ఇండియన్ సినీ హిస్టరీలో ‘బోర్డర్’ మూవీ ఓ ఐకానిక్ ఫిల్మ్. 1997లో రిలీజైన ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. దేశభక్తి సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. 28 ఏళ్ల తర్వాత ఈ మూవీ సీక్వెల్ గా ‘బోర్డర్ 2’ వచ్చింది. 2026లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
బోర్డర్ 2 ఓటీటీ

థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బోర్డర్ 2 మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ దేశభక్తి సినిమా డిజిటల్ డెబ్యూ చేసేందుకు రెడీ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 20 నుంచి ఓటీటీ ఆడియన్స్ కు బోర్డర్ 2 మూవీ అందుబాటులోకి రానుంది.
బ్లాక్ బస్టర్
జనవరి 23, 2026న థియేటర్లలో రిలీజైన బోర్డర్ 2 సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1971 ఇండో-పాక్ వార్ నేపథ్యంలో 1997లో బోర్డర్ మూవీ రిలీజైంది. 28 ఏళ్ల తర్వాత 2026లో వచ్చిన బోర్డర్ 2 కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ తదితరులు నటించాారు.
రూ.480 కోట్లు
బోర్డర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.480 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. సీక్వెల్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ బోర్డర్ 2 సినిమాను టీ సిరీస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ ఉమ్మడిగా నిర్మించాయి. ఇందులో అహాన్ శెట్టి, మోనా సింగ్, సోనమ్ బజ్వా తదితరులు కూడా నటించారు.
బోర్డర్ 2 స్టోరీ
బోర్డర్ 2 మూవీ కూడా ఫస్ట్ పార్ట్ బోర్డర్ లాగే 1971 ఇండో-పాక్ వార్ నేపథ్యంలోనే సాగుతుంది. ఇండియాను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ కుట్రలు పన్నుతుంది. భూ, జల, వాయు మార్గాల ద్వారా ఇండియాపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ విషయం ముందే తెలుసుకున్న ఇండియన్ గవర్నమెంట్ పాక్ ను అడ్డుకునేందుకు త్రివిధ దళాలను బరిలో దింపుతుంది.
{{/usCountry}}బోర్డర్ 2 మూవీ కూడా ఫస్ట్ పార్ట్ బోర్డర్ లాగే 1971 ఇండో-పాక్ వార్ నేపథ్యంలోనే సాగుతుంది. ఇండియాను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ కుట్రలు పన్నుతుంది. భూ, జల, వాయు మార్గాల ద్వారా ఇండియాపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ విషయం ముందే తెలుసుకున్న ఇండియన్ గవర్నమెంట్ పాక్ ను అడ్డుకునేందుకు త్రివిధ దళాలను బరిలో దింపుతుంది.
{{/usCountry}}ఇందులో లెఫ్టినెంట్ కల్నల్ ఫతేహ్ సింగ్ ఖేల్కర్ (సన్నీ డియోల్), లెఫ్టినెంట్ కమాండర్ ఎంఎస్ రావత్ (అహాన్ శెట్టి), మేజర్ హోషియార్ సింగ్ దహియా (వరుణ్ ధావన్), ఎయిర్ ఫోర్స్ అఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ (దిల్జీత్ దోసాంజ్) ఎలాంటి పాత్ర పోషించారు? యుద్ధంలో ఎలా పోరాడారు? అనేది బోర్డర్ 2 మూవీలో చూడాల్సిందే.