Sonu Nigam Land Sell: 1.9 హెక్టార్ల వ్యవసాయ భూమిని అమ్ముకున్న సింగర్ సోను నిగమ్- ముంబై 3.0గా రియల్ ఎస్టేట్ లావాదేవీలు!

Sonu Nigam Sell 1.9 Hectares Agricultural Land: ప్రముఖ నేపథ్య గాయకుడు సోను నిగమ్ మహారాష్ట్రలోని కర్జాత్ ప్రాంతంలో తనకు ఉన్న సుమారు 1.9 హెక్టార్ల వ్యవసాయ భూమిని విక్రయించారు. ముంబై 3.0గా ఎదుగుతున్న ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Apr 13, 2026, 16:52:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' సేకరించిన పత్రాల ప్రకారం స్టార్ సింగర్ సోను నిగమ్ రాయ్‌గడ్ జిల్లాలోని కర్జాత్ ప్రాంతంలో ఉన్న తన భూములను వేర్వేరు వ్యక్తులకు విక్రయించారు. మొత్తం నాలుగు లావాదేవీల ద్వారా ఈ అమ్మకాలు జరిగాయి.

1.9 హెక్టార్ల వ్యవసాయ భూమిని అమ్ముకున్న సింగర్ సోను నిగమ్- ముంబై 3.0గా రియల్ ఎస్టేట్ లావాదేవీలు! (Photo:    HTBS)
1.9 హెక్టార్ల వ్యవసాయ భూమిని అమ్ముకున్న సింగర్ సోను నిగమ్- ముంబై 3.0గా రియల్ ఎస్టేట్ లావాదేవీలు! (Photo: HTBS)

నాలుగు విడతలుగా

వీటిలో మొదటి విడతగా 0.405 హెక్టార్లను రూ. 50 లక్షలకు, రెండో విడతలో 0.718 హెక్టార్లను రూ. 75 లక్షలకు విక్రయించారు. మిగిలిన రెండు విడతల్లో 0.607 హెక్టార్లను రూ. 50 లక్షలకు, చిన్న పార్శిల్, 0.208 హెక్టార్లను రూ. 20 లక్షలకు అమ్మేశారు బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్.

రూ. 11.70 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు

ఈ నాలుగు రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 7, 2026న పూర్తయ్యాయి. ఈ లావాదేవీల కోసం సోను నిగమ్ ప్రభుత్వం రూ. 11.70 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ భూములు కర్జాత్ తాలూకాలోని సవేలే గ్రామంలో ఉన్నాయి.

ముంబై 3.0గా కర్జాత్ హవా

ముంబైకి దగ్గరగా ఉండటం, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో కర్జాత్ ప్రస్తుతం 'సెకండ్ హోమ్' డెస్టినేషన్‌గా ప్రాచుర్యం పొందుతోంది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 'థర్డ్ ముంబై' (ముంబై 3.0)గా ప్రమోట్ చేస్తోంది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుండటంతో రాయ్‌గడ్ జిల్లా పరిధిలోని ఈ ప్రాంతాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.

అందుకే పెట్టుబడులు లేదా విక్రయం

ముంబైలో రద్దీని తగ్గించి, కొత్త ఆర్థిక హబ్‌గా మార్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మౌలిక సదుపాయాలను భారీగా అభివృద్ధి చేస్తోంది. అందుకే సెలబ్రిటీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం లేదా ఆస్తులను విక్రయించడం ద్వారా లాభాలను వెనకేసుకుంటున్నారు.

రియల్ ఎస్టేట్‌లో నిగమ్ కుటుంబం దూకుడు

సోను నిగమ్ కేవలం ఆస్తులు అమ్మడమే కాదు, గతేడాది భారీ అద్దె ఒప్పందాల ద్వారా వార్తల్లో నిలిచారు. 2025లో ముంబై శాంతాక్రజ్ ఈస్ట్ ప్రాంతంలో తనకున్న కమర్షియల్ ప్రాపర్టీని ఐదేళ్ల కాలానికి రూ. 12.61 కోట్ల అద్దెకు లీజుకు ఇచ్చారు. మరోవైపు ఆయన తండ్రి అగమ్ కుమార్ నిగమ్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో క్రియాశీలంగా ఉన్నారు. 2026 ఫిబ్రవరిలో ఆయన ముంబైలోని మాధ్ ఐలాండ్‌లో 1,197 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన నివాస, వాణిజ్య సముదాయాన్ని రూ. 10 కోట్లకు కొనుగోలు చేశారు.

బాలీవుడ్ ప్రముఖులు

కేవలం సోను నిగమ్ మాత్రమే కాకుండా, ఇటీవల నటి ప్రీతి జింటా కూడా బాంద్రాలో తన అపార్ట్‌మెంట్‌ను రూ. 18.5 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖులు వరుసగా రియల్ ఎస్టేట్ డీల్స్ కుదుర్చుకోవడం చూస్తుంటే, ముంబై రియల్ మార్కెట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More