైలోని మాధ్ ఐలాండ్‌లో 1,197 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన నివాస, వాణిజ్య సముదాయాన్ని రూ. 10 కోట్లకు కొనుగోలు చేశారు.
బాలీవుడ్ ప్రముఖులు
{{/usCountry}}కేవలం సోను నిగమ్ మాత్రమే కాకుండా, ఇటీవల నటి ప్రీతి జింటా కూడా బాంద్రాలో తన అపార్ట్‌మెంట్‌ను రూ. 18.5 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖులు వరుసగా రియల్ ఎస్టేట్ డీల్స్ కుదుర్చుకోవడం చూస్తుంటే, ముంబై రియల్ మార్కెట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.