...
...
Next Story

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం-భార్యతో కలిసి వెళ్తుండగా-బయటకు వచ్చి సాయం చేసిన నటుడు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన భార్యతో కలిసి వెళ్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ముంబయిలో ఈ ఘటన జరిగింది. యాక్సిడెంట్ తర్వాత అక్షయ్ కారు నుంచి బయటకు వచ్చి సాయం చేయడం విశేషం.

Published on: Jan 20, 2026, 08:39:28 IST
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ఆయన భార్య, రచయిత్రి, మాజీ నటి ట్వింకిల్ ఖన్నా సోమవారం (జనవరి 19) సాయంత్రం విదేశీ పర్యటన ముగించుకుని ముంబయిలోని ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ఎస్ యూవీ కారు, సెక్యూరిటీ కారు ప్రమాదానికి గురయ్యాయి. హిందుస్థాన్ టైమ్స్ ప్రత్యేక నివేదిక ప్రకారం, జుహులోని వారి ఇంటికి విమానాశ్రయం నుండి వస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

అక్షయ్ కుమార్ కారు యాక్సిడెంట్

అక్షయ్ కుమార్ కారుకు రోడ్డు ప్రమాదం (HT)
అక్షయ్ కుమార్ కారుకు రోడ్డు ప్రమాదం (HT)

ప్రత్యక్ష సాక్షులు ఇది వింత ప్రమాదంగా పేర్కొన్నారు. స్థానిక నివేదికల ప్రకారం వేగంగా వస్తున్న మెర్సిడెస్ కారు ఆటో రిక్షాను ఢీ కొట్టింది. ఆ ఆటో రిక్షా అక్షయ్ కుమార్ సెక్యూరిటీ ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ కారు వెళ్లి అక్షయ్, ట్వింకిల్ ఉన్న ఎస్ యూవీని ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ, ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని, ఆటో డ్రైవర్, ప్రయాణికులతో సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది.

గందరగోళం

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా కారు యాక్సిడెంట్ అరేబియా సముద్ర తీరానికి సమీపంలో, జుహులోని సిల్వర్ బీచ్ కేఫ్ ప్రాంతం వద్ద జరిగింది. వాహనాలు ఢీకొన్న వెంటనే అక్కడ గందరగోళం నెలకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చుట్టుపక్కల వారు ప్రమాదంలో చిక్కుకున్న వాళ్లకు సహాయం చేయడానికి పరుగులు తీశారు.

అక్షయ్ సాయం

హీరో అక్షయ్ కుమార్ కూడా తన కారు నుంచి బయటకు వచ్చి అక్కడి వాళ్లకు హెల్ప్ చేశాడు. ప్రమాదంలో చిక్కుకున్న వారికి అక్షయ్ కూడా తన కారు నుండి బయటకు వచ్చి సహాయం చేసినట్లు సమాచారం. ఒక ప్రత్యక్ష సాక్షి స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదం 'చూడటానికి భయంగా ఉంది' అని, ఎవరూ తీవ్రంగా గాయపడకపోవడం అదృష్టమని పేర్కొన్నారు.

గాయాలు లేకుండా

అయితే అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం జరిగిందనే వార్త కలకలంగా మారింది. ఇందులో అతని భార్య అక్షయ్ ఖన్నా కూడా ఉండటం మరింత ఆందోళన కలిగించింది. అయితే కారు మాత్రమే దెబ్బ తినడం, ఎవరికీ గాయం కాకపోవడంతో ఫ్యాన్స్ ఊరట పొందారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe